చలపతి బల్లమీద గుద్ది పకపకా నవ్వాడు.
"చంపేశావ్ మంగమ్మా! నిజంగా నువ్వు పెళ్ళాడినావేమో ననుకోన్నాను. అప్పుడు నాభాధాలు రెట్టింపయ్యేవి. నిన్నోప్పించడం వొకవంతు, నీ మొగుణ్ని ఒప్పించడం మరోవంతు. కవిత్వం బాషలో చప్పాలంటే నువ్వొక స్వేచ్చా విహంగమవు" అన్నాడు చలపతి. "మరి ఇవ్వాళ బయల్దేరుదామా?"
"నన్నింకా ఆలోచించుకో, నేను సాయంత్రం వస్తాను. అప్పటికి ఏ సంగతీ నాకుచెప్పు.నన్నడిగితే ఈ ఛాన్స్ వోదులుకోవడం మంచిది కాదంటాను. నువ్వయినా, మళ్ళా ఏదోవో డ్రామాకంపెనీలో చేరవలసిందే గదా!డ్రామాలకన్నా సినిమాలు ఎన్నోరెట్లు మంచివి. సినిమా ఇచ్చినంత డబ్బు నాటకం నీ కేనాడూ ఇవ్వలేదు. డబ్బోక్కటే కాదు, సినిమానల్ల దొరికే కీర్తిలో, నావాట కింద ఇచ్చేదెంత భాగం? నీకెప్పుడు ఇష్టం లేకపోతే అప్పుడే రావచ్చు. నువ్వు నాటకాలు వెయ్యడానికయినా, మద్రాసులో ఉన్న అవకాశాలు ఇక్కాడేవీ? ఇవన్నీ ఆలోచించుకోని ఉండు, నేను మళ్ళా వస్తాను" అని చలపతి లేచాడు.
"నీకు డబ్బేమన్నా కావాలా?" అన్నాడు పోతున్న వాడల్లా వెనక్కు తిరిగి.
"కావాలంటే మాత్రం మీరిస్తారా?"
"ఇస్తాను...... ఇంద....ఈ నాలుగొందలూ ఉంచుకో" అంటూ నాలుగువందరూపాయల నోట్లు తీసి మంగమ్మ మీదకి విసిరేశాడు చలపతి. అబోత్తిలో అటువంటి నోట్లు ఇంకా చాలా ఉన్నాయి.
"డబ్బుతో నన్ను కట్టేస్తున్నది" అంటూ చలపతి వెళ్ళిపోయాడు. మంగమ్మ ఆనోట్లకేసి చూచింది మడిచి నిశ్సబ్దంగా చేసంచిలో దాచుకొంది. ఆవిడ మనసులో రకరకాల ఊహాలు తలెత్తాయి. రంగు రంగుల బొమ్మలు కళ్ళముందు మెదిలి అంతలో మసక మసకలో కలిసి పోతున్నాయి. ఆ ఊహాల కొకరూపం లేదు. ఆ బోమ్మలకు స్పష్టతా లేదు. మంగమ్మ కావాలనుకోన్నావీ, అవసరం లేదనుకోన్నవీ కూడా, ఆ బొమ్మల వరసలలో ఉన్నాయి.
"ఇప్పడేమిటి చెయ్యడం?" ఆవిడకు పాలుపోలేదు. గదికి తాళంవేసి రాజమణి యింటికి బయలుదేరింది. రాత్రిళ్ళు రంగ రంగ వైభవంగా ఉండే ఆ ఇల్లు యీ వెళ్ళప్పుడు, నిర్జీవంగా నిశబ్దంగా ఉండి. తలుపులు తీసు వున్నాయిగానీ, హాల్లో ఎవ్వరూ లేరు.మంగమ్మ, ఓనిమషం అలానే ఉండి పోయింది. ఆ నిశబ్దాన్ని తోలుచుకుంటూ సన్నవి మూలుగు ఎక్కడ నుండో వినిపిస్తోంది.
"పాపం!" అనికొంది మంగమ్మ.
ఆవిడ నాలుగడుగల వేసింది. ప్రక్కనే వున్న గదుల్లో, ఆదమరచి నిద్రపోతున్న "అమ్మాయిలు" కనుపించారు.
వాళ్ళను చూస్తుంటే మంగమ్మకు చ జ్ఞాపకం వచ్చాయి.గుడ్లగూబలు పగలంతా నిద్రపోయి, రాత్రిళ్ళు సంచారం బయలు దేరుతాయట. వీరూ అంతే!
