ధర్మాన రాజీనామా పై కిరణ్ దే నిర్ణయం: వాయిలార్ రవి
posted on Aug 22, 2012 @ 1:59PM
ధర్మాన రాజీనామా పై నిర్ణయం తీసుకునే బాధ్యత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిదే అని కాంగ్రెస్ నేత వాయిలార్ రవి తెలియజేశారు. దీనిపై అధిష్టానం జోక్యం చేసుకోదన్నారు. సీబీఐ దర్యాప్తులో ఎవరూ జోక్యం చేసుకోడానికి వీలు లేదని వాయిలార్ రవి స్పష్టం చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై సీఎం కిరణ్‌ను మంత్రులు వట్టివసంత్‌కుమార్, పొన్నాల, సుదర్శన్‌రెడ్డి బుధవారం ఉదయం క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు.