ఆస్టేలియా తర్వాత చరిత్ర సృష్టించిన భారత్
posted on Aug 27, 2012 @ 5:27PM
అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఆస్టేలియా తర్వాత భారత్ తొలిసారి రెండు వరల్డ్ కప్ టైటిల్ ని సాధించిన ఘనతను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకూ క్రికెట్ చరిత్రలో ఇండియా, ఆస్టేలియా మాత్రమే ఇలా రెండు వరల్డ్ కప్ టైటిల్స్‌ని సొంతం చేసుకున్న దేశాల లిస్ట్‌లో ఉన్నాయి. ఆస్టేలియా 1987, 1988లో ఈ రికార్డుని నమోదు చేసింది. ఆస్టేలియా 1987లో సీనియర్ వరల్డ్ కప్‌ని గెలుచుకోగా.. 1988లో తొలిసారి ప్రవేశ పెట్టిన అండర్ 19 వరల్డ్ కప్‌ని కైవసం చేసుకుంది. ఆదివారం టౌన్స్ విల్లేలో జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్టేలియాపై టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. గతంలో భారత్ 2000, 2008వ సంవత్సరంలో అండర్ 19 వరల్డ్ కప్ టైటిల్స్‌ని గెలిచారు.