Reduce talk time to avoid wrinkles

Reduce talk time to avoid wrinkles

 

 

 

Have you heard of getting wrinkles using a phone or gadget! According to CACI international, a firm that specialises in ”non-surgical beauty solutions” has identified a new problem while using smart phones and other phone gadgets. It can give you wrinkles. Now this could be a scary proposition for all women and men who use these phones.

 

They have further elaborated that using Smart phones/gadgets  can give you wrinkles as looking down at handheld devices and computers for countless hours develops a line around the neck and chin. This terrifying new gadget related affliction has been dubbed “tech neck” and could affect anyone who owns a hi-tech gadget. The “tech neck” is a line around the neck and chin which is caused by looking down at handheld devices and computers every day. The bizarre latest face furrow was identified after a surge of neck-related enquiries for non-surgical, knife-free face-lifts by CACI international, a firm that specialises in”non-surgical beauty solutions”.



“We noticed a surge in enquiries for our product, specifically to combat lines around the neck area,” Dean Nathanson, Managing Director of CACI international, said. “We’ve identified a correlation between the rise of technology in recent years and the growth of the ‘tech neck’,” said Nathanson.


So for those who are constantly on the phone and addicted to these hi tech gadgets should either reduce talk time to avoid these wrinkles even though they are for a short period.

Teluguone gnews banner

నరకం చూపించే ఫైల్స్ సమస్యకు అసలు కారణాలు ఇవే..!

ఫైల్స్ ను మొలలు అని కూడా అంటారు.  మలద్వారం దగ్గర బొడిపెల్లా  ఏర్పడి మలవిసర్జనకు వెళ్లినప్పుడు ఆటంకం కలిగించే ఈ సమస్య చెప్పడానికి చాలా తేలికగా అనిపిస్తుంది కానీ ఇది అనుభవించే వారికి  నరకం చూపిస్తుంది.  మలవిసర్జన సాఫీగా జరగకపోవడం వల్ల బలవంతంగా ఒత్తిడి కలిగించాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఒక్కోసారి  మలంతో పాటు రక్తం పడుతూ ఉంటుంది.  ఫైల్స్ సమస్యకు ప్రాధాన కారణంగా మలబద్దకాన్ని చెబుతారు. మలబద్దకం ఉన్నవారిలో ఫైల్స్ వచ్చే సమస్యలు  ఎక్కువ ఉంటాయని  వైద్యులు కూడా చెబుతారు. అయితే అసలు మలబద్దకం సమస్య ఎందుకు వస్తుంది? దీనికి కారణాలు ఏంటి తెలుసుకుంటే మలబద్దకం, ఫైల్స్ రెండింటికి చెక్ పెట్టవచ్చు. ఎక్కువసేపు కూర్చోవడం.. ఇప్పట్లో చాలావరకు కూర్చుని చేసే పనులే ఉన్నాయి. సిస్టమ్స్ ముందు లేదా షాపులలో కూర్చుని పనిచేయడం అన్నిచోట్లా కనిపిస్తుంది.  గంటల తరబడి ఇలా కూర్చోని పనిచేయడం వల్ల మలబద్దకం, దాని వెంట ఫైల్స్ సమస్య వస్తాయి. అందుకే ఎక్కవసేపు కూర్చోని పనిచేసేవారు కనీసం గంటకు ఒకసారి అయినా కూర్చున్న చోటి నుండి లేచి ఓ 5నిమిషాలు రిలాక్స్ గా నడవాలని  వైద్యులు చెబుతున్నారు. ధూమపానం, మధ్యపానం.. ఆల్కహాల్ అతిగా తీసుకోవడం, అలాగే ధూమపానం చేయడం వల్ల కూడా ఫైల్స్ సమస్య వస్తుంది. ఇవి జీర్ణక్రియను, ప్రేగుల పనితీరును దెబ్బతీస్తాయి. అందుకే ఈ రెండు అలవాట్లకు దూరంగా ఉండాలి. నీరు.. ప్రతి రోజూ మనిషికి మూడు నుండి నాలుగు లీటర్ల నీరు లేదా 8గ్లాసుల నీరు అవసరం అవుతుంది. వైద్యులు కూడా తప్పనిసరిగా 8గ్లాసుల నీరు తీసుకోమని చెబుతుంటారు. అయితే  నీరు తక్కువగా తాగితే జీర్ణాశయం, పేగుల పనితీరు దెబ్బతింటుంది. ఇది మలబద్దకం, పైల్స్ సమస్యకు దారితీస్తుంది. ఒత్తిడి.. ఒత్తిడి వల్ల కూడా ఫైల్స్ సమస్యలు వస్తాయి. శరీరంలో ఒత్తిడి ఫీలవుతుంటే హార్మోన్ల సమస్యల నుండి అవయవాల పనితీరు వరకు అన్ని దెబ్బతింటాయి. గట్టిగా దగ్గడం, ఒత్తిడితో కూడిన పనులు చేయడం వంటివి చేయడం వల్ల మొలల సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది. దీన్ని తగ్గించుకునేందుకు యోగా, మెడిటేషన్ చేయాలి. మాంసాహారం.. మాంసాహారం ఎక్కువ తినేవారిలో ఫైల్స్ సమస్య చాలా ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా చికెన్, మటన్, గుడ్లలో పచ్చసొన తొందరగా ఫైల్స్ సమస్య రావడానికి కారణం అవుతుంది. వీటికి బదులు ఫైబర్ ఎక్కువగా ఉన్న పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవడం మంచిది. గర్భం దాల్చినప్పుడు.. గర్భం దాల్చినప్పుడు మలద్వారం ప్రాంతం పైన బిడ్డ ఒత్తిడి ఉంటుంది. దీని కారణంగా గర్భవతులలో ఫైల్స్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.  అయితే ప్రసపం తరువాత ఈ సమస్య తగ్గిపోతుంది. స్పైసీ ఫుడ్.. కారం, మసాలా ఎక్కువ ఉన్న జంక్ ఫుడ్స్, ఇతర ఆహారాల వల్ల కూడా మొలల సమస్య వస్తుంది. చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్లు, బిస్కెట్లు, మైదా ఆధారిత ఆహారాల వల్ల మలబద్దకం సమస్య, దాన్నుండి ఫైల్స్ సమస్య కూడా వస్తుంది.                                              *నిశ్శబ్ద. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

ఇలా చేస్తే బెల్లి ఫ్యాట్ ఐస్‎లా కరగడం ఖాయం!

