రాష్ట్ర రాజకీయాలఫై పట్టుకు చిరు ప్రయత్నం ?
posted on Dec 20, 2012 @ 11:26AM
కాంగ్రెస్ నేత, కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి చిరంజీవి రాష్ట్ర రాజకీయాలఫై పూర్తి పట్టు సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన కాంగ్రెస్ సదస్సులో చిరు ఆకట్టుకొనే ప్రసంగం చేసిన విషయం తెలిసిందే.
త్వరలో రాష్ట్రంలో కార్పోరేషన్ పదవులకు నియామకాలు జరుగుతాయని ముఖ్యమంత్రి ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఐదు కీలక కార్పోరేషన్ల తో పాటు, మొత్తం పది కార్పోరేషన్ పదవులను తన వర్గానికి చెందిన నాయకులకు ఇప్పించుకొని, తద్వారా రాష్ట్ర పార్టీలో బలమైన గ్రూప్ గా ఎదగాలని చిరు భావిస్తునట్లు సమాచారం. పార్టీలో తన వర్గానికి చెందిన కోటగిరి, డి.టి. నాయక్, బసవరాజు శ్రీనివాస్ వంటి వారిని చిరు ఈ పదవులకు నామినేట్ చేస్తారని తెలుస్తోంది.
ఆయన కేంద్ర మంత్రి అయినప్పటికీ, వారంలో రెండు రోజులు రాష్ట్రంలోనే విధంగా తగిన ప్రణాళిక రూపొందించారని సమాచారం. వచ్చే ఎన్నికలనాటికి ముఖ్య మంత్రి పదవికి తగిన పరిపాలనా అనుభవాన్ని సంపాదించేందుకు కేంద్ర మంత్రి పదవిని చిరు ఉపయోగించుకుంటున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు.