లోన్ కోసం సిబిల్ అవసరం లేదు : కేంద్ర ప్రభుత్వం
posted on Aug 25, 2025 @ 12:17PM
లోన్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోన్ కోసం సిబిల్ స్కోర్ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. మీరు తొలిసారి లోన్ అప్లై చేయాలనుకుంటే, మీ క్రెడిట్ స్కోర్ లేకపోయినా బ్యాంకులు మీ అప్లికేషన్ను రిఫ్యూ చేయలేవు. దీన్ని బట్టి చూస్తే, మీరు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని లేదా మీ వ్యక్తిగత అవసరాల కోసం లోన్ తీసుకోవాలని చూస్తున్నట్లయితే సిబిల్ స్కోర్ లేకపోయినా భయపడాల్సిన పని లేదు..!!
కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరీ ఇటీవల లోక్‌సభలో జరిగిన మాన్సూన్ సెషన్‌లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. మొదటిసారిగా లోన్ కోరే వారు క్రెడిట్ హిస్టరీ లేకపోతే కేవలం దానివల్ల వారి అప్లికేషన్‌ను తిరస్కరించకూడదని ఆర్‌బీఐ తమ మార్గదర్శకాలలో తెలిపింది.
సిబిల్ స్కోర్ అనేది 300 నుంచి 900 వరకు ఉండే మూడు అంకెల సంఖ్య. ఇది ఒక వ్యక్తి లోన్ తీసుకునే అర్హతను సూచిస్తుంది. ఈ స్కోర్‌ను క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ అందిస్తుంది. సాధారణంగా పర్సనల్ లోన్, గోల్డ్ లోన్, హోమ్ లోన్ లేదా ఇతర బ్యాంకు రుణాలకు అర్హతను నిర్ణయించడానికి ఈ స్కోర్‌ను బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటాయి. అయితే, మొదటిసారి రుణం తీసుకునేవారికి ఈ స్కోర్ లేకపోయినా సమస్య లేదని ఇప్పుడు ఆర్‌బీఐ స్పష్టం చేసింది.