సాధారణంగా బరువు తగ్గడం అంత తేలికైన పని కాదు. అందుకు వ్యాయామంతో పాటు ఆహారంలో కూడా చాలా మార్పులు అవసరం. చాలామంది జిమ్‌లో గంటల తరబడి ఎక్సర్ సైజులు చేస్తున్నారు. అయితే బరువు తగ్గడానికి అంత కష్టపడాల్సిన అవసరం లేదంటున్నారు పోషకాహార నిపుణులు. పోషకాహార నిపుణులు బరువు తగ్గడానికి సులభమైన మార్గాన్ని సూచించారు. ఇలా చేయడం వల్ల కేవలం 7 రోజుల్లో 5 కిలోల బరువు తగ్గవచ్చు. అందుకోసం ప్రత్యేకంగా డైట్ పాటించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అయితే బెల్లిఫ్యాట్ తగ్గించుకునేందుకు ఎలాంటి పద్దతులు పాటించాలో తెలుసుకుందాం. డిటాక్స్ ఆహారం: బరువు తగ్గడానికి వివిధ రకాల ఆహారాలు ఉన్నాయి. చాలా మంది బరువు తగ్గడానికి డిటాక్స్ డైట్ కూడా తీసుకుంటారు. అయితే ఇలాంటి ఆహారాలు చాలా హానికరమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వాటికి  బదులుగా, టాక్సిన్స్ తొలగించడానికి మీరు ఈ మూడు పనులు చేయడం ముఖ్యమని చెప్పారు.  ఆ మూడు పనులు ఏమిటో చూద్దాం. ప్రతిరోజూ 3 పనులు చేయండి: -జీలకర్ర పుదీనా డిటాక్స్ నీటిని ఖాళీ కడుపుతో త్రాగండి. -అల్పాహారం కోసం దోసకాయ స్మూతీని తీసుకోండి. -మధ్యాహ్నం, రాత్రి భోజనం మధ్య చియా గింజల నీటిని త్రాగాలి. డిటాక్స్ డైట్  ప్రతికూలతలు: డిటాక్స్ ఆహారం తరచుగా శరీరంలో ఆకలి, అలసటను కలిగిస్తుంది. బలహీనత కనిపించవచ్చు. ఇది తక్కువ శక్తి, తక్కువ రక్త చక్కెర, అలసట, తల తిరగడం, చేయి నొప్పులను కలిగిస్తుంది. అదే సమయంలో, ఇటువంటి బరువు తగ్గించే ఆహారాలు కూడా చాలా బోరింగ్. ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధిక కొవ్వు, అధిక చక్కెర కలిగిన ఆహారాలకు దూరంగా ఉండటం మరింత ప్రభావవంతంగా ఉంటుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. దీనితో పాటు, తాజా పండ్లు, కూరగాయలు తినడం, కొంత వ్యాయామం చేయడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

అసలు నరాల సమస్యలు ఎందుకు వస్తాయ్..  రాకూడదంటే ఏం చేయాలి?

ప్రస్తుతకాలంలో చాలామందిలో న్యూరోపతి సమస్య కనిపిస్తోంది. శరీరంలోని నరాలు బలహీనంగా మారడం, శరీరంలో పట్టు తగ్గడం, కాళ్లూ చేతులు మొదలైన ప్రాంతాలలో చీమలు పాకినట్టు అనుభూతి కలగడం, చేతులు వనకడం ఇలా చాలా లక్షణాలు న్యూరోపతి సమస్యలో కనిపిస్తాయి. ఈ న్యూరోపతి సమస్యను మొదట్లోనే గుర్తించి దాన్ని పరిష్కరించడం ఎంతో అవసరం. లేకపోతే ఇది మొత్తం శరీరం మీద చాలా దారుణమైన ప్రభావం చూపిస్తుంది. అయితే అసలు ఈ న్యూరోపతి సమస్య ఎందుకు వస్తుంది? ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? న్యూరోపతి ఎందుకు వస్తుంది? శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఉత్పత్తి అయితే అది న్యూరోపతి సమస్యకు దారితీస్తుంది. జంక్ ఫుడ్,  నూడిల్స్, బర్గర్లు, పిజ్జా, బేకింగ్ ఆహారాలు, చక్కెర అధకంగా ఉన్న ఆహారాలు తింటుంటే న్యూరోపతి సమస్య వచ్చే  అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆహారం తిన్న ప్రతిసారి లేదా అనారోగ్యం చేసినప్పుడు, శరీరంలో నొప్పులు, వాపులు వంటివి సంభవించినప్పుడు శరీరంలో ఫ్రీరాడికల్స్  తయారవుతాయి. ఇవి శరీరానికి హాని కలిగిస్తాయి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఆహారం తిన్న తరువాత శరీరంలో రెండు రకాల అణువులు ఏర్పడతాయి. వాటిలో ఒకటి  ఫ్రీరాడికల్స్ కాగా.. రెండవది యాంటీ ఆక్సిడెంట్లు. కానీ ఆహారం తిన్న తరువాత ఫ్రీరాడికల్స్ ఎక్కువగా ఏర్పడినా,  అవి యాంటీఆక్సిడెంట్లను కూడా డామినేట్ చేసినా ఫ్రీరాడికల్స్ ప్రభావం శరీరం మీద ఎక్కువ ఉంటుంది.  సాధారంగా వచ్చే దగ్గు, జలుబు, ఫ్లూ వంటి సమస్యలు ఈ ఫ్రీ రాడికల్స్ వల్లే వస్తాయి. ఆహారం విషయంలో మార్పులు చేసుకోకపోతే ఇది క్రమంగా న్యూరోపతి సమస్యకు దారితీస్తుంది. న్యూరోపతి సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే.. న్యూరోపతీ సమస్య రాకుండా ఉండాలంటే  ప్రతి రోజూ కనీసం 1 గంట శారరీక శ్రమ అవసరం. ఇందులో చురుకైన నడక, యోగా, వ్యాయామం, ఇతర పనులు కూడా ఉండవచ్చు. వీటి వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్ల కంటే శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువ ఉండటం వల్ల నరాల సమస్య వస్తుంది కాబట్టి దీన్ని అరికట్టడానికి  యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, ఆకుపచ్చ ఆకుకూరలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న ఇతర ఆహారాలు తీసుకోవాలి.  సాధారణంగా న్యూరోపతి సమస్య ఉందని అనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వీలైంత తొందరగా న్యూరోపతీ వైద్యుడిని కలవడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.                                               *నిశ్శబ్ద. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగడం మంచిదేనా? అలా చేస్తే  జరుగుతుందో తెలుసా?

