ఐసీసీ ట్వంటీ-20, వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా గెలుపు
posted on Sep 23, 2012 @ 12:39PM
ఆస్ట్రేలియా రెండో వరుస విజయంతో టి-20 ప్రపంచ కప్ సూపర్-8 దశకు దూసుకెళ్లింది. గ్రూప్-బిలో భాగంగా వెస్టిండీస్‌తో శనివారం జరిగిన డే/నైట్ మ్యాచ్‌లో ఆసీస్ 17 పరుగులతో విజయం సాధించింది. వాట్సన్ 24 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 41 నాటౌట్తో ఆల్‌రౌండ్ షోతో వీరంగం సృష్టించాడు. 192 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారూలు వర్షం వచ్చేసరికి 9.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 100 పరుగుల చేశారు. వర్షం తెరిపినివ్వకపోవడంతో డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం ఆసీస్‌ను విజేతగా ప్రకటించారు. ఆ సమయానికి కంగారూలకు 83 పరుగులు కావాల్సివుండగా, 17 పరుగులు ఆధిక్యంలో ఉన్నారు.
వాట్సన్‌తో పాటు మైక్ హస్సీ 19 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 28 నాటౌట్, వార్నర్ 14 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 28 దూకుడుగా ఆడారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 191 పరుగులు సాధించింది. క్రిస్ గేల్ 33 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 54, శామ్యూల్స్ 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 50 మెరుపులు మెరిపించగా, డ్వెన్ బ్రావో 21 బంతుల్లో 27తో ఆకట్టుకున్నారు. స్టార్క్ మూడు, వాట్సన్ రెండు వికెట్లు తీశాడు. వాట్సన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.