అక్బరుద్దీన్ వ్యాఖ్యలతో ఇబ్బందుల్లో జగన్ పార్టీ ?
posted on Jan 4, 2013 @ 5:47PM
ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఇటీవల నిర్మల్ లో హిందూ మతంఫై చేసిన మతపరమైన వ్యాఖ్యలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో పడినట్లు తెలుస్తోంది. ఎంఐఎం ఇటీవలే కాంగ్రెస్ తో తెగతెంపులు చేసుకొని జగన్ పార్టీతో జతకట్టిన విషయం తెలిసిందే.
ఆ పార్టీతో కలవడం ద్వారా తెలంగాణా ప్రాంతంలో బలపడదామని జగన్ పార్టీ నేతలు ఆలోచించారు. అలాగే, జగన్ తో చేతులు కలపడం ద్వారా, సీమాంధ్ర ప్రాంతాల్లో ముస్లిం జనాభా చెప్పుకోదగిన స్థాయిలో ఉన్న జిల్లాల్లో లభ్ది పొందుదామని ఎంఐఎం పార్టీ భావించాయి. ఈ రెండు పార్టీలు 2014 లో జత కట్టడానికి బహిరంగంగానే తమ ప్రయత్నాలు చేసుకొన్నాయి.
అయితే, మత తత్వాన్ని రెచ్చగొట్టే విధంగా అక్బరుద్దీన్ చేసిన తాజా వ్యాఖ్యలతో జగన్ పార్టీ నేతలు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. అయితే, ఇక సెక్యులర్ పార్టీగా ఎంత మాత్రం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న ఎంఐఎంతో జగన్ పార్టీ జతకడుతుందో లేదోమాత్రం వేచిచూడాల్సిందే.