రౌండప్ 2022.. సోనియా, రాహుల్ కు ఈడీ సమన్లు

కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది. 2022 మోస్ట్ హ్యాపెనింగ్ ఇయర్ గా చెప్పుకోవచ్చు.  కొద్ది  రోజుల్లో 2022 వెళ్ళిపోతుంది. 2023 సంవత్సరం వచ్చేస్తుంది. క్యాలెండరు మారి పోతుంది. స్వాగత తోరణాలు, వీడ్కోలు వేడుకలు షరా మాములే ... కాలచక్రం కదులుతూనే ఉంటుంది... కానీ, వెళ్ళిపోతున్న 2022 సంవత్సరం, ఏమి సాధించింది, ఏమి మిగిల్చింది, ఏది పట్టుకు పోయింది, ఏమి బోధించింది, ఒక సారి వెనక్కి తిరిగి చూసుకుంటే .. సంవత్సర కాలంలో చెరగని ముద్ర వేసిన చేదు తీపి జ్ఞాపకాలను ఒక సారి సింహవలోకనం చేసుకుంటే..

జూన్

జూన్ 1...నేషనల్ హెరాల్డ్ కేసులో  జూన్ 8 న విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. సోనియా, రాహుల్ గాంధీ ఈడీ విచారణకు హాజరవుతారని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి తెలిపారు. అయితే, అనారోగ్య కారణాల వలన సోనియా గాంధీ ఆ రోజు విచారణకు హాజరు కాలేరనడంతో. జూన్ 23 న హాజరు కావాలని తాజా సమన్లు జారీ చేసింది. 
జూన్ 5... ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ 50వ పుట్టిన రోజు. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇతర ముఖ్య నేతలు యోగీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 
 మొహ్మద్ ప్రవక్త గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మను, ఢిల్లీ మీడియా ముఖ్యుడు నవీన్ కుమార జిందాల్  ను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.  
జూన్ 8.. ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద యాదవ్ కు పాటా హై కోర్టు రూ. 600 జరిమానా విధించింది. 

జూన్ 9.. రాష్ట్ర పతి రామనాథ్ కోవింద్ పదవీ కాలం జులై 24తో ముగుస్తుంది. దీంతో, కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూలు ప్రకటించింది. రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ జులై 18న జరుగుతుంది . కౌంటింగ్ జులై 21న చేపడతారు.  
జూన్ 10.. నాలుగు రాష్ట్రాలలోని 16 రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరిగింది.
జూన్ 11.. మహారాష్ట్రలో ఎన్నికలు జరిగిన మూడు రాజ్యసభ స్థానాలనూ బీజేపీ గెలుచుకుంది. గెలిచిన వారిలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మరో ఇద్దరు ఉన్నారు .
జూన్ 12...  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ,  ఎనిమిది సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామ సర్పంచ్ లకు లేఖ రాశారు. ఈ ఎనిమిదేళ్ళ కాలంలో గ్రామా స్వరాజ్ దిశగా వేసిన అడుగులు, అమలు చేసిన పథకాలను వివరించారు. 
జూన్13... నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని విచారించింది. ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ శ్రేణులు దేశ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. జూన్ 14 న కూడా ఈడీ విచారణ  కొనసాగింది 
జూన్ 14..  రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధి ఎంపికపై చర్చించేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీలో విపక్ష నేతల సమావేశం నిర్వహించారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పోటీ చేసేందుకు నిరాకరించారు.అలాగే ఫరూక్ అబ్దుల్లా, గోపాల కృష్ణ గాంధీ కూడా తమ నిరాసక్తత వ్యక్తం చేశారు. చివరకు జూన్ 20 న జరిగిన విపక్ష పార్టీల సమావేశంలో కేంద్ర  మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా పేరును ఖరారు చేశాయి. 


జూన్ 21..  ఝార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపతి ముర్మును ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించారు.
జూన్ 20.. కేంద్ర ప్రభుత్వం సైనికుల నియామకానికి ప్రకటించిన నూతన అగ్నిపధ్ పథకం పై విపక్షాలు విరుచుకు పడ్డాయి. సైన్యాధికారులు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ పథకాని వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.  
జూన్ 22.. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో సంక్షోభం మొదలైంది. శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండేతో ఆ పార్టీ అధికార ప్రతినిధి సామ్నా సంపాదకుడు సంజయ్ రౌత్ చర్చలు ప్రారంభించారు. షిండే పార్టీ వదలరని విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే రాజీనామాకు సిద్ధమయ్యారు. 
జూన్ 27.. ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హాకు తెరాస మద్దతు ప్రకటించింది.
జూన్ 29.. కేంద్ర ఎన్నికల సంఘం ఉపరాష్ట్రపతి ఎన్నిక షెడ్యూలు ప్రకటించింది. 
ఆగష్టు 6న ఉప రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే రాజీనామా చేశారు
జూన్ 30.. మహారాష్ట్ర సంక్షోభానికి తెర పడింది. శివసేన తిరుగుబాటు నేత ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రిగా, మజీ  ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగ్ ప్రమాణ స్వీకారం చేశారు.