రాయ్‌గఢ్‌లో కొండచరియలు విరిగిపడి.. 36 మంది మృతి
posted on Jul 23, 2021 @ 2:28PM
తెలుగు రాష్ట్రంలోనే కాదు. దేశంలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాలుఅదే పనిగా వర్షాలు కురవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ వర్షాల విలయానికి వంతెనలు కొండ చెరియలు కూడా కూలిపోతున్నాయి. వర్షపు నీటిలో కార్లు.. మనుషులు కొట్టుకుపోతున్నారు.. తెలంగాణాలో ములుగు నిర్మల్ లోని బైంసా లో ఇళ్ల మట్టానికి వర్షపు నీళ్లు వచ్చాయి.. ఆ నీళ్లు ఇంటికి రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా వరదలతో తీర రాష్ట్రం మహారాష్ట్ర అతలాకుతలమవుతోంది. రాయ్‌గఢ్, రత్నగిరి, కొల్హాపూర్ సహా పలు జిల్లాల్లో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో వర్షం కురవడంతో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. రాయ్‌గఢ్‌లో పలు చోట్ల కొండచరియలు విరిగిపడి 36 మంది ప్రాణాలు కోల్పోయారు.
అయితే రాయ్‌గఢ్‌లోని మహద్‌తలై సహా మూడు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో స్థానికంగా ఉన్న ఇల్లు ధ్వంసమై పదుల సంఖ్యలో ప్రజలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ప్రాణాలు చేతిలో పట్టుకుని బిక్కుబిక్కకుమని బతుకుతున్నారు. ఈ సంఘటనపై సమాచారమందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్, నేవీ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ఈ ఘటనల్లో ఒక్కటి కాదు రెండు కాదు ఇప్పటివరకు ఏకంగా 32 మంది మరణించినట్లు రాయ్‌గఢ్ కలెక్టర్ తెలిపారు. మరో 30 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
మరోవైపు కొండచరియలు విరిగిపడటంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ జాం అయింది ముంబై -గోవా హైవేపై కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. వెనక్కి రాలేక ముందుకు పోలేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అటు కొల్హాపూర్‌లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. భారీ వర్షాలకు ముంబయి- బెంగళూరు హైవే ఓ చోట కుంగిపోయింది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. రత్నగిరి జిల్లాలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి. వర్షాల ధాటికి తీర ప్రాంతాలు అల్లాడిపోతున్నాయి.