Previous Page Next Page 
పాకుడురాళ్ళు పేజి 8

"ముందు కాఫీతాగు తరువాత మాట్లాడుకొందాం." అన్నది మంగమ్మ. రాజమణి దృష్టిని మార్చేస్తూ, రాజమణి నిశ్శబ్దంగా కాఫీ త్రాగింది.
"నాకూ నాగమణికి వీదిదగ్గరే చెడిపోయిందే! నువ్వు అదృష్టవంతు రాలివి తొందరగా బయటపడ్డావ్ ! నువ్వు పోయినప్పటి నుంచీ నాగమణి మరింత కట్టు దిట్టం చెయ్యడం సాగించింది. ఆ భడవముండకు పాపపుణ్యాలు, దయా దాక్షిణ్యాలు, లేకుండా పోయాయి. కానీ కోసం ప్రాణాలు తీయ్యమంటే, అది నిస్సంకోచంగా తీసేస్తుంది. డబ్బు, డబ్బు, డబ్బు,. అపరిచిత మైన డబ్బు దాహం డానికి పట్టుకుంది.ఇవతలి మనుషులు ఏమవుతారన్న ఆలోచనే డానికి లేదు. ముండ _ ఇప్పుడు కటికపస్తులు చేస్తోంది. అని కాఫీ కప్పు బల్లమీద పెట్టింది. రాజమణి.
"దాని గుణం నాకు తెలుసు " అన్నది మంగమ్మ.
"ఓసి పిచ్చిముఖందానా, నువ్విక్కడ ఉన్నప్పుడు ఆవిడ దేవత కదుటే."
"అదీ ఇంట్లోంచి పోవడంమెందుకొచ్చిందీ?" అన్నది మంగమ్మ.
వాసంతి, కాఫికప్పులు పట్టుకెళ్ళి ఒ సీగరేట్ పెట్టా, అగ్గి పెట్టా తెచ్చింది.
రాజమణి ఒ సీగారేట్ వెలిగించి గుండెల నిండుగా పొగ పీల్చి వదిలింది.
"నువ్వేమార్కు కాలుస్తావే?" అన్నది రాజమణి
"ఏదీ వొద్దు"
రాజమణి నవ్వింది. చిటికేనవేలితో సుతారంగా సిగరెట్టు సుసిరాల్చుతూ, మంగమ్మకేసి చూసింది.
"అసలే జరిగిందంటే-" అంటూ ప్రారంభించింది రాజమణి. "నెల్లూరు నించి ఇద్దరు  ఆసాములోచ్చారు. అబ్దుల్లా -నీకు జ్ఞాపకం ఉన్నాడా?"
"ఓ వాడింకా బేరాలు కుదురుస్తూనే వున్నాడా? పాపం, వాడి కూతు రుండాలిగదూ?" అన్నది మంగమ్మ.
"ఉంది ఉంది, దాని పేరు కుతుబ్, దానికి పెళ్లయింది. ఆ మొగుడో లత్కరువేధవ. రెండేళ్ళు దాన్ని నానా బాధలూ పెట్టి చచ్చాడు. అప్పటికి కుతుబ్ కో కూతురు. అది కూడా ఇప్పుడు, ఈ పెటలోనే ఉంది, మరేం చస్తుందా? కూతుర్ను, అడ్డం పెట్టుకోని బతుకుతున్నాడు. వాణ్ని - దేవుడు కూడా బాగు చెయ్యలేడనుకోవే మంగమ్మ ! సరే -ఎంతవరకోచ్చానూ? అఁ .....అవునా? ఆ అబ్దుల్లా గాడు నెల్లూరు అసాముల్ని మనింటికి పట్టుకోచ్చాడు. ఇద్దారూ పిడిరాళ్ళున్నట్టు ఉన్నారనుకో. వాళ్ళు మైకా బిజినెస్ చేస్తారట. నాగమణి తో మాట్లాడి నన్ను కుదుర్చుకొన్నారు. నాకెందుకో,ఆపూట మనస్సు బాగాలేదు. అంతకు ముందు నాలుగైదు రోజులపాటు జ్వరం కూడా తగిలింది.నన్నడిగితే నేను కాదన్నాను గదా అని, ఆ ఆసాములు, 'నువ్వే కావాలంటూ'పట్టుపట్టారు. పది రూపాయల నోట్ల కట్ట నాగమణి మీదకి విసిరేశారు. డబ్బు చూడటంతోనే దానికి మతి తప్పిపోయింది. మీరు బోంచేసిరండి నాయనా ! మిగతా సంగతులు మీ కెందుకు, నేను చూసుకొంటానుగా!" అంటూ నాగమణి వాళ్ళను సాగనంపింది."నాగమణి మీద అదివరకెప్పుడూ రానంత కోపం వచ్చిందే మంగమ్మా! చేడామాడా తిట్టాను. అదీ తిట్టింది. నేనూ తిరగాపడ్డాను. అది నన్ను గోజ్జును బాదినట్టు బాదింది. వొళ్ళంతా వాచేపోయింది. నాకైతే తెలీదు గానీ, ఆ రోజున నేను పిచ్చి పిచ్చిగా అరిచానట. బృంద చెప్పింది. అసలీ నాగమణికి మనమీద ఎవరు అధికారమిచ్చారో తెలీదు. మనం సంపాదుస్తున్నాం, ఆ సంపాదనంతా అది కాజేస్తుంది. మనకు తిండి గుడ్డా ఏడుస్తూ ఇస్తోంది. మన సంపాదన మనకే ఎందుకు ఉండకూడదనిపించింది. అందర్నీ కూడగట్టుకోన్నాను, అందరూ నన్నే సైడ్ చేశారు. దాన్ని జుట్టుపట్టుకుని బయటకి లాగాం, ఏమో సిక్షకూడా పడింది. జైల్ నుంచి వచ్చాక.,అది మళ్ళా వచ్చింది. గడప మీద కాలుపెడితే, తటామని చెప్పాను. బెదిరించింది, బామాలింది, కాళ్ళమీదపడి
"పోనీ రానివ్వకపోయ్యావుటే?" అన్నది మంగమ్మ.
"దాన్నా? నాగొంతులో ఊపిరుండగా,మళ్ళా ఈ కొంపలోకి రానిస్తానుటే పిచ్చిదానా! సాగినంతకాలం, దాని అదికారం సాహింది. మనుషుల్ని గానుగాలోవేసి, పిండి డబ్బుసంపాదించింది. ఎంత మంది కుళ్ళి, పురుగులు పడతాయి" అన్నది రాజమణి.
"ఇప్పుడెం చేస్తుంది?"
"కొంతకాలంపాటు, మళ్ళా వ్యాపారం చెయ్యాలని చూసిందే. అది సాగలేదు.చెవుల పోగులమ్మి,వేరుశనక్కాయలు,శనగగుగ్గిళ్ళు బేరం చేసింది. అదీ సాగడంలేదు. ఇప్పుడు ఎవరన్నా పెడితే ఇంత తింటుంది.లేదా వాసంతి వచ్చింది.
"అక్కా!" అంటూ వాసంతి వచ్చింది    
ఆ పిల్లను చూసింది మంగమ్మ, తెలివైనా ముఖం. ఇంకా  నలిగిపోనీ పువ్వులాగా నవనవలాడుతూ వుంది.
"ఏమిటమ్మా?"అన్నది రాజమణి.
"ఆ మంగళగిరివాళ్ళొచ్చారు" అన్నది వాసంతి, ముఖం అదోలాగా పెట్టి.
"నీ యిష్టం మరి?" అన్నది రాజమణి
"ఈపూట - వొద్దులే అక్కా!" శకుంతల సరేనన్నది.వాళ్ళు నేనే కావాలంటున్నారు చచ్చనాళ్ళు.
"ఇప్పుడేవస్తానుండవే!"అంటూ రాజమణి వెళ్ళిపోయింది.
"నీదేవూరమ్మాయ్?"అన్నది మంగమ్మ, వాసంతిని కుర్చోమంటూ చేత్తో సైగాచేసి.
"ఏలూరు"
"నువ్వు బాగా పాడతవటగా?"
వాసంతి నవ్వింది.
మంగమ్మ ఇంకేదో అడగబోయింది, అంతలోనే రాజమణి ధుమధుమలాడుతూ వచ్చింది.
