ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో లేడీ కిలాడీ అరెస్టు
posted on Aug 25, 2025 @ 12:30PM
డ్రగ్స్ సరఫరా చేసే స్మగ్లర్లు కొత్త కొత్త మార్గాలను అన్వే షించి... డ్రగ్స్ రవాణా చేసే విధా నాన్ని చూసి కస్టమ్స్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అయినా కూడా అధికారులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి డ్రగ్స్ సరఫరా చేసే వారినిపట్టుకుని కటకటాల వెనక్కి పంపించే వరకు ఊరుకోవడం లేదు... వారు వేసిన ఎత్తులకు కస్టమ్స్ అధికారులు పై ఎత్తులు వేసి వారి ప్లాన్లను చిత్తు చేసి... శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తున్నారు
ఢిల్లీలో దిగిన ఓ లేడీ లాడి తన లగేజీని తీసుకొని జోరుగా, హుషారు గా వెళ్తున్న సమ యంలో... ఎందుకో కానీ కస్టమ్స్ అధికారులకు ఆ లేడీ కిలాడి మీద అనుమానం వచ్చింది... వెంటనే ఆమెను అదుపు లోకి తీసుకొని ఆమె లగేజ్ను చెక్ చేశారు. లగేజ్ లో ఉన్న చాక్లెట్లను చూసిన కస్టమ్స్ అధికారులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. దోహా నుండి ఢిల్లీకి వచ్చే ఓ లేడీ కిలాడీ కస్టమ్స్ అధికారుల చేతికి చిక్కకుండా ఎంతో జాగ్రత్తగా గోల్డ్ కలర్ చాక్లెట్స్ 8 Ferrero Rocher చాక్లెట్ బాక్స్ లో కొకైన్ నింపి.. బ్యాగులో పెట్టుకుని ఢిల్లీ ఎయిర్పోర్టులో దిగింది.
చూస్తే అచ్చం చాక్లెట్ గా కనిపించే కొకైన్ నింపి ఉన్న వాటిని చూసి అధికారులు ఆశ్చర్యచకితులయ్యారు. అనంతరం వెంటనే కిలాడి లేడిని అదుపు లోకి తీసుకొని ఆమె వద్ద ఉన్న 82 కోట్ల విలువ చేసే 5.5 కేజీల కొకైన్ స్వాధీనం చేసు కున్నారు. అసలు ఈ లేడీ ఎవరికోసం డ్రగ్స్ తీసుకొచ్చింది ఎక్కడినుండి తీసుకువచ్చింది అనే కోణంలో ఎండిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు.