బడిలో కరోనా బెల్స్..
posted on Mar 16, 2021 @ 4:46PM
కరోనా మల్లి కోరలు చాస్తోంది.. ఇప్పటికే ప్రపంచాన్ని వణికించిన కరోనా..మళ్ళీ తన పంజా విసురుతుంది తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు వరుసగా కరోనా బారినపడుతున్నారు. ఇటీవల వికారాబాద్, సంగారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో పలువురికి వైరస్ నిర్ధారణ కాగా.. లేటెస్ట్ గా మంచిర్యాల, కరీంనగర్‌లోని మూడు పాఠశాలల్లో కొందరి విద్యార్థులకు పాజిటివ్ అని తేలింది. పాఠశాలలు, వసతి గృహాల్లో కొవిడ్ నిబంధనలను పాటించకపోవడం, శానిటైజేషన్ సరిగా లేకపోవడంతో వైరస్ వ్యాప్తి చెందిందని.. ఇలా ఉంటే మరింత ప్రమాదం ఉందనే ఆందోళన స్థానికులో వ్యక్తం అవుతోంది. కాగా, మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలికల పాఠశాలలో కరోనా పరీక్షలు నిర్వహించగా గర్ల్స్ హైస్కూల్ లో ఈ రోజు 29 మంది స్టూడెంట్స్ కు కరోనా పాజిటివ్..నిన్న 14 రికి పాజిటివ్ వీరిలో 11 మంది టీచర్లు, 2 వంట మనుషులు 1విద్యార్థినికి పాజిటివ్ మొత్తం 43 పాజిటివ్ కేసులు పదో తరగతి 20 ,తొమ్మిదో తరగతి, 8ఎనిమిదో తరగతి 1 విద్యార్థినికి పాజిటివ్ అని తేలింది.. పాజిటివ్ వచ్చిన స్టూడెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ కు టెస్టులు చేస్తున్నారు ఆఫీసర్స్. ఈ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు ఇటీవల జైపూర్ మండలంలో జాతరకు వెళ్లి వచ్చారు. అనంతరం జలుబు, జ్వరం ఉండటంతో శాంపిల్స్ పరీక్షకు ఇచ్చారు.
కరీంనగర్ నగరంలో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. రామడుగు మండలం, వెలిచాల అనుబంధ గ్రామంలో 20 మందికి కరోనా సోకింది. ఒకే ఊరిలో అన్ని కేసులు నమోదు కావడంతో గ్రామంలో ఆందోళన నెలకొంది. దీంతో గ్రామ పంచాయతీ, వైద్య శాఖ అధికారులు కట్టడి చర్యలు ప్రారంభించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో నలుగురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ వచ్చింది. సుభాష్ నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరికి కరోనా వచ్చింది. కార్ఖానా గడ్డ హైస్కూల్, సప్తగిరి కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో కరోనా కలకలం రేపడంతో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. స్కూల్లో మిగతా వారికి పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.