కాంగ్రెస్ పై మోడీ సెటైర్లు
posted on Sep 11, 2013 @ 12:10PM
బీజీపీ పార్టీ ఎన్నికల ప్రచార సారథి, గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సభలో ఆయన కాంగ్రెస్ పార్టీ అవినీతిపై...ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పైనా విరుచుకు పడ్డారు. కాంగ్రెస్ పార్టీకి అవీనితి దినచర్యగా మారిపోయిందని అన్నారు. మన దేశంలో అవీనితిని తరిమేయాలంటే కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి తరిమేయలన్నారు.
ఇప్పటి కాంగ్రెస్ కేవలం ఒక కుటుంబానికే పరిమితమని, దేశంలోని చిన్నారుల కోసం ఆ పార్టీ కొత్త ఎబిసిడి పుస్తకాన్ని రాసిందన్నారు. 'ఎబిసిడి'లను కొత్తగా విపులీకరించారు...ఎ అంటే ఆదర్శ్ అక్రమాలు, బి అంటే బోఫోర్స్ కుంభకోణం, సి అంటే బొగ్గు, కామన్వెల్త్ కుంభకోణాలు, డి అంటే అల్లుడి కుంభకోణం అని మోడీ ఎద్దేవా చేశారు.
దేశం కోసం సరైన నిర్ణయాలు తీసుకోలేని, ఎటువంటి బాధ్యత లేని ప్రభుత్వం పదేళ్లుగా అధికారంలో కొనసాగుతోందని మండిపడ్డారు. ఈ ప్రభుత్వ వైఫల్యం కారణంగా రూపాయి ఆస్పత్రిలో చేరిందని, ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందన్నారు.