షర్మిల మరో ప్రజాప్రస్థానం ఓ రికార్డు : టీడీపి
posted on Oct 18, 2012 @ 4:38PM
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర ఓ రికార్డుకుగా నిలిచిపోతుందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచంలో ఎక్కడా ప్రతిపక్షానికి వ్యతిరేకంగా పాదయాత్ర చేసిన చరిత్ర లేదని..ఆ విషయంలో షర్మిల పాదయాత్ర ఓ రికార్డుగా మిగులుతుందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. మ్యాచ్ ఫిక్సింగ్ అన్న పదానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పర్యాయపదం అని, కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలంటున్న వైఎస్ విజయమ్మ మరి గతంలో అవిశ్వాసం పెట్టినప్పుడు ప్రభుత్వాన్ని ఎందుకు పడగొట్టలేకపోయారని ప్రశ్నించారు. రాష్ట్రపతి ఎన్నికలలో ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేయడంతోనే ఎవరు ఎవరు కుమ్మక్కయ్యారో ప్రజలకు తెలిసిపోయిందని అన్నారు.