"ఎవరూ వచ్చింది?"
మంగమ్మ ఆలోచనల్లోంచిబయటికొచ్చింది. అది రాజమణి గొం"నేను రాజ్యం!"
ఓ క్షణం నిశబ్దం తర్వాత "మంగమ్మా! రావే!" అన్నది రాజమణి.
మంగమ్మ గదిలోకి వెళ్లేసరికి, రాజమణి నడిమంచం మీగ కూచుని వంటినిండా శాలువా కప్పుకొని వుంది. బల్లమీద సగం తిన్న బత్తాయి కాయమీద, ఒకటి రెండు ఈగలు వాలుతున్నాయి. గ్లాసు అడుగున గడ్డకట్టిన మందు, ఘాటిగా వాసనవేస్తోంది.
"ఉదయం నుండి నీకోసం చూస్తున్నాను. ఇంతవరకూ భోజనం చెయ్యలేదు. మరీ కడుపులో మండినట్లుగా ఉంటేనూ, ఇంతకుముందే కాస్త బట్టాయిరసం తాగాను, ఈ మందులు తాగలేక నా ప్రాణాలు పోతున్నాయే మంగమ్మా! ఇక్కడేక్కడి డబ్బూ మందుల కోట్లవాళ్ళ బొందమీద పోస్తున్నాను" అన్నది రాజమణి.
మంగమ్మ నిశబ్దంగా కూచుంది.
"ఏవే వింటున్నావా?" అన్నది రాజమణి.
"అఁ "
"నిన్నేనేవరో చలపతిట; నువ్విక్కడున్నావా, అంటూ వచ్చాడు. ఎందుకన్నాను. ఎందుకో చెప్పలేదు. కానీ చాలా అవసరం పనిపడిందన్నాడు. ముందుగా నీ ఎడ్రస్ చెప్పడం మానేద్దామనుకున్నాను.ఎక్కడికొచ్చి నీ ప్రాణాలు తోడిస్తాడిమోనని నాభయం! జిడ్డులాగ పట్టుకొని వదిలాడుకాదు. సరే ఏమయితే అదే అవుతుందని చెప్పేశాను. నువ్వయినా అంత తెలివితక్కువ దానిని కాదుగదా! వచ్చాడా వాడు?" అన్నది రాజమణి.
"అఁ "
రాజమణి మాట్లాడలేదు.కాస్సేపున్నాక, సన్నగా నవ్వింది.
"ఏమిటే?" అన్నది మంగమ్మ.
"ఏం మనుషులమే మనం! వోద్దోయ్యాబూ అంటున్నా ఈ మగాళ్ళు వినిపించుకోరు. ముఖాన పూసినా కుక్కలకన్నా హీనంగా వెంటపడుతుంటారు. రాత్రిమట్టుకు రాత్రి ఏం జరిగిందో తెలుసా?" అన్నది రాజమణి నీరసంగా నవ్వుతూ. "నువ్వు వెళ్ళేటప్పుడు. ఉమ్గారాలైడొకడు హాల్లో ఉన్నాడు చూడు, వాణ్ని నువ్వు రాచుకోతూ కూడా పోయ్యావేమో, ఆపిచ్చితండ్రి విరహంలో పడిపోయాడు.ఇక్కడున్నవాళ్ళెవ్వరూ పనికిరారుట, వందీద వందయినా పారేస్తానన్నాడు. నిన్ను పిలిపించమన్నాడు. అది రాద్యయా బాబూ అంటే వినిపించుకోడు.
ఆఖరికి, ఆగాడికోడుకును హడలగొట్టేసి పంపించాను. నీ ఆరోగ్యం బావోలేదన్నాను."వంటిమీద పుళ్ళు కనిపించలేదా"అన్నాను పోయి పోయి నిప్పులకుంపట్లో దూకుతావుటాయ్యా? అన్నాను. అవరహల తండ్రికి పూనకం తగ్గిపోయింది. వాడట్లా వెళ్లాడోలేదో, ఆ చలపతిగాడోచ్చాడు. నా గుండెల్లో గుండెల్లేవు చెప్పోద్దూ,ఆశుండాల్గాడే, వీణ్ని పంపించాడేమో ననిపించింది. ఎంత మెలి పెట్టినా అసలు సంగతి చెప్పడే! రాత్రి..... ఎమన్నా గోలజరిగిందా యేమే!"
"లే"దన్నట్టుగా తల తిప్పింది మంగమ్మ.
"రక్షించావు పో,ఇప్పటిదాకా,నా మనస్సు మనస్సులో లేదనుకో..మంగమ్మా!" అయ్యో భగవంతుడా ఈ ఉప్పలాయం వచ్చి పాడిందేమిట్రా?" అని ప్రాణం ఉడ్డుకుడిచి పోయిందనుకో,.... రాత్రంతా సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు. దానికితోడు ఉదయమనగా వస్తానన్న దానివి ఇంతవరకూ రాకపోతివి. నేనూ- రాలేను, ఎవరన్నా పంపుదామా - ఎవర్ని పంపించేది చెప్పు. అప్పటికీ వాసంతి, నే వెళ్ళి రానా? అన్నది. నేనే వద్దన్నాను సరేలే పద, ముందు భోజనం చేద్దాం" అన్నది రాజమణి.
అప్పుడే వాసంతి కూడా తూలుకోంటూ గదిలో కొచ్చింది.
"నీ పేరు వసంతా? వాసంతీయా" అన్నది మంగమ్మ
ఆ పిల్ల గమ్మత్తుగా నవ్వింది.
"అలాఉందే?" అన్నది మంగమ్మ, రాజమణికేసి తిరిగి.
"ఎవడో గన్నాయ్ నిన్న క్లబ్బులో బాగా గెలిచాట్ట, రెండు సీసాలు పట్టుకొచ్చాడు.గుప్పెడు నోట్లు దానిమీద చల్లిపారేసాడు ఈ పిచ్చి ముండకు 'ముందు' వాడడం చాతకాదు వద్దన్నా వినిపించుకోకుండా దానినోట గుమ్మరించాడు. వుసి నంత వుసినా, అంతో యింతో లోపలికి జారిందేమో మరి ! ఇట్లా తయారయింది..... ఏమే ! కాస్త నేమ్మదిగా ఉందా?" అన్నది రాజమణి.
వాసంతి 'ఉన్న'దన్నట్టు తలాడించింది.
"అయితే మా ఇద్దరికీ అన్నంపెట్టు..... మంగమ్మా. నువ్వో స్తావని కారణం తెప్పించాను. కోడిగుడ్లకూర ఉంది. బిరియానీ చేయించాను. చాలా ఇంకేమన్నా కావాలా?"
"నేను మాంసము తినను" అన్నది మంగమ్మ.
"అదేమిటే నీ బోందబెట్ట.ఈపాడు అలవాట్లేప్పటిన్నించి? మాంసము లేకపోతే, ఆ తిండి తిటేనేం, గడ్డితింటేనేం"అన్నది రాజమణి.
"ఇప్పుడెం! మానేసి చాలారోజులయింది. మానాటకం కంపెనీలో వాళ్ళెవ్వరూ మాంసము తినరు. తినకూడగని వో నియమముంది నానేశాను " అన్నది మంగమ్మ.
"మళ్ళీ ఈ పూటనించి ప్రారంభించరాదా యేం! మనం చేసే ఛాండాలప్పనులన్నీ పొట్టకోసమేనాయె౧! ఆ పొట్టను నాయగట్టుకోని మనం సంపాదించే దేమిటే నీతలకాయ్!..... పడవే వాసంతి! దానిక్కూడా కార్ణం పడేయ్" అంటూనే రాజమణి. ఆ ముక్కలన్నీ తనే తీసుకొంది.
మంగమ్మ ప్రాణం తెరపినపడినట్లుయింది ఇంతచారు పోసుకొని రెండుముద్దలు నంజింది. అప్పుడే చలపతి వచ్చిన విషయంకూడా రాజమణి చేవినేసింది.
"నువ్వే మన్నావే?" అన్నది రాజమణి.
"ఏమనమంటావ్?" అన్నది మంగమ్మ.
"ఇంకేమాటా వాడికి చెప్పలేదన్న మాటేనా?"
మంగమ్మ తలూపింది.
"నిక్షేపంగా వోప్పేసుకో" అన్నది రాజమణి.
"నేననే దేమిటంటే రాజ్యం"-అని మంగమ్మ ఏదో చెప్పబోయింది.