ఆహారం ఔషదం అని అంటారు. మనం తీసుకునే ఆహారమే శరీరానికి మూలాధారం. అదే శక్తిని ఇస్తుంది. సాధారణంగా ఆహారం తినేటప్పుడు, తిన్న వెంటనే నీరు తాగడం అనేది చాలామంది అలవాటు. కొందరు ఆహారం తిన్నంత వరకు అస్సలు నీరు తాగరు. కానీ ఆహారం తిన్న తరువాత మాత్రం కనీసం అరలీటరు నీళ్లు వేగంగా తాగేస్తుంటారు.  కానీ ఆహారం తిన్న వెంటనే నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా అనే చర్చ ఇప్పుడు దుమారం లేపుతోంది. దీని గురించి ఆరోగ్య నిపుణులు స్పందించారు. ఆహారం తిన్న వెంటనే నీరు తాగడం ఎంత వరకు కరెక్ట్? అలా నీరు తాగితే జరిగేదేంటి? అనే విషయాల గురించి కూడా స్పష్టత ఇచ్చారు. ఆహారం తినేటప్పుడు నీరు తాగడం అవసరమేనా? ఆహారం తినేటప్పుడు నీరు తాగడం చాలా మంది అలవాటు. ఆహారం తినేటప్పుడే కాదు తిన్న తరువాత కూడా నీరు తాగడం అస్సలు అవసరమే లేదన్నది ఆహార నిపుణులు, వైద్యుల మాట. ఎందుకంటే ఆహారం తినేటప్పుడు దాన్ని బాగా నమిలి తింటే నోట్లో ఊరే లాలాజలంతో కలిసి ఆహారం తగినంత ద్రవంగా మారుతుంది. ఇది నేరుగా జీర్ణాశయానికి వెళ్లి అక్కడ జీర్ణ ఎంజైమ్ లతో కలిసి సులువుగా జీర్ణమవుతుంది. అందుకే ఆహారం తినేటప్పుడు అస్సలు నీరు తాగాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆహారం కారంగా ఉన్నా, ఎక్కువ ఘనపదార్థాలు అయినా దానికి తగినట్టు చాలా కొద్ది మొత్తంలో ఒక అరగ్లాసు లోపు నీరు తాగడం మంచిది. అంతకు మించి నీరు తాగాల్సిన అవసరమే లేదని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఆహారం తిన్నవెంటనే నీరు తాగితే  ఏం జరుగుతుంది?   ఆహారం తిన్న వెంటనే నీరు తాగడం అనేది సరైన పని కాదని ఆహార నిపుణులు, వైద్యులు చెబుతున్నారు. కొందరు ఆహారం తిన్న వెంటనే సుమారు పావు లీటర్ నుండి అరలీటర్ నీరు  తాగేస్తుంటారు. దీనివల్ల చాలా పెద్ద ఇబ్బందే ఎదువుతుంది.     ఆహారం తిన్న వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణ ఎంజైమ్ లు పలుచబడిపోతాయి. ఇలా జీర్ణ ఎంజైమ్ లు పలుచబడిపోవడం వల్ల ఆహారం సరిగా జీర్ణం కాదు. జీర్ణక్రియ చాలా నెమ్మదిస్తుంది. ఇది జీర్ణ సంబంధ వ్యాధులు రావడానికి కారణం అవుతుంది.  ముఖ్యంగా అజీర్ణం, గ్యాస్, ఎసిడిటీ సమస్యలు వస్తాయి. మరొక షాకింగ్ విషయం  ఏమిటంటే.. ఆహారం తిన్న వెంటనే ఎక్కువగా నీరు తాగేవారు చాలా తొందరగా ఊబకాయం సమస్యకు గురవుతున్నారు.  అలాగే ఆహారంలో తీసుకున్న పోషకాలు ఏవీ శరీరానికి అంత సులువుగా అందవు.  దీనివల్ల సరైన ఆహారం తీసుకున్నా సరే పోషకాహార లోపానికి గురవుతారు. ఆహారం తిన్న తరువాత ఎన్ని నిమిషాలకు నీరు తాగాలి? ఆహారం జీర్ణం కావడానికి ఎంత సమయం పడుతుంది? ఏదైనా ఆహారం తిన్న తరువాత జీర్ణం కావడానికి 3గంటల సమయం పడుతుంది. అయితే జీర్ణాశయంలోని చిన్న ప్రేగులలో ఈ ఆహారం సుమారు 7గంటల వరకు ఉంటుంది. ఇలా జీర్ణమైన ఆహారం పెద్ద ప్రేగు గుండా ప్రయాణించడానికి 15 గంటల నుండి 28 గంటల వరకు ఉంటుంది.  24 గంటలు గడిచినా మలవిసర్జన జరగకపోతే శరీరంలో చాలా అసౌకర్యంగా అనించడానికి కారణం ఇదే.. ఇకపోతే ఆహారం తిన్న వెంటనే నీరు తాగే అలవాటు ఉంటే దాన్ని మానుకోవడం చాలామంచిది. వీలైనంతవరకు ఆహారం కారం, ఉప్పు తక్కువగా ఉండేలా చూసుకుంటే నీరు తాగాల్సిన అవసరం అంతగా ఉండదు. అలాగే ఉడికించిన కూరగాయలు బాగా తీసుకుంటే వాటిలో ఉండే నీటి శాతం ఆహారాన్ని జీర్ణం చెయ్యడానికి సహకరిస్తుంది. అదేవిధంగా రసం,  మజ్జిగ వంటివి కూడా జీర్ణాశయంలో ద్రవాల సమతుల్యతను  చేకూరుస్తాయి.  ఆహారం తిన్న తరువాత కనీసం 40నిమిషాల సేపు నీరు తాగకుండా ఉండటం మంచిది. ఆహారం తిన్న తరువాత నీరు తాగాలని అనిపిస్తే  కేవలం ఒకటి రెండు గుక్కల నీరు మాత్రమే తాగవచ్చు. అది కూడా గోరువెచ్చగా ఉండే నీరు తాగడం మంచిది. అదే విధంగా తిన్న వెంటనే నీరు తాగాలని అనిపిస్తే లాలాజలాన్ని బాగా ఉత్పత్తి చేసే కారం, ఉసిరి ముక్క వంటివి తినవచ్చు. తేలికపాటి నడక కూడా మంచిదే.                                         *నిశ్శబ్ద. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

