ఆమెకు 65 ఏళ్ళు.. అబ్బాయికి 16 ఏళ్ళు.. చివరికి ఇలా..
posted on May 21, 2021 @ 9:36AM
అది ప్రకాశం జిల్లా. టంగుటూరు మండలం మల్లవరప్పాడు గ్రామంలో. ఒక వ్యక్తి కి చేపల చెరువులు ఉన్నాయి. అలాగే ఆ గ్రామ శివారులో బొప్పాయి తోట కూడా ఉంది.. అతని తల్లి రోజు ఆ బొప్పాయి తోట దగ్గరకు కాపలాగా వెళ్ళేది..ఎప్పటి ఆలాగే అతని తల్లి బొప్పాయి తోట దగ్గరికి వెళ్ళింది. కానీ తిరిగిరాలేదు.. ఆ వృద్ధురాలి కొడుకు కంగారు పడ్డాడు.. తల్లి ఏమైందో వెతకడం మొదలు పెట్టాడు. ఎంత వెతికిన ఆచూకీ తెలియపోయే సరికి పోలీసులకు పిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగి సినిమా లెవీల్లో రెక్కీ చేశారు. తలలు పట్టుకున్నారు. చివరికికి ఆ వృద్ధురాలు చనిపోయిందని ఫైనల్ చేశారు. ఆమె శవం ఉన్న చోటుని గుర్తించాడు. అసలు ఏం జరిగింది. ఆ హత్య ఎవరు చేశారు..?
ఎలా చేశారు...? తెలుసుకోవాలంటే..
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం వృద్ధురాలి కుమారుడికి రొయ్యల చెరువులున్నాయి. వాటిల్లో పని చేసేందుకు పశ్చిమ బెంగాల్‌కు చెందిన కొందరు కూలీలను కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామానికి తీసుకువచ్చాడు. తన స్వగ్రామం మల్లవరప్పాడులో తమ బొప్పాయి తోటలో పని చెయ్యడం కోసం ఈ నెల 13న ఇద్దరిని అక్కడికి పంపాడు. 14న కూడా వారికి అక్కడే పని చేయించాడు. అప్పుడే తోటకు వచ్చిన పూర్తిగా వినపడని, అంతంతమాత్రరగా మాట్లాడే వృద్ధురాలైన అతని తల్లి రోజు మాదిరిగానే ఈ నెల 14న తమ బొప్పాయి తోట వద్దకు కాపలాగా వెళ్లింది. తోట గేటు తీసే సమయంలో ఆమెకు, అక్కడ పనిచేస్తున్న బాలునికీ మధ్య వివాదం తలెత్తింది. ఆమె తనను దూషించిందని ఆ బాలుడు కోపంతో రగిలిపోయాడు. తోటలో గడ్డి కోసే పనిలో నిమగ్నమై ఉన్న ఆమెపై దోకుడు పారతో ఆ బాలుడు దాడి చేశాడు. ఆమె కింద పడిపోవటంతో మెడకు కండువా బిగించి హత్య చేయాలని చూశాడు. అప్పటికీ చనిపోకపోవడంతో బండరాయితో తలపై బాది ప్రాణాలు తీశాడు.
అయితే ఆ విషయం ఎవరికీ తెలియకూడదని తెలివి ప్రదర్శించాడు. ఏ పాపం తెలియనట్టు డ్రామాలు ఆడాడు. హత్య చేసి.. అత్యాచారం చేసిన తరువాత మృతదేహాన్ని ఎవరూ గుర్తించకుండా బిందు సేద్యం పైపులు, చెత్త వేసి వెళ్లిపోయాడు. అసలు ఏం తెలియనట్టు తర్వాత రోజు కూడా తను అక్కడే పని చేశాడు. తల్లి ఆచూకీ కోసం ఆమె కుమారుడు వెతుకూతూ ఉంటే.. తనకు తెలియనట్లుగా నటించాడు. చివరికి పోలీసు దర్యాప్తులో దొరికిపోయాడు.
అక్కడితోనే అతడి కసి తీరలేదు. దీంతో ప్రాణం లేని శరీరంతో తన లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. అయితే విషయం ఎవరికీ తెలియకూడదని భావించి మృతదేహంపై పైపులు, గడ్డి వేసి కప్పిపుచ్చే ప్రయత్నం చేశాడు. పొలానికి వెళ్లిన తల్లి ఇంటికి రాకపోవటంతో ఆమె కుమారుడు పలుచోట్ల వెదికినా ఆచూకీ లభ్యం కాలేదు. చివరికి బొప్పాయి తోటలోనే వృద్ధురాలు హత్యకు గురైన స్థితిలో గుర్తించి టంగుటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సింగరాయకొండ సీఐ కె.శ్రీనివాసులు ఈ హత్య కేసును దర్యాప్తు చేశారు. ఆ రోజు తోటలో పనిచేసిన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం 24 పరగణాల జిల్లాకు చెందిన బాలుడే ఈ హత్యకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని న్యాయస్థానం ఆదేశాల మేరకు జువైనల్ హోంకు తరలించినట్లు ఎస్సై నాయబ్‌రసూల్ చెప్పారు.