Previous Page Next Page 
వసుంధర కధలు -3 పేజి 27


                                      జీ - 87

    అతడు కుర్చీలో కూర్చున్నాడు.
    ఆమె అతడి వంకే భయంగా చూస్తోంది.
    అతడు జేబులోంచి సిగరెట్ తీసి నోట్లో పెట్టుకున్నాడు. తర్వాత లైటర్ తీసి-"ఇలా రా!" అన్నాడు.
    ఆమె అతణ్ణి సమీపించింది.
    "సిగరెట్ వెలిగించు-"అన్నాడతడామెకు లైటరందిస్తూ.
    ఆమె లైటరు వెలిగించింది. సిగరెట్ అంటించింది.
    అతడు గట్టిగా ఓ దమ్ములాగి పొగ వదిలాడు.
    ఆమె భయంగా అతడి వంకే చూస్తోంది.
    అతడామె చేతిలోని లైటరునందుకున్నాడు. ఆమె చేయి వెనక్కి తీసుకోబోతూండగా చటుక్కున పట్టుకున్నాడు.
    "వద్దు-" అందామె భయంగా.
    "కదలకు-" అన్నాడతడు. గొంతులో క్రూరత్వముంది.
    ఆమె కదలలేదు.
    అతడు సిగరెట్ తీసి ఆమె మణికట్టుమీద కాల్చాడు.
    పంటి బిగువున బాధనణచుకుందామె.
    "వెనక్కు తిరుగు-" అన్నాడతడు.
    భయపడుతూనే వెనక్కు తిరిగిందామె.
    పచ్చగా మెరుస్తున్న నున్నటి ఆమె చర్మాన్ని చూస్తున్నాడతడు. రవికకూ చీరకూ మధ్య అతడి దృష్టి తీక్షణంగా ప్రసరించబడింది.
    అతడి చేతిలోని సిగరెట్టింకా ఆరిపోలేదు.
    గగుర్పాటుతో ఆమె శరీరం సన్నగా వణుకుతోంది.
    ఆమెకు తెలుసు-అతడేం చేసినా తను నోరు మెదపకూడదు. గొంతు పెగలనివ్వరాదు.
    అతడు సిగరెట్ ని వీపు దాకా తెచ్చినవాడే ఎందుకో ఆగిపోయాడు.
    ఊహకందని విధంగా ఆమెను బాధించడంలోనే అతడి కానందముంది. సిగరెట్ తో తనామె వీపుమీద కాలుస్తాడని ఆమె అనుకుంటుంది.     కాబట్టి.....అతడు శక్తినంతా క్రోడీకరించి వీపుమీద కుడి పిడికిలితో ఒక్క గుద్దు గుద్దాడు.
    ఆమెకు కళ్ళు బైర్లుకమ్మాయి. అప్రయత్నంగా ముందుకు వెళ్ళి బోర్లాపడిపోయింది.
    సరిగ్గా అక్కడే మంచముండడంవలన ఆమె మంచం మీద పడింది. మెత్తటి పరుపుల సౌఖ్యానుభూతి కూడా ఆమెకు కలగలేదు.
    అతడి దెబ్బ ఆమెను కత్తిపోటులా బాధిస్తోంది.    
    ఈలోగా అతడు లేచి ఆమెను సమీపించి-"వెనక్కు తిరుగు" అన్నాడు.
    ఆమె వెంటనే వెల్లకిలా తిరిగింది.
    "ఎవరు నువ్వు?" అన్నాడతడు.
    "మీ బానిసను-"
    "నేనెవరిని?"
    "నా దేవుడు-"
    "నీ గురించి ఇంకా చెప్పు-...."
    "నేను నీచురాలిని. కులటను. పనికిమాలిన దాన్ని. మీ పాదాలు తాకే అర్హతకూడా లేనిదాన్ని...."
    అతడు తృప్తిగా నవ్వి-"ఇప్పుడు లేచి నిలబడు-" అన్నాడు.
    ఆమె లేచి నిలబడగానే అతడు మంచంమీద కూర్చుని-"అది తీసుకునిరా-" అంటూ గోడవైపు చూపించాడు.
    గోడవైపు చూడకుండానే అదేమిటో ఆమె తెలుసుకుంది.
    అక్కడ గోడకు వ్రేలాడుతోందొక కొరడా!
    ఆ కొరడా దెబ్బకు మందపు జంతు చర్మంకూడా చిట్లుతుంది.
    ఆమె చూడ్డానికెంతో సుకుమారంగా వుంది.