"ఏమిటే, ఆకోసం?" అన్నది మంగమ్మ నవ్వుతూ.
వొంట్లో బావోలేదా?" అన్నది మంగమ్మ, వాసంతి తల నిమురుతూ.
"అది కాదే ! మునుపోసారి, యాభైరూపాయలిచ్చి, ఈ పిచ్చి ముండను, వాళ్ళ గదికి పట్టుకెళ్లారు. ఈ ఇద్దరూ గాక, అక్కడింకో ఇద్దరున్నారుట. తెల్లవార్లూ దాన్ని చావచితక గొట్టి పంపించారు. బిడ్డ నాలుగురోజులదాకా మనిషి కాలేదనుకో. మందమ్మా! ముష్టి డబ్బును, మనం ఎంతచూశాం కాదూ, వేలు సంపాదించి, వేలు ఖర్చు పెట్టాం మనం ! ఈ లుచ్చాగాళ్ళిచ్చే యాభైరూపాయల కోసం మనం ముఖం వాచి కూచున్నామా? పొమ్మని చెప్పేశాను. సిగ్గులేని వెధవలుపోరు గదా! కావలిస్తే ఇంకో పాతిక పుచ్చుకోమన్నారు. ఆ పిల్ల మందు తింటోందని చెప్పోచ్చాను. పోతామన్నారు. మరి పోయ్యారో లేదో తెలీదు." అన్నది రాజమణి.
"మరి నేను వేడతానోయ్!" అని మంగమ్మ లేవబోయింది. రాజమణి రెండుచేతులూ మంగమ్మ భుజాల మీద వేసినొక్కింది.
"ఈ పూట పోవడానికి వీల్లేదు. ఎన్నేళ్ళ తరవాతనో వచ్చావు. ఈ వొక్క రాత్రి నాతో ఉండిపోవాలి. పోయ్యావంటే నామీద వోట్టే!" అన్నది రాజమణి. ఆ ఆప్యాయతకు మంగమ్మ కరిగి పోయింది.
"నేనుంటే నీకు అడ్డంకాదుగదా?" అన్నది మంగమ్మ నవ్వుతూ.
"పత్తిత్తులాగా మాట్లాడకోయ్, నీగ్గూడా ఏమన్నా బేరం మాట్లాడమంటావా?" అన్నది రాజమణి, లుంగీలు తిరిగేదాకా నవ్వుతూ.
మంగమ్మ కూడా నవ్వింది.
"మనమంటే డక్కా మొక్కీలు తిన్నవాళ్ళం - ఫర్వాలేదు గానీ, ఈ వాసంతి లాంటివాళ్ళు,ఈ వృత్తి
కేపనికి రారే మంగమ్మా! నాదగ్గరే డబ్బుంటే, ఎవరన్నా మంచివాణ్ణి చూసి పెళ్ళిచేద్దును. నువ్వు వినలేదు గాని అలకిస్తాయనుకోవే! ఈ పాడు ముండావ్యాపారంలోంచి దాన్ని కాస్త పైకి లాగావో -నీమేలు జన్మ జన్మలాకూ మరచిపోననుకో. మీ నాటకాల్లోకి ఆడవాళ్ళు కావాలిగా! కాస్త -మరి ఆ రామచంద్రంగారికో మాధవరావుగారికో చెప్పరాదుటే!" అన్నది రాజమణి.
మంగమ్మ సన్నగా నిటూర్చింది .
ఆవులిస్తే పేగులు లెక్కపెట్టే రాజమణి, ఏదో జరిగిందని వెంటనే పసికట్టింది.
"నువ్విపుడా నాటకాల కంపినీలో లేవా?" అన్నది రాజమణి ఆవిడగుండె దడదడలాడాయి.
"లేను. అకంపెనీనవి ఎత్తేస్తారు."
నెత్తిమీద ఎవరో అణిచిపెట్టినట్టుగా రాజమణి నీరసంగా కుర్చిలోకి జారిపోయింది. ఆవిడ నోటమాట రాలేదు. కళ్ళలో మాత్రం నీళ్ళు ఊరాయి.