బరువు తగ్గడానికి వాకింగ్ చేస్తున్నారా...ఈ మిస్టేక్స్ అస్సలు చేయకండి..!

  నేటి కాలంలో హెల్త్ పరంగా చాలామంది పెట్టుకునే టార్గెట్ ఏదైనా ఉందంటే అది బరువు తగ్గడమే.. బరువు తగ్గడం కోసం కొందరు జిమ్ చేస్తారు, మరికొందరు యోగ ఎంచుకుంటారు. ఇంకొందరు వివిధ రకాల వర్కౌట్లు చేస్తుంటారు. అయితే.. ఎటువంటి ఖర్చు లేకుండా, ఎలాంటి వ్యాయమ పరికరాలు లేకుండా చేయగలిగేది వాకింగ్ మాత్రమే.. అయితే బరువు తగ్గడం కోసం వాకింగ్ చేసే వారు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటారు.  అవన్నీ తప్పులని తెలియక వాకింగ్ చేసినా బరువు తగ్గడం లేదని గందరగోళానికి గురవుతూ ఉంటారు. బరువు తగ్గాలని అనుకునేవారు వాకింగ్ చేసేటప్పుడు అస్సలు చేయకూడని మిస్టేక్స్ ఏంటో తెలుసుకుంటే.. నెమ్మదిగా నడవడం.. చాలామంది వాకింగ్ చేసేవారు నెమ్మదిగా నడుస్తూ ఉంటారు.   ఇలా నడవడం వల్ల కేలరీలు,  కొవ్వు బర్న్  కావు.  దీని వల్ల వాకింగ్ చేసినా శరీరం చురుగ్గా మారుతుంది, కండరాల చలనం ఉంటుంది అంతే తప్ప కేలరీలు,  కొవ్వు బర్న్ కావు.   అందుకే బరువు తగ్గడం జరగదు.  బరువు తగ్గడం కోసం వేగంగా నడవాలి.  నిమిషానికి దాదాపు 100 నుండి 120 అడుగులు వేయాలని  లక్ష్యంగా పెట్టుకోవాలి.  అలా నడిస్తే బరువు మెల్లిగా బరువు తగ్గడం జరుగుతుంది. వార్మప్.. వాకింగ్ చేయడం అంటే చెప్పులు లేదా షూస్ వేసుకుని చక్కగా నడుచుకుంటూ వెళ్లడమే చాలా మందికి తెలుసు. కానీ వాకింగ్ చేసేవారు వార్మప్ చేస్తే శరీరం వాకింగ్ ఫలితాలు చక్కగా పొందగలుగుతుంది. వార్మప్ వల్ల కండరాలు వాకింగ్ కు సిద్దం అవుతాయి. వాకింగ్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది కండరాలకు ఎదురవ్వదు.  అందుకే వాకింగ్ చేయడానికి ముందు 3 నుండి 5 నిమిషాలు వార్మప్ చేయాలి. పొజిషన్.. వాకింగ్ చేసేటప్పుడు శరీరం స్టేబుల్ గా ఉండటం చాలా ముఖ్యం. వీపు,  తల వంచి నడవడం,  మొబైల్ ఫోన్ చూడటం, అడుగులు సరిగా వేయకపోవడం ఇవన్నీ వాకింగ్ ఫలితాలను దెబ్బ తీస్తాయి.  దీని వల్ల శరీరం ఇబ్బంది పడకపోయినా,  వాకింగ్ వల్ల బరువు మాత్రం తగ్గరు. షూస్ ఎంపిక.. వాకింగ్ చేయడానికి చెప్పులు లేదా పాత షూస్,  లేదా  అనుకూలంగా లేని షూస్ ను ఎంచుకోకూడదు.  అనుకూలంగా లేని షూస్ వేసుకుని నడవడం వల్ల పాదాలు, మోకాళ్లు,  వెన్ను నొప్పి వస్తాయి.  వాకింగ్ కాస్తా బాధాకరంగా మారుతుంది. హాయిగా వాకింగ్ చేయడానికి అనువుగా ఉన్న షూస్ ను మాత్రమే ఎంచుకోవాలి. వాకింగ్ పద్దతి.. వాకింగ్ చేయడానికి ఒక మంచి మార్గం ఎంచుకోవాలి.  అలాగే రోజూ ఒకే సమయంలో వాకింగ్ చేయాలి.  వాకింగ్ చేసేటప్పుడు వేగాన్ని కూడా బాలెన్స్ చేసుకోవాలి. హైడ్రేషన్.. వాకింగ్  చేసేవారు హైడ్రేటెడ్ గా ఉండటం చాలా అవసరం.  చెమట పట్టడం వల్ల అలసట, ఆకలి, బలహీనత  కలుగుతాయి.  అందుకే అవసరమైన కొద్ది మొత్తంలో నీరు తాగాలి.  ఆహార జాగ్రత్త.. చాలామంది వాకింగ్ బాగా చేస్తున్నాం,  కేలరీలు బాగా ఖర్చు అవుతుంటాయి కాబట్టి బాగా తింటే ఏం కాదు అనే అపోహలో ఉంటారు. ఇలా ఒకవైపు బాగా తింటూ మరొకవైపు ఎంత వాకింగ్ చేసినా బరువు తగ్గడం అనేది జరగదు.  వాకింగ్ ద్వారా ఫలితం కనిపించాలంటే మంచి డైటింగ్ కూడా వాకింగ్ కు తోడు కావాలి.                              *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

కూర పనస ఎప్పుడైనా తిన్నారా? దీంతో ఎన్ని లాభాలంటే..!

  సరైన విధంగా తింటే శాకాహారం ఇచ్చినంత గొప్ప ఆరోగ్యం ఇంకేదీ ఇవ్వగదనేది వైద్యుల మాట. కూరగాయలలో కూడా ప్రాంతీయతను బట్టి వివిధ రకాలుంటాయి. వీటిలో కొన్ని చూడడానికి కొన్ని వింతగా ఉంటే మరికొన్ని తిన్నప్పుడు ఆశ్చర్యకరమైన రుచి కలిగుంటాయి. అలాంటి వాటిలో కూర పనస కూడా ఒకటి. రూపంలో అచ్చం పనస పండును పోలి ఉండే కూర పనస రుచిలో మాత్రం అందరికీ షాకిస్తుంది. ఇది అచ్చం బ్రెడ్ రుచిని పోలి ఉంటుంది. అందుకే దీన్ని బ్రెడ్ ఫ్రూట్ అని కూడా అంటారు. ఈ కూర పనస తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటో ఓసారి తెలుసుకుంటే.. పోషకాలు.. కూర విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి సమృద్దిగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆరోగ్యకరమైన చర్మం కోసం కొల్లాజెన్ ఉత్పత్తిలో సహాయపడుతుంది. అదనంగా, ఇందులో విటమిన్ ఎ, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ ఉన్నాయి, ఇది మొత్తం ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. జీర్ణ ఆరోగ్యం.. అధిక ఫైబర్ కంటెంట్‌ ఉన్న కారణంగా, కూర పనసప్రేగు కదలికలను నియంత్రించడం, మలబద్ధకాన్ని నివారించడం ద్వారా జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఫైబర్ ప్రీబయోటిక్‌గా కూడా పనిచేస్తుంది.  గట్‌లోని ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను పోషించడం, జీర్ణక్రియ, పోషకాల శోషణకు అవసరమైన ఆరోగ్యకరమైన మైక్రోబయోమ్‌ను ప్రోత్సహిస్తుంది. బరువు నిర్వహణ.. కూర పనసను ఆహారంలో చేర్చుకోవడం వల్ల  తక్కువ కేలరీలు,  అధిక ఫైబర్ కంటెంట్ లభిస్తాయి. బరువు నిర్వహణలో సహాయపడుతుంది. ఫైబర్ ఎక్కువ కాలం కడుపు  నిండిన అనుభూతిని కలిగిస్తుంది, మొత్తం కేలరీల తీసుకోవడం తగ్గిస్తుంది.  అతిగా తినకుండా చేస్తుంది. అదనంగా, దాని సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు స్థిరమైన శక్తిని అందిస్తాయి, రోజంతా సంతృప్తిగా, ఉత్సాహంగా ఉంచుతాయి.                    *నిశ్శబ్ద. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

మీరూ ఈ సమస్య అనుభవిస్తుంటే ఇది తప్పక చదవాలి!

ఉదయం నిద్రలేవగానే తాపీగా మంచం దిగి పనులు చేసుకునేవారు చాలా తక్కువ మంది ఉన్నారు ఈకాలంలో. మంచం నుండి కాలు కింద పెట్టగానే నొప్పితో విలవిల్లాడిపోయేవారు చాలామంది ఉన్నారు. కొందరైతే  ఉదయాన్నే నిద్ర లేవగానే మంచం మీద నుండి కిందకు దిగడానికి  దాదాపు భయపడుతుంటారు. నేలపై కాలు పెట్టగానే మడమ విరిగిపోయినట్లు ఫీలవుతుంటారు కొందరు. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే, దానిని తేలికగా తీసుకోవడం మంచిదికాదు. ఇది తీవ్రమైన సమస్యలకు సంకేతం. ఉదయం ఎదురయ్యే  ఈ రకమైన నొప్పి అరికాలి ఫాసిటిస్ అనే వ్యాధి  లక్షణంగా పరిగణించబడుతుంది. అరికాలి ఫాసిటిస్  అనేక ఇతర సమస్యలకు  కారణంగా చెప్పబడుతుంది.  వీటిని సకాలంలో గుర్తించి చికిత్స చేయడం మంచిది. ఇప్పట్లో అధికశాతం ప్రజలలో ఈ రకమైన సమస్య కనిపిస్తోందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ నొప్పి తరచుగా కొద్దిగా నడిచిన తర్వాత తగ్గిపోతుంది, అయితే ఈ సమస్యను సకాలంలో గుర్తించి చికిత్స చేయకపోతే, అది  తీవ్రమైన సమస్యగా పరిణమిస్తుంది. దీని కారణంగా  రోజంతా ఈ నొప్పిని శాశ్వతంగా ఎదుర్కోవలసి ఉంటుంది. ప్లాంటర్ ఫాసిటిస్.. అరికాలి ఫాసిటిస్ సమస్య  పాదాలలో నొప్పికి ఎక్కువగా కారణం అవుతుంది.  కాలి వేళ్లను,  మడమతో కలిపే అరికాలి అంటిపట్టుకొన్న తంతుయుత కణజాలం బాధాకరంగా ఎర్రబడినప్పుడు ప్లాంటర్ ఫాసిటిస్ సంభవిస్తుంది. మీకు ఈ సమస్య ఉంటే, మీరు నిద్రనుండి మేల్కొన్నప్పుడు, ఎక్కువ సేపు విశ్రాంతి తరువాత  అడుగు వేసినప్పుడు మీ మడమ చుట్టూ నొప్పిగా అనిపిస్తుంది. ప్లాంటార్ ఫాసిటిస్ లక్షణాలలో నిద్ర లేచిన వెంటనే మడమ ప్రాంతానికి రక్త సరఫరా తగ్గిపోతుంది,మేల్కొన్న వెంటనే పెరుగుతుంది. దీనికి సకాలంలో చికిత్స అవసరం. రుమటాయిడ్ ఆర్థరైటిస్  సమస్యలు.. రుమటాయిడ్ ఆర్థరైటిస్ సాధారణంగా పాదాల నొప్పితో పాటు ఇతర లక్షణాలను కలిగి ఉంటుంది. వీటిలో  మణికట్టు, చేతుల్లో నొప్పి, వాపు ఉంటాయి. ఇది స్వయం ప్రతిరక్షక రుగ్మత, ఇది కీళ్ల నొప్పులు, దీని ద్వారా నడక ఇబ్బందిగా మారడం వంటి సమస్యలకు  కారణమవుతుంది. ఇది పాదాలలో నొప్పి మాత్రమే కాదు, ఇది  మోకాళ్లు మరియు శరీరంలోని ఇతర కీళ్ల భాగాలకు కూడా మెల్లగా విస్తరిస్తుంది. పాదాలలో నొప్పిని ఎలా తగ్గించాలంటే.. అరికాలి ఫాసిటిస్ లేదా మరేదైనా కారణాల వల్ల కలిగే నొప్పికి, ముందుగా కారణాన్ని కనుగొని చికిత్స చేయడం అవసరం. అయితే, కొన్ని జాగ్రత్తల  సహాయంతో ఖచ్చితంగా నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. విశ్రాంతి : వాపు తగ్గే వరకు  పాదాల మీద బరువు మోపకూడదు.అంటే పాదాలకు ఎక్కువ సమయం విశ్రాంతి ఇవ్వడానికి ప్రయత్నించండి. ఐసింగ్: కోల్డ్ కంప్రెస్ సహాయంతో వాపును తగ్గించవచ్చు, ఇది నొప్పిని తగ్గించడంలో కూడా  ఉపయోగకరంగా ఉంటుంది. *నిశ్శబ్ద.

దీపావళికి...షుగర్ పెరగకుండా స్వీట్లు లాగించాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే..!

భారతదేశంలో డయాబెటిస్ ఉన్నవారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, 45 ఏళ్లు పైబడిన వారిలో దాదాపు 20% మంది దీని బారిన పడ్డారు. దీని అర్థం భారతదేశంలో 50 మిలియన్లకు పైగా ప్రజలు డయాబెటిస్ కలిగి ఉన్నారు. అయితే డయాబెటిస్ ఉంది కదా అని కొన్ని సంతోషాలు వదిలేసుకోలేం. వాటిలో పండుగ నాడు తీసుకునే ఆహారం ప్రథమ స్థానంలో ఉంటుంది. సాధారణ రోజుల్లో నోరు కట్టేసుకున్నా.. పండుగ రోజుల్లో మాత్రం తప్పనిసరిగా నోటికి రుచులతో వింధు చేయాల్సి వస్తుంది. అయితే డయాబెటిస్ ఉన్నవారు ఆహారం తీసుకునే విషయంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటిది ఏకంగా స్వీట్లు తినాలి,  ఆరోగ్యం పాడవ్వకూడదు అంటే కొన్ని చిట్కాలు పాటించాలి.  అవేంటో తెలుసుకుంటే.. షుగర్  షాక్.. దీపావళి వంటి పండుగల సమయంలో ఇంట్లో చాలా స్వీట్లు ఉంటాయి. రసగుల్లా, గులాబ్ జామున్ లేదా లడ్డులో చక్కెర,  నెయ్యి ఎక్కువగా ఉంటాయి. ఈ ఆహారాలు శరీరంలోకి గ్లూకోజ్‌ను త్వరగా విడుదల చేస్తాయి, దీనివల్ల రక్తంలో చక్కెర పెరుగుతుంది.  డయాబెటిస్ ఉన్నవారిలో ఇది ఇన్సులిన్ సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఆహారాన్ని నిర్లక్ష్యం చేస్తే, మధుమేహ వ్యాధిగ్రస్తుల రక్తంలో చక్కెర స్థాయిలు పండుగల సమయంలో 20-30% పెరుగుతాయి. స్వీట్లతో పాటు, వేయించిన చిరుతిళ్లు,  ఒత్తిడి కూడా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. అయితే ముందుగానే ప్లాన్ చేసుకుంటే ఈ సమస్యను నివారించవచ్చు. పండుగ సందర్భంలో స్వీట్లు తినే మార్గం.. ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేయకుండా రుచికరంగా ఉండే విధంగా స్వీట్లు  తినడం ముఖ్యం. దీనికి ఉత్తమ మార్గం మితంగా స్వీట్లు తినడం. ఒకేసారి ఎక్కువ స్వీట్లు తినకూడదు.  స్వీట్లు తినడం  కోసం ఒక నిర్దిష్ట సమయాన్ని నిర్ణయించుకోవచ్చు. వాటిని తినడానికి ముందు తగినంత ప్రోటీన్,  ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. అంటే  సలాడ్ లాంటివి  తిన్న తర్వాత కొద్దిగా స్వీట్లు తినవచ్చు. స్వీట్లు తినడానికి మంచి చిట్కాలు.. ఖాళీ కడుపుతో స్వీట్లు తినకూడదు.. ఖాళీ కడుపుతో స్వీట్లు తినడం వల్ల గ్లూకోజ్ త్వరగా రక్తప్రవాహంలోకి విడుదలై చక్కెర పెరుగుదలకు కారణమవుతుంది. కడుపులో కొంత ప్రోటీన్ లేదా ఫైబర్ ఉన్నప్పుడు స్వీట్లు తింటే చక్కెర నెమ్మదిగా విడుదల అవుతుంది. భోజనంలో ముందుగా స్వీట్లు తినకూడదు.. ప్రధాన భోజనానికి ముందు స్వీట్లు తినడం వల్ల రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది. కూరగాయలు, పప్పులు లేదా సలాడ్లు ముందుగా తినడం వల్ల గ్లూకోజ్ శోషణ నెమ్మదిస్తుంది. ఒకేసారి ఎక్కువ స్వీట్లు తినకూడదు.. ఎక్కువ తీపి పదార్థాలు తినడం వల్ల ఇన్సులిన్ పై అకస్మాత్తుగా ఒత్తిడి పడుతుంది. శరీరం దానిని నియంత్రించలేకపోతుంది.  చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. భోజనానికి ముందు ప్రోటీన్, ఫైబర్ తినాలి.. ప్రోటీన్,  ఫైబర్ చక్కెర శోషణను నెమ్మదిస్తాయి. రక్తంలో చక్కెర పెరుగుదలను తగ్గిస్తాయి.  ఇన్సులిన్ బాగా పనిచేయడానికి సహాయపడతాయి. కొవ్వు తక్కువగా ఉండే స్వీట్లను ఎంచుకోవాలి.. డ్రైఫ్రూట్స్,  స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేసిన స్వీట్లు వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు చక్కెరను నెమ్మదిగా రక్తప్రవాహంలోకి విడుదల చేస్తాయి. అకస్మాత్తుగా  చక్కెర పెరగడాన్ని నివారిస్తాయి. కొవ్వు లేకుండా చక్కెర మాత్రమే ఉన్న స్వీట్లు వద్దు.. కొవ్వు లేకుండా చక్కెర మాత్రమే ఉన్న స్వీట్లు రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచుతాయి. ఇది ఇన్సులిన్ నిరోధకత,  బరువు పెరగడానికి దారితీస్తుంది. కృత్రిమ తీపి పదార్థాలు కలిగిన స్వీట్లు వద్దు.. కృత్రిమ తీపి పదార్థాలు కొంతమందిలో గ్లూకోజ్ జీవక్రియను ప్రభావితం చేస్తాయి. సహజమైన,  తక్కువ చక్కెర కలిగిన స్వీట్లు మంచివి. పడుకునే ముందు స్వీట్లు తినకూడదు.. రాత్రిపూట రక్తంలో చక్కెర తక్కువగా ఉంటుంది. రాత్రి స స్వీట్లు తినడం వల్ల ఉదయం హైపర్గ్లైసీమియా వస్తుంది. నిద్రలో ఇన్సులిన్ స్థాయిలు  సరైనవి కావు. భోజనం తర్వాత 1 టీస్పూన్ వెనిగర్ తీసుకోవాలి..  ఎక్కువగా స్వీట్లు తిన్నట్లయితే.. తిన్న తర్వాత అర కప్పు నీటిలో ఒక టీస్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి త్రాగాలి. ఇది రక్తంలో చక్కెర వేగంగా పెరగకుండా నిరోధిస్తుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా మెరుగుపరుస్తుంది.                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

వాటర్ చెస్ట్ నట్స్.. ఆరోగ్యానికి ఎంత గొప్ప ఔషదమో..!

