ఇక సెలవు.. ఇదే నా చివరి కాల్..
posted on May 22, 2021 @ 10:09AM
హైదరాబాద్ ఇది ఒక పెద్ద నగరం.. నగరం పెద్దది అయినా.. ఇక్కడ ఇల్లు చాలా ఇరుకు.. ఆ ఇరుకు ఇళ్లలాగే మనుషుల మనుషుల మనసులు కూడా చాలా ఇరుగ్గా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఊరు గొప్ప పేరు దిబ్బ అన్నట్లు ఉంటుంది ఇక్కడ యవ్వారం.. అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నానో మీరే చూడండి.
ఓపెన్ చేస్తే.. పురానాపూల్ చంద్రికాపురం. అతని పేరు కొమరాల లింగేశ్వర్‌రావు. ఆ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. లింగేశ్వర్‌రావు దంపతులు ఇద్దరు పద్నాలుగేళ్ల క్రితం మృతి చెందారు. తల్లిదండ్రులు మృతి చెందడం తో వారికి ఏం అర్ధం కాలేదు . ఎవరు వారిని దగ్గరికి తియ్యలేదు. వారికి ఎవరి సహాయం అందలేదు. చివరికి ఆ ముగ్గురు అన్నచెల్లెలు ఏం చేశారో చూడండి.
లింగేశ్వర్‌రావు పెద్దకుమారుడు కె.మధుసూదన్‌రావు(38) ఎల్‌ఐసీ ఏజెంట్. మరో కుమారుడు సందీప్‌కుమార్ (35) ప్రైవేటు ఉద్యోగి. కుమార్తె ప్రేమలత(36) ఇంట్లోనే ఉంటారు. వీరికి వివాహం కాలేదు. తల్లిదండ్రులు చనిపోయిన్పటికీ బస్తీలో అందరితో కలుపుగోలుగా ఉంటూ మేనమామ, బంధువుల సహకారంతో చదువులు పూర్తి చేసుకున్నారు. ఏడాదిన్నర క్రితం అప్పు చేసి తమ పాత ఇంటిని కూల్చి రెండంతస్తుల భవనం నిర్మించారు. అప్పులు తీరిన అనంతరం వివాహాలు చేసుకోవాలనుకున్నారు. మరోపక్క వడ్డీలు పెరిగిపోయి. ఆ అప్పులు తీరే మార్గం వాళ్లకు కన్పించలేదు. అప్పిచ్చిన వారి ఒత్తిడి తట్టుకోలేక గత ఏడు నెలలుగా ఇతర ప్రాంతాల్లో తలదాచుకున్నారు.
కట్ చేస్తే.. అప్పు ఎప్పటికైనా ముప్పే అన్నట్లు. వారు చేసుకున్న అప్పులే వారికి ముప్పై కూర్చుంది చివరికి. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న వారు తమ నూతన ఇంటికొచ్చి శుక్రవారం ఉదయం ఉరేసుకొన్నారు. ఆత్మహత్యకు పాల్పడడానికి ముందు సందీప్‌కుమార్ బేగంబజార్‌లోని తన మిత్రుడు గోవింద్‌సింగ్ (35)కు ఫోన్ చేశారు. మాటల మధ్యలో పొరపాటు నిర్ణయం తీసుకున్నామంటూ చెప్పారు. గోవింద్‌సింగ్ ఆ మాటలను అంతగా విశ్వసించలేదు. మధ్యాహ్నం గోవింద్‌సింగ్ తిరిగి సందీప్‌కుమార్‌కు ఫోను చేశాడు. ఎన్నిసార్లు చేసినా.. సమాధానం లేకపోవడంతో అనుమానం వచ్చి స్థానిక పోలీసులకు సమాచారమిచ్చాడు. వెంటనే ఇన్‌స్పెక్టర్ నరేశ్‌కుమార్, ఎస్సై నర్సింహారావు బృందం వెళ్లి పరిశీలించగా ఇరువురు సోదరులు, సోదరి ఉరేసుకొని ఆత్మహత్యకు పాలుపడ్డారు అని పోలిసులు తెలిపారు.
అమ్మానాన్న చనిపోయారు. అయినా వాళ్ళు దగ్గర తియ్యలేదు. పాపం ఏం చెయ్యాలో అర్థం కాక.. ఇలాంటి దారుణానికి పాల్పడ్డారు. సమస్యలు అందరికి ఉంటాయి కానీ చనిపోతే సమస్యలు తీరుతాయా చెప్పండి.. కొంచం క్షణికావేశంలో ప్రాణాలు తీసుకున్నారు.