ప్రేమజంటకు సహాయం చేసిందని.. 16 ఏళ్ళ బాలికపై 8 మంది అత్యాచారం..
posted on Jul 8, 2021 @ 2:00PM
సహాయం చేస్తే ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు.. అవసరం అనుకుంటే అందలం ఎక్కిస్తారు.. కానీ వీళ్ళు వేరు.. వాళ్ళ ఆలోచన వేరు.. అందుకే రోజు రోజుకి మనుషుల్లో మానవత్వం చనిపోతుంది.. ఒక మనిషి మరో మనిషికి మాట సహాయం చేసిన జనం తట్టుకోలేకపోతున్నారు.. అవసరం అనుకుంటే అలా సహాయం చేసిన వాళ్లను చంపేస్తున్నారు కష్టాల్లోనూ.. బాధలోనూ.. ఎప్పుడు తోడు ఉండేది ఫ్రెండ్స్ మాత్రమే.. మనం కష్టం వచ్చిన.. ఏదైనా అవసరం వచ్చిన వెంటనే నేను ఉన్నాను అనే ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది ఉండరు.. అలాగే కొంత మంది చేసిన తప్పుకు వాళ్ళకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా సఫర్ అవుతుంటారు. మరి కొందరు అయితే ఫ్రెండ్స్ కి సహాయం చేసినందుకు పోలీసుల చేత దెబ్బలు.. జైలు కి కూడా వెళ్తుంటారు.. తాజాగా ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ తో వెళ్లిపోవడానికి మరో అమ్మాయి హెల్ప్ చేసిందని.. లేచిపోయిన అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ సభ్యులు కక్ష కట్టారు. చివరికి ఆ అమ్మాయిని ఏం చేశారో చూడండి..
వివరాలలోకి వెళితే అమ్రోహా రైల్వే స్టేషన్ సమీపంలో నివాసం ఉండే కుటుంబానికి చెందిన ఒక యువకుడు, తన పక్కింటి అమ్మాయి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇంట్లో తెలిస్తే ఒప్పుకోరని ఇద్దరు జూన్ 27న ఊరి నుంచి వెళ్లిపోయారు. వారు వెళ్లిపోవడంతో ఇరు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తమ ఇంటి అమ్మాయి వేరొక అబ్బాయితో వెళ్లిపోయిందన్న కోపం.. తమ పరువు నడిరోడ్డు మీద నిలబెట్టిందన్న రోషం.. వారి కోపం వారిని రాక్షసులుగా మార్చింది. తమ బిడ్డ వెళ్లిపోవడానికి ఎవరు సహకరించారో తెలుసుకుని నేరుగా యువకుడి కుటుంబ సభ్యులను ఓ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఆ జంట వెళ్లిపోవడానికి యువకుడి చెల్లి(16) సాయం చేసిందని తెలుసుకున్నారు. ఆ తర్వాత వారు ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 8 మంది ఆ అమ్మాయిపై సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా అందులో ఓ యువకుడు బలవంతంగా బాలిక మెడలో తాళికట్టి వివాహం చేసుకున్నాడు. ఈ విషయాలను బయట ఎవరికైనా చెప్తే చంపేస్తామంటూ ఆ బాలికతోపాటు ఆమె తల్లిదండ్రులను హెచ్చరించి విడిచిపెట్టారు. బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా, తొలుత స్వీకరించేందుకు పోలీసులు నిరాకరించారు. అయితే తనపై జరిగిన దారుణాన్ని బాలిక వివరించడంతో ఆ 8 మందిపై పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది.