బొత్స సత్యనారాయణ వైరాగ్యానికి కారణం ఏమిటి?
posted on Jul 6, 2012 @ 2:41PM
రాష్ట్రరాజకీయాలలో తన దైన ముద్రవేసికొని హల్‌చల్ చేసిన బొత్ససత్యన్నారాయణ ఈ మద్య ఎందుకనో వైరాగ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో ఫలితాలు ధారుణంగా ఉండడం ఆయన్ని మానసికంగా ఎంతో కలచి వేసిట్లు తెలిసింది. ఒకప్పుడు పెద్ద మద్యం సిండికేట్‌కు అధిపతి అయిన బొత్స ఇప్పుడు మద్యనిషేదాన్ని అమలు చేయాలంటున్నారు. ఇటీవల జరిగిన మద్యం షాపుల విక్రయాల్లో కూడా ఆయన మనుషులు పాలు పంచుకోలేదు. ఉప ఎన్నికలముందు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పై అనేక ఆరోపణలు గుప్పించి, ఢల్లీి తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి అవటానికి ఎంతో కష్టపడ్డ బొత్స ఇప్పుడు ఉదాసీనంగా కనిపిస్తున్నారు.
ఈ విషయంలో కిరణ్‌కుమార్‌రెడ్డి పైచేయిగా వుందని చెప్పవచ్చు. బొత్స చేసిన హడావిడికి కిరణ్‌కుమార్‌రెడ్డి బొత్స మద్యం సిండుకేట్ల బండారం బయటపెట్టి చెక్‌పెట్టారు. ఆతరువాత అధిష్టానం అదిలింపులతో ఇద్దరూ సమైఖ్యంగా ఎన్నికల ప్రచారం చేసినప్పటికి ఎండదెబ్బతప్ప ఏమీ మిగలలేదు. ఇప్పుడు రాజకీయాలలోనూ ప్రతిష్ట దెబ్బతిని అదే సమయంలో ఆదాయవనరుల్ని వదులుకొని నిరుత్సాహంతో ఉన్నారు. కొన్నిచోట్ల వ్యక్తిగత ప్రతిష్టకోసం అభ్యర్థులకు తన జేబులో డబ్బులు ఖర్చుపెట్టినా ఫలితం శూన్యం. ఎంత డబ్బు, సమయం ఖర్చుచేసినా నాకు మిగిలిందేమిటి ఇదంతా ఎందుకోసం చేసినట్టు ఎవరికోసం చేసినట్టు అని వైరాగ్యంలో ఆయన ఉన్నట్లు సన్నిహితుల సమాచారం.