ఓట్ల కోసమే ఎన్టీఆర్ ఫోటో

 

 

 

 

ప్రభుత్వం ముందు చూపు లేకుండా వ్యవహరి౦చడంతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నెలకొందని ప్రముఖ సినీ నటుడు, నందమూరి బాలకృష్ణ విమర్శించారు. రెండు రోజుల కృష్ణా జిల్లా పర్యటనలో బాగంగా కొమరవోలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరువు కాలంలో రైతులకు టిడిపి తొమ్మిది గంటలు విద్యుత్ సరఫరా చేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రం అంధకారంలో కూరుకుపోయిందని అన్నారు.

 

టిడిపి హయంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని చెప్పారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఓట్లు రాలుతాయనే వైకాపా ప్లేక్సిల్లో ఎన్టీఆర్ బొమ్మను పెడుతున్నారని..అది సరైనది కాదని అన్నారు. ప్లేక్సిల్లో బొమ్మ పెట్టడం పై జూనియర్ ఎన్టీఆర్ స్పందించాలని చెప్పారు. ఎన్టీఆర్ పర్యటనకు కార్యకర్తలు రాకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని అన్నారు. 

Teluguone gnews banner