జగన్ పార్టీకి నాగం వార్నింగ్
posted on Dec 26, 2012 3:06AM
తెలంగాణా ఫై స్పష్టమైన వైఖరి ప్రకటించకపోతే, కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలకు పట్టిన గతే పడుతుందని శాసనసభ్యుడు నాగం జనార్ధన రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు. అలాగే, తెలంగాణా ఫై కాంగ్రెస్ కూడా స్పష్టమైన అభిప్రాయం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ విషయంలో కాంగ్రెస్ తన వైఖరిని ప్రకటించకపోతే, ఆ ప్రాంతంలో కాంగ్రెస్ జెండాలను ఎగరనివ్వబోమని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. ఢిల్లీ లో జరిగే అఖిల పక్ష సమావేశంలో అన్ని పార్టీలు తెలంగాణా కు అనుకూలమని చెప్పాలని నాగం అన్నారు. కొన్ని వందల మంది ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మ బలిదానాలు చేసుకొన్నా జగన్ పార్టీ, తెలంగాణా కు అనుకూలంగా నిర్ణయం ప్రకటించకపోవడం దారుణమని నాగం అభిప్రాయపడ్డారు.
తెలంగాణా విషయంలో సీమాంధ్ర పార్టీలన్నీ కుమ్మక్కు అయినట్లు కనపడుతుందని ఆయన అన్నారు.ప్రత్యెక రాష్ట్రాన్ని అడ్డుకోవడానికి వీలుగా పార్టీలు తమ అభిప్రాయాన్ని బయటపెడుతున్నాయని ఆయన అన్నారు. తెలంగాణా కు చెందిన నాయకులంతా, తమ తమ పార్టీలను ఈ విషయంలో ఒప్పించాలని నాగం అన్నారు.