  సీజన్‌ను బట్టి మార్కెట్లో వివిధ రకాల పండ్లు లభిస్తాయి. వాటిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా ఆ సీజన్ లో వచ్చే  అనారోగ్యాలకు ఆ సీజన్ లో లభించే పండ్లే చెక్ పెడుతుంటాయి.  వీటిలో ఒకటి వాటర్ చెస్ట్‌నట. ఇది  శీతాకాలపు సూపర్‌ఫుడ్‌.  ఇతర సీజన్ లలో డ్రై ఫ్రూట్ రూపంలో కూడా లభిస్తుంది. వాటర్ చెస్ట్ నట్ ఆరోగ్యానికి చాలా చక్కని ఔషదం అని, దీంతో అనేక ఆరోగ్య ప్రయోజాలు ఉన్నాయని అంటున్నారు. దీని గురించి  తెలుసుకుంటే.. వాటర్ చెస్ట్ నట్ లో పోషకాలు.. ఈ పండులో అనేక విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు,  యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. వాటర్ చెస్ట్‌నట్‌లను తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. దీనిలోని ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు,  యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని వివిధ వ్యాధుల నుండి రక్షించడంలో,   ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో పాత్ర పోషిస్తాయి.   ఆయుర్వేదంలో వాటర్ చెస్ట్ నట్స్ కు చాలా   ప్రాముఖ్యత కలిగి ఉంది, ఈ పండు రుచిగా మాత్రమే కాదు, ఆరోగ్య ఔషధం కూడా. పిసిఓఎస్ మహిళలకు.. PCOS, లేదా పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అనేది  హార్మోన్ సమస్యల వల్ల వచ్చే  సమస్య. దీనిలో హార్మోన్ల స్థాయిలు అసమతుల్యమవుతాయి,  అండాశయాలలో తిత్తులు ఏర్పడతాయి. ఇది నెలసరి సరిగా రాకపోవడం,  పిల్లలు పుట్టడంలో ఇబ్బందులు, , అవాంఛిత రోమాలు, మొటిమలు,  బరువు పెరగడం వంటి లక్షణాలకు దారితీస్తుంది.  PCOSతో బాధపడేవారు వాటర్ చెస్ట్‌నట్‌లను తినడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ఇది హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది,  సంతానోత్పత్తికి సపోర్ట్  ఇస్తుంది. డయాబెటిస్.. వాటర్ చెస్ట్‌నట్‌లు డయాబెటిస్ ఉన్నవారికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది, ఇది చక్కెర పెరుగుదలను నివారిస్తుంది . వీటిలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం సులభం చేస్తుంది. జీర్ణక్రియ.. వాటర్ చెస్ట్‌నట్‌లు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి.  ఎందుకంటే వాటిలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు సపోర్ట్  ఇస్తుంది. జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.  వీటిని తినడం వల్ల అసిడిటీ,  గుండెల్లో మంట నుండి ఉపశమనం లభిస్తుంది. ఎముకలు, జుట్టు ఆరోగ్యం.. వాటర్ చెస్ట్‌నట్‌లు ఎముకలు, జుట్టు ఆరోగ్యానికి కూడా తోడ్పడతాయి. వాటర్ చెస్ట్‌నట్‌లలో కాల్షియం, మెగ్నీషియం,  భాస్వరం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా,  బలంగా ఉంచడానికి సహాయపడతాయి. దంతాలు,  జుట్టును కూడా బలోపేతం చేస్తాయి. బలహీనత, అలసట.. వాటర్ చెస్ట్‌నట్‌లను తీసుకోవడం వల్ల సాధారణ బలహీనత,  అలసట నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ పండు శరీరానికి సమృద్ధిగా పోషణను అందిస్తుంది, ఎనర్జీని  పెంచుతుంది.                       *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

వాల్నట్స్ తింటే ఈ ప్రయోజనాలు అన్నీ మీ సొంతం..!

  బాదం, జీడిపప్పు లాగా వాల్నట్స్ ను కూడా చాలామంది డ్రై ఫ్రూట్ గా తింటారు.  ఇవి ధర కాస్త ఎక్కువే కానీ ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.  మెదడు ఆకారాన్ని పోలి ఉండే ఈ వాల్నట్స్ ను రెగ్యులర్ గా డైట్ లో భాగం చేసుకుంటే అద్బుతమైన ప్రయోజనాలు ఉంటాయి. సాధారణంగా ఎండు వాల్నట్స్ మాత్రమే ఎక్కువ అందుబాటులో ఉంటాయి. కానీ నిజానికి వాల్నట్స్ ను పచ్చిగా ఉండగానే తింటే దాదాపు వెనీలా సువాసనతో చాలా రుచిగా ఉంటాయి.  అసలు వాల్నట్స్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే.. బ్రెయిన్ పవర్.. చూడ్డానికి అచ్చం మెదడు ఆకారాన్ని, మెదడుకు ఉన్న మలుపులను పోలి ఉండే వాల్నట్స్ తింటే బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. వాల్నట్స్ లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి.  ఇవి జ్ఞాపకశక్తిని,  ఆలోచనా సామర్థ్యాన్ని పెంచుతాయి. మెదడు ఆరోగ్యం మెరుగ్గా ఉండటానికి వాల్నట్స్ బాగా సహాయపడతాయి. గుండె ఆరోగ్యం.. వాల్నట్స్ లో ఉండే ఒమేగా-3 ప్యాటీ కొవ్వులు ఆరోగ్యకరమైన కొవ్వుల జాబితాకు చెందినవి.  ఇవి గుండెకు చాలా అవసరం.  గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి సహాయపడతాయి.  ముఖ్యంగా ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి అందుతూ ఉంటే.. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ కూడా నెమ్మదిగా తగ్గుతుంది.  అంటే.. వాల్నట్స్ తింటే చెడు కొవ్వులను కూడా తగ్గించుకోవచ్చు. ఫైబర్, ప్రోటీన్.. వాల్నట్స్ లో ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి.  ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి. వీటిని తినడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన ఫీల్ ఇస్తుంది. పదే పదే ఆకలి కావడం,  ఎక్కువగా తినడాన్ని నివారించడంలో సహాయపడుతుంది. తద్వారా బరువు కూడా తగ్గవచ్చు. జీర్ణక్రియ.. వాల్నట్స్ లో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది.  ఇది జీర్మవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకం వంటి సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. బోన్ స్ట్రెంత్.. వాల్నట్స్ లో కాల్షియంతో పాటు ఇతర ఖనిజాలు కూడా ఉంటాయి.  ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ఎముకలు ఆరోగ్యంగా ఉండటంలో కూడా సహాయపడతాయి. మానసిక ఆరోగ్యం.. వాల్నట్స్ లో ఉండే సమ్మేళనాలు మానసిక స్థితిని మెరుగుపరచడంలో అద్భుతంగా సహాయపడతాయి.  ఇవి మెదడు ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి కాబట్టి మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా ఉంచుతాయి.  చిరాకు, అసహనం,  ఒత్తిడి వంటి వాటిని అదుపులో ఉంచుకునే దిశగా మెదడుకు ఓదార్పును ఇస్తాయి. హ్యాపీ హార్మోన్స్ ఉత్పత్తిలో సహాయపడుతుంది. నిద్ర.. వాల్నట్స్ లో మెలటోనిన్ అనే పదార్థం ఉంటుంది.  ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. సాయంత్రం వాల్నట్స్ తింటే రాత్రి సమయంలో హాయిగా నిద్రపోవచ్చు. ఇమ్యూనిటీ.. వాల్నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.  ఇవి శరీరంలో హానికరమైన కణాలతో పోరాడి శరీరాన్ని వ్యాధుల బారి నుండి రక్షిస్తాయి.                           *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...