గగన్ నారంగ్‌కు 50 లక్షల నజరానా ప్రకటించిన సిఎం
posted on Jul 31, 2012 @ 4:06PM
లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం పతకం గెలుచుకున్న హైదరాబాదీ షూటర్ గగన్ నారంగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. కుమారుడు పతకం సాధించిన సంతోషంలో ఉన్న గగన్ తండ్రి బిఎస్ నారంగ్ ఇవాళ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా సిఎం నజరానాపై ప్రకటన చేశారు. ఇప్పటికే హర్యానా ప్రభుత్వం నారంగ్‌కు కోటి రూపాయల నజరానా ప్రకటించగా... కేంద్ర ప్రభుత్వం ఐఏఎస్ హోదాను ఇచ్చేందుకు నిర్ణయించింది. లండన్ గేమ్స్‌లో 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్ ఈవెంట్లో కాంస్యం సాధించడం ద్వారా తొలి పతకం భారత్ ఖాతాలో చేరింది.