ఫీజు రీ ఇంబర్స్ మెంట్ గందరగోళం
posted on Aug 28, 2012 @ 9:56AM
ఫీజు రీఇంబర్స్ మెంట్ విషయంలో ఇంకా గందరగోళం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం ఫీజుల విషయంలో నిర్ణయం తీసుకోకపోవడం, రీ ఇంబర్స్ మెంట్ వ్యవహారంలో స్పష్టత లేకపోవడం విద్యార్థులపాలిట శాపంగా మారింది. మంత్రివర్గ ఉపసంఘం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ప్రభుత్వ ఉదాసీన వైఖరే ఈ గందరగోళానికి కారణమంటూ విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఫీజుల రీ ఇంబర్స్ మెంట్ ని ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసిందంటూ ఎస్.ఎఫ్.ఐ పెద్ద ఎత్తున ఆందోళన జరుపుతోంది. ఇంజినీరింగ్ ఫీజుల వ్యవహారంలో అమీతుమీ తేల్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోర్ట్ గడపతొక్కింది. కోర్టు నిర్ణయం వెలువడేవరకూ ఈ గందరగోళం తప్పేలా కనిపించడంలేదని విద్యావేత్తలు అంటున్నారు. తమ పిల్లల చదువులతో ప్రభుత్వం ఆడుకుంటోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సమావేశంలో మంత్రివర్గం ఉపసంఘం ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటుందన్న ఆశతో చాలామంది ఎదురుచూస్తున్నారు.