రైలు ప్రమాదానికి ముందు పేలుడు శబ్ధం
posted on Jul 30, 2012 @ 2:19PM
రైలు ప్రమాదానికి ముందు పేలుడు శబ్దం వినిపించిందని ఎస్-11 బోగీ టీటీ అన్నాడు. అయితే ప్రమాద సమయంలో ఎస్-11 బోగీలు పలు పేలుడు పదార్థాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్ని పేలుడు పదార్ధాల అవశేషాలను రైల్వే అధికారుల సేకరించారు. ఈ బోగీలో ఎమర్జెన్సీ కిటికీలు లేకపోవడం వల్లే ప్రయాణికులు బయటకు రాలేకపోయారిన అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఎస్-11,12 బోగీల టీటీ మాట్లాడుతూ రైల్లో ఒక్కసారిగా పేలుడు శబ్ధం వినిపించిందని, వెంటనే పొగ, మంటలు వ్యాపించినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు దక్షిణ మధ్య రైల్వే రూ.5లక్షల పరిహారాన్ని ప్రకటించింది. అలాగే తీవ్రంగా గాయపడిన వారి లక్ష, స్వల్పగాయలైన వారికి రూ.25 వేల నష్టపరిహారాన్ని ప్రకటించింది.