పట్టుపరుపులమీద అతడి చుట్టూ నలుగురు యువతులు నిలబడి ఉన్నారు. వారి వంటిమీద అండర్ వేర్ కూడా లేదు. వారి నలుగురి చేతుల్లో షాంపేన్ బాటిల్సున్నాయి.
ఆ నగ్న యువతులతడికి మధువును వడ్డిస్తూ కవ్విస్తున్నారు.
అతడు వారితో ఆటలాడుతున్నాడు.
గదిలో స్టీరియో సంగీతం మ్రోగుతోంది.
సోమేశ్వరరావు రసవత్తర ఘట్టంలో ఉన్నాడు. అతడు మధువునందించే యువతులనందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. వారతడికందీ అందకుండా పోతున్నారు.
చివరికతడో యువతిని చేయిపట్టుకుని బలంగామీదకు లాక్కున్నాడు. ఆమె చేతిలోని షాంపేన్ బాటిలా విసురుకు జారిపోయి కాశ్మీర్ కంబళిపైపడి దొర్లుకుంటూ గోడవారకు వెళ్ళింది.
సోమేశ్వరరావు తన చేతిలోని గాజుసీసాను పక్కన పెట్టి ఆమెను బలంగా హత్తుకున్నాడు.
"షాంపేన్ సీసా తెస్తాను...." అందా యువతి నెమ్మదిగా.
"నా మధువిక్కడుంది-" అంటూ అతడామె పెదవులను తన పెదవులతో స్ప్రుశించాడు.
సరిగ్గా అప్పుడే పట్టుపరుపుమీద ఫోనొకటి మ్రోగింది.
ఓ యువతీ రిసీవరెత్తి-"హలో!" అంది.
"అర్జంట్ కాల్...." అందవతలి గొంతు.
"ఎవరు?" అన్నాడు సోమేశ్వరరావు విసుగ్గా.
"సార్-అర్జంటు కాల్ ట...." అందా యువతి.
రెండోచేత్తో రిసీవరందుకున్నాడు సోమేశ్వరరావు. మరో చేయి ఆ యువతినింకా బలంగా హత్తుకునే ఉంది.
"ఎవరు?" అన్నాడు సోమేశ్వరరావు.
"నేను-నందినిని మామయ్యా-" అందవతలి గొంతు.
"నందిని అంటే?'
"మీ కోడల్ని మామయ్యా-"
సోమేశ్వరరావు తనంతవరకూ బలంగా హత్తుకున్న యువతిని చటుక్కున వదిలిపెట్టాడు. అప్రయత్నంగానే లేచికూర్చుని-"అర్జంట్ కాల్ చేసేటంత అవసరమే మొచ్చింది నీకు?" అన్నాడు.
"ఫోన్ లో చెప్పనా? ఇంటికొస్తారా?" అంది నందిని.
"మీ అత్తయ్యింట్లోనే ఉందా?" అన్నాడు సోమేశ్వరరావు.
"ఉంది అత్తయ్యే నాకీనంబరు చెప్పింది-"
"అత్తయ్యకు నువ్వు కబురు చెప్పావా?"
"లేదు ముందుగా మీకే చెప్పాలనుకుంటున్నాను."
అర్జంటు కాలంటే విషయం చాలా ముఖ్యమైనదే అవుతుంది. అందులోనూ అత్తగారు కోడలికీ నంబరిచ్సిందంటే విషయమామెకూ యెంతో కొంత తెలిసుండాలి.
"నేను వస్తున్నాను..." అంటూ సోమేశ్వరరావు లేచి నిలబడ్డాడు.
ఓ యువతి అతన్నించి రిసీవరందుకుని క్రెడిల్ చేసింది.
మరో యిద్దరు యువతులతడికి బట్టలు తొడిగారు.
"మళ్ళీ వస్తాను..." అంటూ అతడా గదిలోంచి బైటపడ్డాడు.
అతడి వెనుకే ఆ యువతులు తలుపులు మూసుకున్నారు.
సోమేశ్వరరావు అక్కన్నించి తిన్నగా ఓ గదిలోకి వెళ్ళాడు.
అదొక చిన్న గది నీటుగా అలంకరింపబడి వుంది.
గది మధ్యన నాలుగు మెత్తలున్న కుర్చీలున్నాయి. సోమేశ్వరర్రావలాంటి కుర్చీల్లో ఒకదానిలో కూర్చున్నాడు.
కొద్దిక్షణాల్లో నందిని ఆ గదిలోనికి ప్రవేశించింది.
సోమేశ్వర్రావామెవైపు చూశాడు.
నందిని మామగారికి నమస్కారం పెట్టింది.
"అలా కూర్చో-" అన్నాడు సోమేశ్వరరావు.
"నిలబడే మాట్లాడతాను-" అంది నందిని.
"అసలేం జరిగింది?"