"నువ్వేమీ అనక్కర్లేదు. అన్నా నేను వినను ఈ దిక్కుమాలిన నాటకాల కంపెనీల్ని నమ్ముకొని ఎంతకాలం ఉంటావే? ఈ మాత్రం జీతం డబ్బులు నీకాసినిమాల్లో గిట్టనప్పుడు చూసుకొందాం. సరేనా?"
"నువ్వన్నది రైతే ననుకోవే రాజ్యం. కానీ, మద్యలో వీడు ముంచితే నాగాతెమిటని? అక్క మనకు అమ్మ నాన్నా - ఎవరున్నారని? పుసపసా పోయిందోయ్. వచ్చిందోయ్ అనిపించు కోవటం నష్టం లేదు రాజ్యం. వాడేమో, కళ్ళు తిరిగిపోయ్ కబుర్లు చెబుతున్నాడు. నాకేమీ తోచక నీ దగ్గరకొచ్చాను. నువ్వేం చెయ్యమంటే అదే చేస్తాను" అన్నది మంగమ్మ.
"నా ఉద్దేశమేదో ముందుగానే చెప్పానమ్మాయ్ ! నానికిక వాడెవడో ముంచితే గతేమిటంటావ్, అదేపని ఇక్కడ జరుగుతే నువ్వేం చేస్తావని నేనడుగుతున్నాను. మద్రాసుకూ,మహాయితే రెండొందలయాబై వేసుకో, పదిరూపాయలు నీవి కాదనుకుంటే ఇక్కడ కొచ్చి పడతావ్! భగవంతుడిచ్చిన ఆయువు సరిగ్గా వుంటే,నువ్విక్కడికే రావచ్చు. నాకే అటువంటి ఛాన్స్ వస్తే, కుండా,చట్టీ సర్దుకొని ఎప్పుడో పీఠం ఎత్తేసేదాన్నే" అన్నది రాజమణి.
మంగమ్మ కంచంలో చెయ్యికడుక్కోంది.
"ఇదేమ తిండే నీతలకాయ్, మజ్జిగాచుక్కన్నా వేసుకోవేం?" అన్నది రాజమణి.
"నా కసలు ఆకలిగాలేదు." అన్నది మంగమ్మ పమిట చెంగుతో కుడిచెయ్యి తుడుచుకుంటూ.
"సినిమా ఛాన్స్ వొచ్చేసరికి ఆకలికూడా చచ్చిందన్నమాట" అన్నది రాజమణి నవ్వుతూ.
వాసంతి కూడా నవ్వింది.
"ఈ పూట చలపతి మళ్ళా వస్తాడు. అసలీ వేళకు వచ్చాడేమో కూడా, అతని ధోరణిని బట్టి చూస్తే తక్షణం మద్రాసు వెళ్ళాలిసొచ్చె టట్ట్లుంది. నాకేమో గుండెలు పింజెం పింజెం మంటున్నాయి. అక్కడంతా అరవ మేళమట. ఎట్లా ఉంటుందో ఏం పాడో! నువ్వేమో వెళ్ళు వెళ్ళమని తరుముతుంటివి అన్నది మంగమ్మ.
"అరవ మేళమయినా, మనుషులందరూ వొక్కటేనే పిచ్చిదానా! అక్కడ మాత్రం మనలాంటి వాళ్ళుండరా? సినిమా అంటేనే డబ్బు. డబ్బుంటేనే ప్రపంచం. మనమీ గొడవలన్నీ ఎందుకు పడుతున్నాం? డబ్బుకోసం - మరి నువ్వేదో నీతులు చేబుత్తున్నావెం నాతో?" అన్నది రాజమణి.
"మిమ్మల్నిందర్నీ వొదిలి వెళ్ళాలంటే -" అని నసిగింది మంరాజమణి, కిందిపెదవి బిగబెట్టి, మంగమ్మను అనుమానంగా చూసింది.
"ఇన్నేళ్ళాపాటు మమ్మల్నోదిలి నాటకాల్లో ఉండగా లేనిది ఇప్పుడు మద్రాసు పొవడానికేం? మేమయినా నిన్నూ పొమ్మంటున్నాంగానీ, పట్టుకొని వెళ్ళాడటం లేదుగా! మేముంది నిన్నుద్దరిస్తున్న దేమన్నా ఉంటే, అదో దోవ, అదేమీ లేదాయే. మరి నీ గంజాట నెందుకో నాకు తెలియడంలేదు" అన్నది రాజమణి.
మంగమ్మ మాట్లాడలేదు.
