ఓయూలో ఉద్రిక్తత, బాష్పవాయువు ప్రయోగం
posted on Sep 28, 2012 @ 5:14PM
ఉస్మానియా యూనివర్శిటీలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీయే అడ్డంకి అంటూ కాంగ్రెస్ నాయకులు దిష్టిబొమ్మతో ఓయూలో విద్యార్ధులు మరోసారి ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున విద్యార్థులు ఆర్ట్స్ కళాశాల నుండి ర్యాలీగా బయలుదేరి వస్తుండగా ఎన్‌సీసీ యాదయ్య గేటు వద్ద పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. బయటకు రాకుండా ప్రధాన ద్వారానికి తాళం వేశారు. దీంతో విద్యార్ధులు - పోలీసుల మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్ధులు పోలీసులపైకి రాళ్ళురువ్వారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తేచ్చేందుకు పోలీసులు బాష్పవాయును ప్రయోగించారు. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. విద్యార్ధులు రోడ్డు మీదకు రాకుండా గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే అటుగా వెళ్లే బస్సులను దారి మళ్లించారు.