"మొత్తమంతా చెప్పేస్తాను మామయ్యా! ఆ తర్వాత మీరు నన్ను చచ్చిపొమ్మంటే చచ్చిపోతాను...." అంది నందిని.
"చెప్పు...." అన్నాడు సోమేశ్వరరావు.
నందిని చెప్పడం ప్ర్రారంభించింది.
ఆమె చెబుతూంటే సోమేశ్వరరా వాశ్చర్యంగా విన్నాడు.
నందిని చెప్పడం పూర్తయింది.
"నువ్వు నిజమే చెబుతున్నావు కదూ!" అన్నాడు సోమేశ్వరరావు.
"నేను మీకబద్ధం చెప్పలేదు-" అంది నందిని.
"మావాడు నిన్ను క్రూరంగా హింసించాడంటే నమ్మలేను, సాక్ష్యాలున్నాయా?" అన్నాడు సోమేశ్వరరావు.
"సాక్ష్యాలున్నాయి. కానీ అవి చూపించాలంటే సిగ్గు విడిచిపెట్టాలి...."
"నేను నీకు మామగార్ని. నా దగ్గర సిగ్గు వదలి పెట్టడం తప్పుకాదు...." అన్నాడు సోమేశ్వరరావు గంభీరంగా.
నందిని సోమేశ్వరరావు కళ్ళలోకే సూటిగా చూసింది. ఓక్షణం తటపటాయించినా-చివరకామె తన శరీరం మీద వివిధ ప్రాంతాల-కాలిన మచ్చల్ని-ఇరవై రెండింటిని చూపించింది.
సోమేశ్వరరావు కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
"నందినీ-నువ్వు నా కొడుకు భార్యవు. అంటే నాకు కూతురితో సమానం. కానీ నా ప్రవర్తన అంత మంచిదికాదు. కొన్ని సంవత్సరాలుగా నా భార్య నాకు సంసార సుఖాన్నివ్వలేకపోతోంది. నన్ను విచ్చలవిడిగా ప్రవర్తించమని తనే అనుమతించింది. నేనా అవకాశాన్ని యధేచ్చగా వినియోగించుకుంటున్నాను. ఆడదాని శరీరం నాకాటవస్తువు. ఆడది నా విలాసాలకోసం ఆడే బొమ్మ. ఇలాంటి భావాలు కలిగిన నాకే నీ శరీరాన్ని చూస్తూంటే గుండెనీరై కనులనుండి ధారగా ప్రవహిస్తానంటోంది. జరిగిందానికి నువ్వు భయపడకు. నా కన్న కొడుకు నీ కంటే ఎక్కువకాదు. నన్ను నమ్మి నీ బాధలు చెప్పుకున్న నువ్విప్పుడు నా కోడలివి కాదు. కూతురివి, నా కొడుకు జీవితాన్ని బాగుచేయాలనుకుని నీ బ్రతుకు బండలు చేశాను. ఇప్పుడు ణ కొడుకు చచ్చినా నాకు బాధలేదు. నీ బ్రతుకు బండలు కాకుండా చూస్తాను. కానీ...." అని ఆగాడతడు.
నందిని అనుమానంగా అతడివంక చూసింది.
"చక్రధాంకీ నీకూ యేమైనా సంబంధముందా?" సూటిగా అడిగాడు సోమేశ్వర్రావు.
"మీ అబ్బాయి పెట్టే బాధలు భరించలేక చక్రధారితో వెళ్ళిపోవాలని అనుకున్నాను. కానీ ఇంతవరకూ మా ఇరువురికీ ఎలాంటి సంబంధమూలేదు-" అంది నందిని.
"నీ మాటలు నేను నమ్ముతాను. ఇంతవరకూ జరిగిన దంతా మరిచిపో-ఇకముందు జరిగేదంతా నీ మంచి కోసమేనని నేను హామీ యిస్తున్నాను-వెళ్ళు-" అన్నాడు సోమేశ్వరరావు.
నందిని చటుక్కున వంగి ఆయన పాదాలకు నమస్కరించింది.
5
చక్రధారి, చంచల్రావు, డాక్టర్ గంగాధరం ఒక పక్కగా కూర్చుని ఉన్నారు.
వారికెదురుగా ఉంది గోవర్ధన్ శవం!
శవానికావలిపక్క కూర్చున్నాడు సోమేశ్వర్రావు.
అతడి కళ్ళలో తడిలేదు. చూపుల్లో బాధలేదు.
ఊహించని అతడి రాకకు మాత్రం తబ్బిబ్బవుతున్నారు చక్రధారి బృందం.
"ఇది హత్య..." అన్నాడు సోమేశ్వరరావు.
"నిజమే-కానీ ఈ హత్య చేసింది మేము కాదు" అన్నాడు చక్రధారి.
"ఎవరు చేశారు?"
"అవకాశం నందినికే వుంది.." అన్నాడు చక్రధారి.