"ఇప్పుడే మయిందనే ఆ విచారం?" అన్నది మంగమ్మ.
"ఈ కూపంలోంచి నువ్వన్నా బయట పడ్డవనుకున్నాను. తిరిగి ఇక్కడికే వచావన్నమాట! ఏం బ్రతుకులే మనవి మంగమ్మా ! ఛా ఛా !....అన్నది రాజమణి.
మంగమ్మ ఎమీ మాట్లాడలేదు.
"అయితే నువ్విప్పుడెం చేద్దా మనకుంటున్నావ?" అన్నది రాజమణి, కన్నీళ్లు తుడుచుకోంటూ.
"ఇంతవరకూ ఏమీ అనుకోలేదు."
"అందాకా నాదగ్గరే ఉండవే! భగవంతుడి దయవల్ల వ్యాపారం భాగానేసాగుతోంది. ఉన్నంతలోనే ఇద్దరం తిందాం ! నేనుతిని, నిన్ను పస్తుంచుతానన్నమాట కల్ల. ఉంటే ఇద్దరం తిందాం లేకపోతే యిద్దరం పస్తులుందాం. సరేనా?" అన్నది రాజమణి.
ఈ మాటలు మంగమ్మ మీద బాగా పనిచేశాయి. ఆవిడ హాఠాత్తుగా, రాజమణిని కావలించుకుని "నువ్వెంత మంచిదానివే రాజ్యం!" అన్నది ఏడుపుతో పూడుకుపోయిన గొంతును సవరించుకొంటూ.
క్రమక్రమంగా గదుల్లో సందడు లేక్కువవుతున్నాయి. రేడియోలో లత కంఠంకమ్మగా వినిపిస్తోంది. మంగమ్మ ముఖంలో సన్నగా చిరునవ్వు వెలుగుతోంది. వసంత లేడిపిల్లలా అటూ ఇటూ గెంతుతోంది.
"మరి నేను వెడతాను" అన్నది మంగమ్మ.
"అంతేగానీ ఉండవన్నమాట!" అన్నది రాజమణి.
"నువ్విలా నిష్టూరాలాడాకే రాజ్యం. నువ్వు నాకు కొత్తదానివి కనకనా, ఇంతసేపు బ్రతిమి లాడించుకోవడానికి! మళ్ళా వస్తానుగా !" అన్నది మంగమ్మ.
"సరే నీ ఇష్టం !" అన్నది రాజమణి నీరసంగా లేచి నిలబడుతూ. "రేపు ఉదయం రావె! ఇద్దరం ఇక్కడే భోంచేద్దాం. పని కూడా లేదుగా!" అన్నది రాజమణి.
"అలాగే" నంటూ మంగమ్మ లేచింది.
వసంత ఓ సారి నవ్వి, మంగమ్మ వెనకాలే బయలుదేరింది.
"నీ పాత విన పడనే లేదు వసంతా! రేపోస్తానాను, తప్పకుండా నీపాట వింటాను.నాకు చేతనయిన సహాయం నీకు చేస్తాను."
వసంత కళ్ళు మిలమిలలాడాయి.
మంగమ్మ చట్టూ చాలా మంది అమ్మాయిలు చేరారు. మద్య హాలులోకి వచ్చేసరికి అక్కడ అయిదారుగురు మొగవాళ్ళు కూచున్నారు. ఎంతో ఖరీదైనా గుడ్డలు వేసుకున్నారు. ఒకతనను రూపాయల నోట్లకట్టలు పైకి కనిపించేలగా జేబులో పెట్టుకున్నాడు. ఆయన మంగమ్మను చూస్తూనే కళ్ళింత చేసుకున్నాడు. ఓసారి వొళ్ళంతా కుదుపుకోని, మంగమ్మను చూపులతో తడిమి, పెదిమలు తడిచేసుకొన్నాడు.
"నిన్నేక్కడో చూశాను" అన్నాడతను మంగమ్మను చూపులతో కట్టేస్తూ.
వాడి అబినయాన్ని చూసిన తరువాత దగ్గరగా వచ్చింది. ఉత్తినే పనిట సరిచేసుకొంది. సిగ్గు పడుతున్నట్టుగా తలనుదించుకొని గబగబా బయటకోచ్చింది. రాజమణి, వసంత, లోలోపల చచ్చేట్టు నవ్వుకొన్నారు. అతగాడు కుర్చీలో ఉక్కిరి బిక్కిరియి పోతున్నాడు.
"అలా చేసావేం?" అన్నది రాజమణి.
"తప్పా?" అన్నది మంగమ్మ.
రాజమణి ఇంకేమీ మాట్లాడలేదు. ముగ్గురు ఆడవాళ్ళు నీధి లోకోచ్చాక్, దూరంగా ఉన్న రిక్షావాడొకడు, గంట మోగించుకుంటూ చీడీల దగ్గరకు బండిని తీసుకొచ్చాడు.
"అక్కర్లేదు లేవోయ్....వీలుంటే రేపోస్తాను రాజ్యం! వస్తానమ్మా వసంతా.... పోనియ్యవోయ్" అన్నది మంగమ్మ.  
మంగమ్మ ఎక్కి కూచుంది.
రిక్షావాడు, టాపు వెయబోతున్నాడు.
"అక్కర్లేదు లేవోయ్..... వీలుంటే రేపోస్తాను రాజ్యం! వస్తానమ్మా వసంతా.... పోనియ్యవోయ్" అన్నది మంగమ్మ.
రెండు ఫర్లాంగులోచ్చాక గానీ మంగమ్మకు, నాగమణి సంగతి జ్ఞాపకం రాలేదు.
"ముసిలితొక్కు ఎలాఉందో చూదామా" అనిపించింది మంగమ్మకు. కానీ తనకు సరైనా ఎడ్రస్ తెలియదు. ఈ చీకట్లో ఆయిల్లు వెదుక్కుంటూ తిరగడంకన్నా, రేపు వేడితేనేబావుంటుందనుకోంది. రిక్షాను సరాసరి హౌటలుకు పోనివ్వమంది. దోవలో ఆవిడకు ఎన్నో సంఘటనలు గుర్తుకొచ్చాయి. మాధవరావు, రామచంద్రం, నాగభూషణం, చలపతి, నాటకాలు,చప్పట్లు జనం గోల-వీటన్నింటి మద్యా, తను ఏకాంతంగా ఉండగలగటం! ఎవరో చీకట్లో తనను రాచుకొంటూ వెళ్లడం జ్ఞాపకం వచ్చి నవ్వుకోంది మంగమ్మ.
-సరగ్గా అన్నం తినబుద్దికాలేదు. అటూ ఇటూ కెలికి కంచంలోచెయ్యి కడుక్కొంది. మధ్యాహ్నం తనకు కాఫీ తీసుకొచ్చిన సర్వరే, ఈపూటా భోజనం పట్టుకొచ్చాడు. వాణ్ని రవంత సేపు మాటల్లోకి దించి ఏడిపించామనిపించింది మంగమ్మకు.
"నువ్వేప్పటిదాకా పనిచేస్తావయ్య" అన్నది మంగమ్మ పమిటతో మూతిని తుడుచుకుంటూ.
"టైం లిమిట్ లేదు. ఎప్పుడుమానుకున్నా, మన్నేవరూ అడగరు" అన్నాడు వాడు.
"నన్నేప్పుడన్నా చూశావా?"
"చాలాసార్లు చూశాను. నీ నాటకం ఉన్నరోజున, నేను హాజరుకాకుండా ఉన్న దోక్కటీలేదు."
"ఏ నాటకం నీకు బాగుంది?" అన్నది మంగమ్మ కుర్చీలో కూచుంటూ.
అతనింకా నిలబడే ఉన్నాడు.
"ముందుకూచే-" అన్నదావిడ.అతను కుర్చీనీ, మంగమ్మకు దగ్గరగా లాక్కుని కూచున్నాడు. మంగమ్మ అతనికేసే చూస్తోంది. అతని ముఖంలో బ్రహ్మండమైనా సంతృప్తి వెలుగుతోంది.
అతను చెబుతున్న మాటలువిని మంగమ్మ ఆశ్చర్యపోయింది. అయిదారు నాటకాల్లో అవిడన్న సంభాషణలన్నీ అతడు పొల్లుపోకుండా చేప్పాడు.
