నేడు జగన్ అక్రమాస్తులపై మరో చార్జ్ షీట్ ...

 

వై.ఎస్. జగన్ కంపెనీల్లో పట్టుబడులు పెట్టిన పెన్నా కంపెనీపై సిబీఐ అభియోగాలు మోపిన సంగతి విధితమే. తాజాగా పెన్నా సిమెంట్స్ కు చెందిన సున్నపురాయి మైనింగ్ లీజు దరఖాస్తులు వైఎస్.ఆర్. ప్రభుత్వంలో ఆగమేఘాలపై కదిలాయి. ప్రభుత్వం చెబితేనే అధికారులు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ఈ కేసుతో సంబంధం వున్న జీవోలకు బాధ్యులుగా గుర్తించి మంత్రులు సబిత, పొన్నాల, గీతారెడ్డిలను సహనిన్డులుగా చేరుస్తారా, లేక సాక్ష్యులుగా చూపిస్తారా అనేది తాజా చార్జిషీట్ లో తేలనుంది. 2008 మార్చి 12న అనంతపురం జిల్లా తలారిచెరువు గ్రామంలో సున్నపురాయి నిక్షేపాలున్న 264 ఎకరాల కేటాయింపు, కర్నూలు జిల్లాలో 807 ఎకరాల సున్నపురాయి ప్రాస్పెక్తింగ్ లైసెన్స్, రంగారెడ్డి జిల్లాలో 548 ఎకరాల మైనింగ్ లీజు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పెన్నా సిమెంట్ అధినేత పెన్నా ప్రతాపరెడ్డి పొందిన మేళ్ళుకు బదులుగా జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని సిబీఐ ఆధారాలు సేకరించింది. అలాగే దాల్మియా సిమెంట్ జగన్ సిమెంట్ కంపెనీ ఇండియా సిమెంట్ లో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం సేకరించింది. ఇంకొక సిమెంట్ కంపెనీ రఘురాం సిమెంట్స్ పేరుతొ గనులు పొందిన భారతీ సిమెంట్ వై.ఎస్. జగన్ దే అనేది బహిరంగ రహస్యం. కాబట్టి ఇప్పుడు తాజాగా సిబీఐ వై.ఎస్. జగన్ పై మరొక చార్జి షీట్ నేడు దాఖలు చేయనుంది.

Teluguone gnews banner