డియంకె పార్టీ శంకర మఠం కాదు: అళగిరి..!

 

నిన్న మొన్నటి వరకు తీహార్ జైల్లోఉన్న తన కూతురు కనిమోలికోసం వగచిన కరుణానిధి తండ్రి హృదయం, ఆమె బెయిలుపై విడుదలయి బయటకి వచ్చేక ‘హమ్మయ్యా’ అని నిట్టూర్పు విడిచేలోగా పగబట్టిన త్రాచువంటి తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత, అయన కుటుంబంలో, పార్తీలోప్రటీ ఒక్కరినీ, ఒకరొకరిగా కేసుల్లో ఇరికిస్తూ ముప్పతిప్పలు పెట్టసాగింది. 88 ఏళ్ళ కురువృద్దుడు కరుణానిధి తానూ స్వయంగా ఆమెను ఎదుర్కొనే స్థితిలో లేనందున, ఆ పని చక్కగా చేస్తున్న తన రెండవ కుమారుడు స్టాలిన్ ను చూసి మురిసిపోతూ అతనే తన వారసుడని కొద్ది రోజుల క్రితమే ప్రకటించేశారు.

 

ఆవిధంగా ప్రకటించేముందు, తనకి అళగిరి అనే మరో కొడుకు ఉన్నాడని వృద్దాప్యం తెచ్చిన మతిమరుపులో మరిచిపోయేరో మరేమో తెలియదుగానీ, స్టాలినే ఇక ముందు పార్టీని నడిపిస్తాడని ప్రకటించేయడంతో, అళగిరికి కోపం వచ్చేసింది. ఒకనాడు తన తండ్రి చెప్పిన మాటనే మళ్ళీ తనకి గుర్తు చేస్తూ ‘ఈ విదంగా వారసుడిని ప్రకటించేయడానికి డియంకె పార్టీ ఏమి శంకర మఠం కాదని’ ఘాటుగా విమర్శించేడు.

 

తనుకూడా పార్టీపగ్గాలు చేప్పటి ఇవాళ కాకపొతే రేపయినా తమిళనాడుని ముఖ్యమంత్రి గా ఏలుకోవాలని కలలుగంటు కేంద్రమంత్రిగా డిల్లీలో ఉన్న అళగిరికి తండ్రి ప్రకటన ఘాడనిద్రలోంచి మేల్కొలిపినట్లయింది. గానీ, స్టాలిన్ ఇప్పటికే పార్టీపై పూర్తిపట్టు సాదించి ఉన్నాడు.

 

మరి, అళగిరి తన తంబి చేతిలోంచి పార్టీ పగ్గాలు లాకొంటాడా లేక పార్టీని రెండు ముక్కలుగా చీల్చుకొని జయలలితకి ఆనందం కలిగిస్తాడా అనేది చూడాల్సి ఉంది.

 

Teluguone gnews banner