    "ఊఁ త్వరఫా-" అన్నాడతడు.
    ఆమె వెళ్ళి కొరడా తెచ్చి అతఃది కందించింది.
    "మంచినీళ్ళు తీసుకునిరా-" అన్నాడతడు.
    కొరడాతో కొట్టేముందతడు మంచినీళ్ళు తాగుతాడు.
    మంచినీళ్ళు తాగి కొరడా ఎత్తాడంటే- అతడీరోజు గది నేలను రక్తంతో కడగనున్నాడని అర్ధం.
    ఆమె మాట్లాడకుండా లోపలకు వెళ్ళింది.
    అదొక చిన్న గది, గదిలో పూజామందిరముంది.
    ఆమె మందిరం ముందు నిలబడి రెండు చేతులూ జోడించి-"భగవంతుడా-నేను తప్పుచేస్తున్నానేమో తెలియదు. అందుకే నీ ఆశీర్వాదాన్ని కోరుతున్నాను. నేను చేసేదానిలో తప్పుంటే అదంతా నీదే తప్ప నాది కాదు-" అంది.
    పూజామందిరంలో ప్రముఖులైన దేవుళ్ళ విగ్రహాలు చాలా ఉన్నాయి. ఆ విగ్రహాల ముందో చిన్న సీసా ఉంది.
    ఆమె వంగి ఆ సీసా అందుకుంది.
    అప్ప్డుడామె మళ్ళీ వణికింది.
    ఆ సీసాలో ఉన్నది విషమని ఆమెకు తెలుసు.
    "భగవంతుడా! రెండురోజుఅక్రితం ఇది నీముందుంచాను. నేను చేసే పని తప్పని నువ్వనుకుంటే ఈ విషాన్ని విరిచి మామూలుగా తయారుచేయమన్నాను. విషం విషంలా పనిచేయకపోతే తప్పు నాది. లేకుంటే తప్పు నీది-" అని మరోసారి మనసులో అనుకుని పక్కనే ఉన్న బిందెలోంచి ఓ గ్లాసు నీళ్ళు ముంచింది. సీసాలోని విషం సగానికి సగం ఆ గ్లాసులో పంపింది.
    "త్వరగా రా-" కర్కశమైన అతడి గొంతు పడక గదినుంచి అక్కడిదాకా మార్మోగింది.
    "వస్తున్నా!" బదులిచ్చిందామె.
    విషం సీసాను తిరిగి పూజామందిరంలో ఉంచి ఆమె వెంటనే చకచక పడక గదిలోకి వెళ్ళింది.
    "ఏమిటంత ఆలస్యం?" అన్నాడతడు.
    అతడి చేతిలో కొరడాను చూసిందామె. అదామెకు మృత్యుతుల్యం.
    అప్పుడామె తన చేతిలోని గ్లాసు వంక చూసుకుంది.
    అతడికి మృత్యువు....
    "నవ్వుతూ నా దగ్గరకు రా-" అన్నాడతడు.
    ఆమెకు నిజంగానే నవ్వొచ్చింది. చేతిలో గ్లాసుతో అతణ్ణి సమీపించింది.
    అతడు ఎడంచేత్తో ఆమె చేతిలోని గ్లాసందుకున్నాడు.
    కుడిచేతిలో కొరడా అలా ఉండగానే గటగటా నీళ్ళు తాగేశాడు.
    "వెనక్కు వెళ్ళు-" అన్నాడతడు.
    ఆమె వెనక్కు వెడుతూంటే కొరడా చెళ్ళున విసురుతాడతడు.
    అదామెకు తెలుసు.
    ఇప్పుడూ అదే జరుగుతుందా?
    ఆమె అతఃది వంకే చూస్తూ వెనకడుగువేసింది.
    అతడు లేచి నిలబడి కొరడా ఝుళిపించాడు.
    ఆమె అతన్నే చూస్తూ వెనుకడుగు వేస్తోంది.
    అతడు కొరడాను పైకెత్తాడు.
    ఆమె శరీరంలో వణుకు.
    ఇప్పుడేం జరుగుతుంది?
    గదిలో నేలంతా తన రక్తంతో తడిసిపోతుందా?
    విషమతడి నేమీ చేయదా?
    తప్పంతా తనదేనా?
    అతడు వికటంగా నవ్వాడు.
    ఆమె మరో అడుగు వెనక్కు వేసింది.
    అతడు కొరడా విసరబోయి వెనక్కు పడ్డాడు. బ్యాలన్సుకాసుకోలేక పోయాడేమో-వెల్లకిలాపడ్డాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS