రాహుల్ గాంధీపై ఈసీ విచారణ
posted on Nov 18, 2012 @ 10:28AM
ఆస్తులకు సంబంధించి ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై ఎన్నికల కమిషన్ రాహుల్ గాంధీపై విచారణకు ఆదేశించింది. అమేథీ లోక్ సభ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారికి లేఖ రాసింది. జనతాపార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్యస్వామి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈసీ విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
సుబ్రమణ్య స్వామి ఇచ్చిన ఫిర్యాదు కాపీని రిటర్నింగ్ అధికారికి పంపించాలని ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్టోరల్ అధికారిని ఆదేశించింది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 195 ప్రకారం అభ్యర్థి సమర్పించిన అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఉందని రిటర్నింగ్ అధికారి భావిస్తే చర్యలు తీసుకునే వీలుంటుంది.
2009 లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఈసీ దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో అసోసియేట్ జర్నల్స్ లో రాహుల్ గాంధీ తనకున్న పేర్లని పేర్కొనలేదని సుబ్రమణ్యస్వామి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సోనియా, రాహుల్ గాంధీలు పెద్దఎత్తున భూ కుంభకోణాలకు పాల్పడ్డారనికూడా గతంలో సుబ్రమణ్యస్వామి ఆరోపించారు.