"ఈ పూటే మాట్లాడలేదు?"
"చలపతి గారు తొందర పెడుతున్నారు."
"మంచిది క్షేమనవేళ్ళి లాభాన తిరిగిరావే! ఎప్పుడన్నా వో ఉత్తరంముక్క రాస్తుండు. వెళ్ళగానే నీ అడ్రస్ రాయి ముందు. అన్నీ సరిగ్గా ఉంటే సరేసరి. లేదో - నాకోకార్డు రాసిపడేయ్. అంతో ఇంతో పంపుతాను. లేదో - నువ్వు బాగుపడ్డావెననుకో, నేనెప్పుడన్నా వొస్తే ఇన్ని మెతుకులు వెయ్యి చాలు...."
మంగమ్మ, రాజమణిని కౌగిలించుకొంది. రాజమణి స్నేహితురాలి బుగ్గలు సున్నితంగా కొరికి "అబ్బ ఎంత రుచిగా ఉన్నాయే!" అంటూ లొట్టలు వేసింది.
మంగమ్మ బదులు చెప్పడానికి ముందుకు వంగింది కానీ, అప్పటకే రాజమణి పక్కకు వెళ్ళిపోయింది. వాసంతి మాత్రం ఎదురుగా ఉంది.
"ఎవమ్మాయ్! నీ పాత వినడం పడనేలేదు. ఇప్పుడువిన్నా నామనసు కెక్కదు.నేను వెళ్ళగానే ఎటుగూడి జాబు రాస్తాను. నా పరిస్టితి బాగావుంటే నువ్వోచ్చేద్దువుగాని, ఇంద - ఈ వంద రూపాయలూ ఉంచుకో" అంటూ చలపతి ఇచ్చిన నోట్లలో వొకదాన్ని వాసంతి కిచింది.
"నా కొద్దక్కయ్యా!" అన్నది వాసంతి, రాజమణికేసి చూస్తూయ.
"తీసుకోవే! అది ప్రేమతో యిస్తున్నానంటే వోద్దంటావేం! తప్పమ్మా అలా అనకూడదు. "వాసంతి సిగ్గుపడుతూనే ఆ నోట్లు తీసుకుంది.
మంగమ్మ రాజమనినీ, వాసంతినీ మరోసారి కళ్ళనిండా చూసి, బయలుదేరింది. ఆవిడకిప్పుడు శరీరం గాలిలో తెలుతున్నట్లుగా ఉంది.
మద్రాసు చూస్తూనే మంగమ్మ ఆశ్చర్య పోయింది. ముఖ్యంగా అక్కడిభవనాలూ, కారూ , మనుషుల ఫ్యాషన్లూ ఆవిణ్ణి చకితం చేశాయి. "మద్రాసు డబ్బంతా రాళ్ళు, సిమెంటులోనూ, కారులోనూ చేరిపోయింది. "అనుకోన్నదావిడ. ప్రతిదానికేసి కళ్ళింత చేసుకొని మంగమ్మ చూడటాన్ని చలపతి గమనించాడు.
"ఎలా ఉంది మద్రాసు?" అన్నాడు చలపతి, టాక్సీలో గమ్మమీడకి బాగా వోరుగుతూ.
మంగమ్మ కొంచెం పక్కకు జరిగింది.
"ఎలా ఉంది? బాగానే ఉంది" అన్నది పొడిపొడిగా.
"ఈ క్షణం నుంది నువ్విక్కడే ఉండడబోతున్నావు. ఇదే నీ నివాసం. ఇక్కడే నీకు పేరు ప్రతిష్టలు రావాలి. ఇక్కాడే నీవు లక్షలకు లక్షలు సంపాదించాలి. ఈ రోడ్లమీదనే నీవు 'ప్లిమత్' కారుల్లో తిరగబోతున్నావు...." అన్నాడు చలపతి.
మంగమ్మ ఏమీ మాట్లాడలేదు. అద్దంలోంచి ఎదురుగా కనిపిస్తున్న సినిమా బానర్ కేసీ చూస్తోంది. అయిదడుగుల పొడవు, మూడడుగల వెడల్పుఉన్న ఆ పోస్టర్ మీద ఒక ముఖం, సినిమా తార ముఖం నవ్వులు కురిపిస్తూ కనిపిస్తోంది. పది పదిహేనుమంది కుర్రవాళ్ళు ఆ పోస్టారుముందు నిలబడి అదే పనిగా ఆ బొమ్మకేసి చూస్తున్నారు.
"ఆవిడ నళీనీకుమారి" అన్నాడు చలపతి సిగరెట్ వెలిగిస్తూ. మొన్న మొన్నటి వరకూ, చిన్న చిన్న వేషాలు వేస్తుండేది. రెండు మూడు వేషాలను నేనే రికమండ్ చేసి ఇప్పించాను. వాటివల్ల ఆవిడకు నాలుగు డబ్బులు గిడితే గిట్టాయేమోగానీ, గుర్తింపురాలేదు. ఇది కాదనుకొని, ఒక ప్రోడ్యూసరుకు చెప్పి మంచివేషం, దాదాపు హీరోయిన్ లాంటి వేషం యిప్పించాను. ఝామ్మని అందుకొంది. ఇప్పుడావిడరేటు పది పదిహేనువేలు..... వింటున్నావా అన్నాడు చలపతి.
కారు మూల తురుగుతూ సర్రని శబ్దం చేసింది. మంగమ్మమీదకి మరో సారి చలపతి - పూర్తిగా వోరిగిపోయాడు.
చలపతి ఓ సారి మంగమ్మ కేసి రవంత జరిగికూచున్నాడు. కారు వేగం తగ్గింది.
డ్రైవర్ అరవంలో ఏదో అడిగాడు.
కోడంబాకం పోనివ్వు నటేశ పిళ్లెస్ట్రీట్, నెంబర్ 192, అన్నాడు చలపతి.
మంగమ్మ వచ్చే నవ్వును ఆపుకోవడం చలపతి గమనించాడు. "ఏమిటేట" అన్నాడు.
"ఏంలేదు" అన్నట్లుగా మంగమ్మ పెదవి విరిచింది.
"బ్యూటిపుల్ మంగమ్మా! నా దగ్గర కెమెరా లేదుగానీ, ఉంటేనా? ఈ పోజ్ ను శ్నాప్ చేద్దును. ఇలా ఇంత అందం, పెదవి విరిచి, ఏం లేదు, ఉన్నా నీతో చెప్పను. అది చెప్పడానికి వీలేని విషయంకనక నన్ను పదే పదే అడక్కు, అన్న బావాలను వొక్క పెదవు విరుపులో చూపెట్టగలిగిన వాళ్ళెంతమంది ఉన్నారంటావ్! నన్నడిగితే వొక్కరూ లేరంటాను. అంచేతే నీకు ఈ ఇండస్ట్రిలోవల్లమాలిన, కట్టుకుపోయినంత ప్యూచరున్నదని నేను మొత్తుకోవడం" అన్నాడు చలపతి.
మంగమ్మకిధోరణి నమ్మదగిందిగా లేదు. తనేదే మాములుగా -మాములుగా కాదు - చలపతితో మాట్లాడటం ఇష్టంలేకనే పెదవి విరిచింది. అందులో వీడంటున్నన్ని అర్దాలున్నాయనిగానీ, ఉంటాయని గానీ తనకు తెలీదు. మరీ చలపతి తన్నేందుకిలా ఆకాశాన్ని కేత్తుతున్నట్టుట?
"ఇన్నిటికి నా ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పనేలేదు మంగమ్మా" అన్నాడు చలపతి.
మంగమ్మ -సిటీని చూడాలన్న ఆకాంక్షముంజు- ఈ దిక్కుమాలిన చెత్తవాగుడుకు, జవాబు చెప్పాలన్న ఆలోచనేరాలేదు. తనింకా సమాధానం చెబుతానన్న ఆశతో చలపతి చూస్తున్నాడని మంగమ్మ అనుకొంది. చిత్రమేమిటంటే, మంగమ్మకు జ్ఞాపకంరాలేదు.అదే చలపతితో అన్నది.
"వండర్ పుల్! నువ్వు ఆశ్చర్యాన్ని ఎంత అద్బుతంగా ఎక్స్ ప్రెస్ చేస్తావు మంగమ్మా!" అని ఓ పాపునిమిషం అలాగే మింగుతున్న వాడిలాగా చూశాడు చలపతి. ఆ తరువాత తన పెదవిని పళ్ళ మద్య చేర్పాడు. కాళ్ళు సున్నితంగా ఊపుతూ అదే కుమారి గురించి. ఇప్పుడావిడ పదిహేనువేలు తీసుకొంమటుందన్నాను గదూ ?" అన్నాడు.
