రైల్ ఇంజన్‌లో మంటలు
posted on Aug 27, 2012 @ 5:51PM
యశ్వంత్‌పూర్ - విజయవాడ ప్యాసింజర్ రైల్ ఇంజన్‌లో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. చేగిచర్ల రైల్వే స్టేషన్ సమీపానికి రైలు చేరుకోగానే ఇంజన్‌లో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అప్పమత్తమైన డ్రైవర్ రైలును నిలిపివేశాడు. రైలు అగగానే ప్రయాణీకులు భయంతో బయటకు పరుగులు తీశారు. వెంటనే రైల్వే అధికారులు మంటలను అదుపుచేశారు. దీంతో ఎలాంటి ప్రాణహాని జరగలేదు.