"అంటే నన్ను చాలాకాలంనుండి ఎరుగుదువన్నమాట?"
అతను కొద్దిసేపు మంగమ్మను కళ్ళార్పకుండా చూసి, "అన్నీ నాకు నచ్చాయి. నువ్వంటే నాకు చాలా ఇష్టం!" అన్నది మంగమ్మ.
ఆ మానవుడు నిలువునా కరిగిపోయాడు.
అతను వెళ్ళిపోయాక, మంగమ్మ మంచంమీదపడి పొట్ట చేక్కలయ్యేలాగ నవ్వుకొంది. రాజమణి ఇంట్లో తనకు తటస్థపడ్డ. పెద్దమనిషిగానీ, ఈ సర్వర్ గానీ, ఈ రాత్రి నిద్రాపోతారన్న నమ్మకం ఆవిడకులేదు. అలా వాళ్ళనుభాధించి, వేధించి వదలాలన్న ఉద్దేశం తోనే, తను అలా అన్నది. ఈ రాత్రల్లా వాళ్ళు తనను గురించి ఆలోచిస్తూనే ఉంటారు. కలలు గంటూనే ఉంటారు. తనకోసం ఆరాటపడుతూనే ఉంటారు. అందువల్ల తనకేం జరిగిందని కాదు, వాళ్ళు బాధపడితే తనకంతేచాలు....
మంగమ్మ ఆలోచనలతో వాళ్ళకు నిద్రపట్టినా పట్టకపోయినా, ఆవిడకు మాత్రం వీళ్ళ ఆలోచనలతో కునుకు పట్టలేదు. మద్య మద్య వసంత, రాజమణి జ్ఞాపకం రాసాగారు. రాజమణిని తలుచుకున్నప్పుడల్లా మంగమ్మ చలించిపోయేది. తనా ఊబినుండి బయట పడబట్టి గానీ, లేకపోతే తనూ అలానే తయారయి ఉండేది. మళ్ళా ఆ మురికి కూపంలోకి వేల్లడమన్నది జరగదు. కానీ వెళ్ళాక చేసేదేమిటో మంగమ్మకు పాలుపోలేదు.
ఏం చేసేదో ఏమో తెలియదుగానీ, ఆ తెల్లావారే చలపతిగారు కనిపించారు. ఆయనకూడా లోగడ మంగమ్మతోబాటు పనిచేసిన వాడే! రెండేళ్ళపాటు, రకరకాల నాటకాల్లో రకరకాలు వేషాలు వేశాడు. ఆ తరువాత సమాజంలో పేచీలు వచ్చి మద్రాసు వెళ్ళిపోయాడు. ఎవో సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తున్నాడని కొంత కాలం అనుకొన్నారు. అంతకుమించి చలపతిని గురించిన సమాచారమేమీ తెలియదు.
నీకోసం నిన్నల్లా తిరిగితిరిగీ చచ్చాను మంగమ్మా! ఇవ్వాళ కూడా నువ్వు కనిపించక పోయినట్టయితే, ఈ రాత్రి బండికి పట్నం చేక్కేసేవాణ్ని. ముందుగా నేను స్తానం చెయ్యాలి. గుడ్డలు విడవాలి.. మండే పొట్టకింత మెత పడెయ్యాలి. ఆ తరువాత గానీ, నేనేమీ మాట్లాడలేను. నువ్వసలు కనిపించవనుకున్నాను.అవతల వాళ్లకేం చెప్పడమా అని మల్ల గుల్లాలు పడుతున్నాననుకో. భగవంతుడి దయ వల్ల నీద్రశనమయింది. అదేపదివేలు.... ఈ హొటల్లో వేణ్నిళ్లుంటాయా? పోన్లే ముందు ఏదోరకంగా స్నానం చేయ్యనివ్వు" అంటూనే చలపతి బాత్ రూం లో కెళ్ళాడు.
మంగమ్మకు ఒక్క మాటా అర్ధం కాలేదు. ఆవిడ సన్నగా నిటూర్చి సర్వర్ తో టీఫినూ, కాఫీ తీసుకురంమ్మంది. వాడోసారి మంగమ్మ కేసీ, కొట్టాగా అక్కడ కనిపించిన బెడ్డింగ్ కేసీ చూసి వెళ్ళిపోయాడు...
