ఆకాశంలో హెలికాప్టర్ల ఆక్సిడెంట్, 10మృతి
posted on Aug 30, 2012 @ 3:13PM
గుజరాత్‌లోని జామ్ నగర్ సమీపంలో ఏయిర్ ఫోర్సుకు చెందిన రెండు హెలికాప్టర్లు ఢీకొనడంతో 10మంది మృతి చెందారు. ఇంకా ఎవరైనా బతికి ఉన్నారనేది తెలియలేదు. హెలికాఫ్టర్లు రెండు ఎగిరిన వెంటనే కొంత దూరం వెళ్లి ఢీకోన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఎమ్ఐ-17 రకానికి చెందిన ఈ హెలికాప్టర్లను శిక్షణ కోసం ఉపయోగిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో రెండు హెలికాప్టర్లు నామరూపాల్లేకుండా పోయాయి. పైలట్ల పొరపాటు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ప్రమాదంలో మరణించిన వారిని గుర్తించే ప్రయత్నం జరుగుతోంది.