ఢిల్లీ వర్సిటీ విద్యార్ది ఆత్మహత్య
posted on Nov 17, 2012 @ 1:26PM
ఢిల్లీ విశ్వవిద్యాలయంలో 21 సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్ది శివశేఖర్ తన హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శేఖర్ ది బీహార్ లోని నలంద జిల్లా.. విశ్వవిద్యాలయం ఆవరణలోని హిందూ కాలేజ్ హాస్టల్లో 112వ నెంబర్ గదిలో శేఖర్ ఒక్కడే ఉంటున్నాడని వర్సిటీ అధికారులు చెబుతున్నారు.
శేఖర్ ఉరేసుకుని ఉండడాన్ని గమనించిన తోటి విద్యార్దులు శుక్రవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో చూసి హాస్టల్ వార్డెన్ కి సమాచారం అందించడంతో విషయం వెలుగులోకొచ్చింది. శివ శేఖర్ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉత్తర ఢిల్లీలోని హిందూ రావు ఆస్పత్రికి తరలించారు. అతని కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు వివిధ కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు.
శివ శేఖర్ గది నుంచి పోలీసులు క్లాస్ లెక్చర్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాంట్లోని ఓ పేజీలో ఇది నా జీవితం అని రాసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనతో విద్యార్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.