"నేనేమో ననుకున్నాను గానీ, గుంటూర్లోకూడా ఈ మద్య కాఫీ చాలా బాగా చేస్తున్నారే!" అన్నాడు చలపతి కాఫీ చప్పరిస్తూ.
మంగమ్మ పలకలేదు.
"మీ సమాజం ఎత్తేసరటగా?" అన్నాడు చలపతి.
"ఔ" నన్నట్టుగా తలాడించింది మంగమ్మ.
"అప్పుడు పత్రికల్లో మీ సమాజంగురించి చదవడం తప్ప నాకేసంగతీ తెలీదు. అసలు తెలుసుకోనేఁత తీరుబాటుకూడా లేదనుకో.... ఆ రోజుల్లో ఎంతబాగా నడిచేది సమాజం? అవును గానీ మంగమ్మా! అసలు యెందుకు ఎత్తేశారో ఏమిటో చెప్పావు గాదె!" అన్నాడు చలపతి, సుతారంగా సిగరెట్ అంటిస్తూ.
"పెద్ద కారణాలేమీ లేవనుకొండి, రామచంద్రంగారూ, మాధవరావుగారూ వేరే పన్లు చూసుకొంటామన్నారు. అసలు కదా నాయకులే వారాయే. అయిద్దారూ తొలగడంతో సమాజం మూలపడి పోయింది" అన్నది మంగమ్మ.
"నా సంగతి ఇప్పుడప్పుడే అడక్కు. చెప్పవలసింది చాలావుంది ఒక్కముక్కలో చెప్పాలంటే సినిమాల్లో వేషాలేస్తున్నాను. రెండు మూడు స్పీకర్లు చేతులో ఉన్నాయి.రెండూ మంచివేషాలే! ఇవి రిలీజయితేనేగాని, నా జాతకం తిరగదు, అంతదాకా ఊరికే ఉండడమెందుకని, నేనే సొంతగా సినిమా తిద్దాంమనుకొంటున్నాను. పాత స్టార్సుతో తీసే ఉద్దేశం నాకులేదు. వాళ్ళు కాలషిట్సూ యివ్వరు. డబ్బుకూ ఆగరు. వేలకరువేలు వాళ్ళమీద ఖర్చుచేసే డబ్బు నాదగ్గర లేదు. అంతా రెండు మూడు లక్షల్లో అయిపోవాలి. మరీ కొత్త వాళ్ళను తీసుకురావడం నావల్లకాదు. పాతవాళ్ళతో భాధలు పడలేం. అంచేత బాగా నటనానుభావం ఉన్నవాళ్ళను పెట్టుకొంటే పని సులభంగా తేలిపోతుందనుకొన్నాను, బండెక్కి నీదగ్గర కోచ్చాను" అన్నాడు చలపతి.
హాఠాత్తుగా మగమ్మకో సందేహం కలిగింది. తానీ హొటల్లో ఉంటున్నట్టు చలపతికి ఎవరు చెప్పారు? ఆమాటే అడిగింది. చలపతి నవ్వాడు.
"మీ సమాజం ఆఫీసుకు వెళ్ళాను. రెండురోజులక్రిందటే ఖాళీ చేసినట్టు చెప్పారు. "మంగమ్మ ఎక్కడుండేదీ తెలుసా?" అన్నాను. ఎవడో రిక్షావాడు నిన్ను రాజమణి ఇంటిదగ్గర దించాట్టగా - వాడు చెప్పాడు. రాత్రి రాజమణి ఇంటికెళ్ళి వాకబు చేశాను. నువ్వూ హొటల్లో ఉంటున్నట్టు చెప్పారు వాళ్ళు. అన్నాడు చలపతి.
మంగమ్మ మనసిప్పుడు శూన్యంగా ఉంది. అందులో వొక్క ఆలోచనాలేదు.
