చెన్నైకి తిరిగివచ్చిన నిత్యానంద
posted on Aug 17, 2012 @ 10:30AM
మానస సరోవర యాత్రకు వెళ్ళిన నిత్యానంద శుక్రవారం తిరిగి చెన్నైకి వచ్చారు. చెన్నై విమానాశ్రయంలో భక్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తన యాత్ర ప్రశాంతంగా సాగిందని నిత్యానంద తెలిపారు. మధురై పీఠం వ్యవహారం, పాస్‌పోర్టుల కేసులపై అంతా కాలమే నిర్ణయిస్తుందని ఆయన వేదాంత ధోరణిలో సెలవిచ్చారు. అనంతరం నిత్యానంద గుర్తు తెలియని ప్రదేశానికి వెళ్లిపోయారు. విమానాశ్రయంలో నిత్యానందకు స్వాగతం పలికిన వారిలో మహిళా భక్తులే పెద్ద సంఖ్యలో ఉన్నారు.