స్వార్థ ప్రయోజనాల కోసమే తెలంగాణ: కట్జూ
posted on Apr 6, 2013 @ 10:20AM
తెలంగాణ రాష్ట్ర డిమాండ్ పై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఉద్యమ నేతలకు ఇబ్బంది కలిగించేలా ఉన్నాయి. తెలంగాణ డిమాండ్ న్యాయమైనది కాదని, కొందరు నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ డిమాండ్‌ని ముందుకు తెస్తున్నరన్నారు. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఇస్తే, ప్రతి జిల్లా కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలంటుంది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి డిమాండ్లే వినిపిస్తాయి. ఇలాంటి పరిస్థితులు దేశ సమగ్రతను దెబ్బతీస్తాయని జస్టిస్ కట్జూ వ్యాఖ్యానించారు. తెలంగాణలో గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గాయన్నారు. మరి జస్టిస్ మార్కండేయ కట్జూ చేసిన వ్యాఖ్యలపై టి.నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.