నేనయినా నీకు పెద్ద పెద్ద ఆశలేమీ చూపించడంలేదు మంగమ్మా! నేను బాగుపడదామని, ఓ పెద్ద ప్రయత్నం ప్రారంభించాను. అయితే, ఇది కేవలం నా వోక్కడివల్లనేకాదు. పదిమంది సహాకారమూ కావాలి. ముఖ్యంగా నీలాంటివారు గట్టిగా పూనుకోవాలి. నాకు లాభిస్తే, అందులో నీకు భాగం ఉండకుండాపోదు నష్టపోతే, నువ్వేమీ చెల్లించనవసరంలేదు. పిక్చారయిందాకా, అన్ని ఖర్చులూ నేనే పెట్టుకోటాను. నెలకు మూడొందలో, నాలుగొందలో ఇచ్చుకుంటాను. నా పిక్చర్ లో పని చేస్తూన్నావుగదాని- ఇంకో దాంట్లో ఛాన్స్, వొస్తే మానుకోవసరం లేదు. అసలు నేనే - పది కంపెనీలకు నిన్ను పరిచయం చేస్తాను. ఇప్పుడు మద్రాసు ప్రోడ్యూసర్లు కొత్తముఖాలకోసం వాచీపోతున్నారు. పాతవాళ్ళతో చిత్ర హింసలన్నా పడతారుగానీ, కొత్తవాళ్ళకోసం ప్రయత్నం చెయ్యరు - నీలాంటి వాళ్ళు - పైగా బోలెడంత నాటకాల అనుభవం ఉన్నవాళ్ళు. కనపడితే ఎత్తుకు పోతారనుకో" అన్నాడు చలపతి.
"ఎక్కడికి, ఎందుకూ?" అన్నది మంగమ్మ పగలబడి నవ్వుతూ, చలపతి కూడా నవ్వాడు.
"ఇక్కడ నీ కేమన్నా కమిట్ మెంట్స్ ఉన్నాయా?" అన్నాడు చలపతి
మంగమ్మ పెదవి విరిచింది.
"ఈ పోజులో రెండుక్లోజప్ లిస్తే జనం విరగపడి చస్తారనుకో మంగమ్మా! నీది బ్రంహ్మండమైన ఫోటో జేనిక్ ఫేస్. రకరకాల భావాలను ఈజీగా ఎక్స్ ప్రెస్ చెయ్యగలవు. నీకు గొప్ప ప్యూచరుంది. నువ్వు సినిమాల్లో రాణించక పోవడమంటూ జరగదు. ఖర్మకాలి అటువంటిదే జరిగితే, అది సినిమా ఇండస్ట్రి కాదన్నమాట. దాన్నికట్టగట్టి బంగాళాఖాతంలో పారేయ్యే చ్చు" అన్నాడు చలపతి.
"ఇన్న్ల్తిటికి నన్నేం చేయ్యమంటారో మీరు చెప్పనే లేదు."
చలపతి చితికేవేసి సిగరెట్ నుసిరాల్పుతూ. కాళ్ళు సుతారంగా ఊపాడు, ఆ నోట విందామనేనా? నీకయినా ఇక్కడ జంఝాటం లేదనిమీకెలా తెలుసు?" అన్నది మంగమ్మ.
"పెళ్లగని చేసుకున్నావా?" అన్నాడు చలపతి ఉలిక్కిపడి అతని ముఖం అప్పుడే రంగు మారిపోయింది.
"పెళ్ళయినవాళ్ళు సినిమాకు పనికిరారా?" అన్నది మంగమ్మ.
"పనికిరారని ఎక్కడాలేదు, అప్పుడున్న చాలామందికి పెళ్ళిళ్ళయ్యాయి. వాళ్ళందరూ సినిమాల్లోపని చేస్తూనే ఉన్నారు. అయితే వాళ్ళకు వోర్పుకావాలి వోర్పు. ఇంతకాలం నాటకాల్లో ఉన్న మనిషిని
చేసుకున్నాడంటే ఆయనగారికి చాలా వోర్పు ఉండి ఉండాలి మరి! ఇన్నిటికీ ఆయనేడి?"
చలపతి. తనన్నమాటను నమ్మే ఇదంతా అంటున్నాడో, అభినయమో మంగమ్మకు అర్ధం కాలేదు.
"వెదికి పెట్టండి మీరే!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS