Previous Page Next Page 
ఉన్నతశిఖరాలు పేజి 25


    మూడురోజులు నరకయాతన ననుభవించి దారిగానక చివరికి ఈ ప్రయత్నానికి సిద్ధపడింది. నాకో ఉత్తరంరాసి దాసీదానికే యిచ్చింది. అది ఇవ్వాళ పదకొండు గంటలకు చేరింది. టాక్సీ తీసుకుని దుర్గ వాళ్ళింటి కెళ్తే దుర్గకు అప్పటికే ఆస్పత్రికి తీసుకెళ్ళారట.....దుర్గ అదృష్టం బాగుంది. రాత్రి పన్నెండు గంటలకు సుధాకర్ వచ్చాడట భార్యను ఎంతలేపినా లేవలేదు కేకలేసేసరికి అంతా పరుగెట్టుకుంటూ వచ్చారట. అప్పటికీ బల్లమీద వున్న సీసా- దుర్గరాసిన ఉత్తరం కనబడ్డాయి. దీనికి మనమెంతవరకు బాధ్యులం అని నా ఆవేదన!" అన్నది సరళ భారంగా నిట్టూరుస్తూ చెల్లి వంక తదేకంగా చూస్తూ దుర్గను గూర్చిన విచారగాథ వింటున్నవాడల్లా ఈ ప్రశ్నకు చలించిపోయాడు. దీనికిమనం- ఎంతవరకు బాధ్యులం? మీరే. మీరే. అంటూ ఎవరో వ్రేలెత్తి చూపిస్తున్నట్లుగా వుంది. సరళ రమణ గీత, ప్రేమ రేవతి గోపాల్ తాను నరేంద్ర- ఇంతమందికి అతని విషయం తెలిసినా బహిర్గతంచేసి తప్పించలేకపోయారు.  ఎవ్వరు ప్రయత్నించలేదు.......యౌవ్వనంలో అబ్బిన దురలవాట్లు - బలహీనతలు - వివాహానంతరం త్వరగా పోవని - ఆ అలవాట్లను పోగొట్టాలంటే ఆ స్త్రీ బహుముఖ ప్రజ్ఞురాలై అతితెలివిగా ఉండాలని ఆ మూర్ఖులకు చెప్పరా? ప్రేమకు ఆపద వచ్చిందని సంతోషంలో దుర్గ సంగతి మరచాను అనిపించింది;
    సరళ ఆశ్చర్యంతో చూస్తోంది.
    "అన్నయ్యా అయిపోయినదాన్ని గూర్చి విచారిస్తూ కూచుంటే లాభంలేదు..... ఇప్పుడేం చేయాలో ఆలోచించాలి"
    నిరంజన్ కళ్ళు తెరిచాడు.
    "మనమేం చెయ్యగలం?.....వారిద్దర్నీ మనం ఎవరూ కం చెయ్య లేము కద?" ఎప్పటికైనా మనసు మార్చుకుని అతడే భార్యను గౌరవిస్తే?"
    "ఎప్పటికో?"
    సరళ చెంపకు చేయి అన్ని దీర్ఘా లోచనలో మునిగి పోయింది. అంతవరకు దుర్గగతేమిటి?
    "నీ ప్రభావం ఆమెను మార్చగలదు సరళా "ఏమిటి నీసలహా?"
    "దుర్గ హాస్పిటల్ నించి రాగానే తనది అనిపించేది అంతా తీసి కొని పుట్టింటికి వెళ్ళి పొమ్మను...." అన్నాడు నిరంజన్.
    "అన్నయ్యా....ఇదా నీ సలహా..." ఆమె కనుబొమలు ముడిచింది.
    "సాంతం విను సరళా.....తర్వాత ఇక్కడ విమెన్స్ కాలేజీలో నో - గుంటూరులోనో - చదువు పునః ప్ర్రారంభించమని చెప్పు. చదువు ఒక స్థాయి నందుకోటానికి కొన్ని సంవత్సరాలు పడ్తుంది. ఈ లోగా అతనే దారికి రావచ్చు లేదా ఆమెకు జీవం విధానం ఏర్పడవచ్చు."
    సరళకు నిజమే అనిపించింది. నిరంజన్ కేసి కళ్ళు పెద్దవి చేసి చూసింది.

                                26

    రిజల్ట్సు వచ్చాయి. ప్రేమ సుధాకర్ లు సెకండ్ క్లాసులో వచ్చారు. గీత నిరంజన్ లు ఫస్టు క్లాసులు తెచ్చుకున్నారు. గీతకు డిస్టింక్షన్ కూడా లభించింది!
    శ్రీనివాసరావుగారింట్లో పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఆ రోజు అందరి ఆనందం పంచుకోటానికి - సరళ వస్తుందని ఎంతగానో ఆశించారు? కాని ఆమె రాలేదు.
    ఐరావతమ్మ అల్పాహారం అంటూ రకరకాల మిఠాయిలు కారానిండిన పళ్ళేలు చిన్న కోడలితో పంపుతున్నది. లలిత ఆనందంతో హాల్లోకి వస్తూంటే ఆమెదృష్టి గేటువద్ద రిక్షాదిగుతున్న వృద్ధ దంపతుల మీద పడింది.    
    "అమ్మా - నాన్న" అని అప్రయత్నంగా ఆమె పెదవులు వణికాయి ఆమె ఆనందం వేయిరెట్లయింది. ఆమె నరేన్ వద్దకు చేరింది. నరేన్ ఆమెను తీసుకొని వారిద్దరికీ ఎదురేగాడు ఇద్దరూ కలసి గుమ్మంలో అడుగుపెడ్తున్న వారి పాదాలకు వందనాలు చేశారు యువదంపతులను వారు సాదరంగా ఆప్యాయంగా లేవనెత్తారు. వారి రాకతో ఆనందం ద్విగుణీకృతమైంది.    
    పార్టీ ముగిసి న తర్వాత రఘుపతి చిన్న పొట్లాంతీసి భార్య కందించాడు ఆమె ఆ పొట్లాం అందుకుని లలితను దగ్గరగా పిలిచి "నీ కోసం మీనాన్నగారు ఏమి తెచ్చారో చూడమ్మా" అన్నది.
    లలిత దానిలో ఏముందో ఊహించింది. కన్నవారి మమతలు ఎట్లా వుంటాయో ఎవరికి తెలియదు! తాను వారితో మాటమాత్రం చెప్పకుండా పెళ్ళికి ఏర్పాట్లు చేసుకుని హఠాత్తుగా ఇంటినుంచి వచ్చేసింది. ఆ తప్పును మనసారా క్షమించి, తనదికూడా ఒక వివాహంగానే పరిగణించి ఏదో వస్తువు తెచ్చివుంటారు.
    ఆమె నరేన్ వద్దకు చేరి బెరుకుగా చూచింది. "అమ్మా వాళ్ళూ నాకేవో బంగారువస్తువులు తెచ్చారు" అని ఆ చూపులోని సందేశం. "తీసుకోనా? అని అనుజమాత్రం అడిగింది.    
    "ఆశ కంతంలేదా లలితా!" అని నవ్వాడు నరేంద్ర.
    "అట్లా అనకు బాబూ! ఇది ఎంతో గొప్ప ఖరీదు గలవి గాక పోవచ్చు. కాని ఆడపిల్లకు అభిమానంతో ఈ మాత్రం వస్తువు చేయించాలని కన్నవారికి ఉంటుంది..." అని రఘుపతి ముందుకువచ్చాడు.
    నరేంద్ర, మాట్లాడకుండా పొట్లాం అందుకున్నాడు. లలితచెవిలో ఏదో చెప్పి చిరునవ్వునవ్వాడు. ఆ సందేశంవిని లలితముఖంలో వేయి జ్యోతులు వెలిగాయి. పొట్లం గబగబా విప్పింది.    
    లలితా, నరేంద్ర ఇద్దరూ గీతను చేరారు. ఆ పొట్లాంలో వున్న గాజులు గీతకు తొడిగింది లలిత. నెక్లెస్ తీసి గీత మెడలో వేసింది గీత ఎంతో కంగారు పడింది. ఇదేమిటి లలితా అని చెల్లి మందలించింది. లలిత వదిలి పెట్టలేదు. నువ్వు ఫస్టుక్లాస్ లో ప్యాసయినందు కిదీ డిస్టింక్షన్ తెచ్చుకొన్నందుకు ఇదీ" అని చూపింది. గీత ఆ గాజుల వేపు, ఆ నెక్లెస్ వేపూ చూస్తూ వుండిపోయింది.
    "మొత్తానికి గట్టివాడవేనే, నరేంద్ర! ఏమో అను కొన్నాను!" అన్నాడు రఘుపతి
    "నేను గట్టివాడను కనుకనే, మెత్తని స్వభావం గల లలితను చేసుకొన్నాను.
    అందరూ పరవశంతో నవ్వారు.
    
                                  27

    పార్టీకి సరళ రానేలేదు నిరంజన్ అక్కడినుంచే ఒక చీటీ పంపాడు. రమణ ఫ్యూన్ ద్వారా సరళకు తలనొప్పిగా వున్నదని. రమణ రాగానే తను వస్తానని అందులో వుంది. రమణ పార్టీ ముగిసేవేళకు ఎప్పుడో వచ్చి ఫలహారం కాఫీ తీసుకొని. సరళ కొరకు పొట్లాం కట్టింది పట్టుకొని వెళ్ళాడు.
    ఇంటికి వెళ్ళేసరికి రమణకు లోపలమాటలు వినపడ్డాయి. సరళ కాక మరెవ్వరో ఉన్నారు.    
    తలుపు తెరిచిచూస్తే ఇంట్లో వున్నది దుర్గ.
    "ఏమమ్మా యిలా వచ్చావు." అని పలుకరించాడు రమణ. ఆమె ముఖం మ్లానంగా వుంది. మాట్లాడని ఆమె పెదవులు ఏదో విషాద వార్తను స్ఫురింపజేశాయి. రమణ పలుకరింపుకు ఆమె ముఖంలోని విషాదఛాయలు దట్టమైపోయాయి. ఆమె రెండు మోకాళ్ళను చేర్చి వాటి మధ్య తలపెట్టుకుని వంగి నేలకు చూస్తున్నది.
    దూరంగా బల్లదగ్గరున్న ఈ జీ చైర్ లో నిరంజన్ కూచుని వున్నాడు. ఏంజరిగిందోనన్న ఆందోళనతో రమణ మెల్లగా నిరంజన్ ప్రక్కను జేరి ఆత్రంగా నిశ్శబ్దంగా ప్రశ్నించాడు. నిరంజన్ దీర్ఘంగా నిట్టూర్చాడు. "దుర్గ ఆ యింటితో సంబంధం త్రెంచుకొని వచ్చింది"
    రమణకేం అర్ధంకాలేదు. దుర్గను సుధాకర్ ఈ మధ్య అనునయంతో చూస్తున్నాడని తెలిసింది. సరళకు అలాగని ఉత్తరంకూడా రాసింది. ఒకసారి తనకు ఇద్దరు సరదాగా బజారులో తిరుగుతూ కనబడ్డారు. పాస్ అయితే ఉద్యోగంలో చేరతాడనికూడా దుర్గ ఉత్తరంలో రాసింది. ఏమైంది.... అంతా తారుమారైందా? ఈ రాత్రి సమయంలో దుర్గ వచ్చేసిందంటే ఒంటరిగా ఏదో దుస్సంఘటనలో చిక్కుకున్నదని తేట తెల్లమౌతోంది. దుర్గకు దగ్గరగా స్టూలులాక్కుని ప్రేమతో అడిగాడు.
    "ఏమైందమ్మా - అమ్మవాళ్ళకు వ్రాయరా? మీ ఇంటికి వెళ్దామా? నేనూ సరళా ఇద్దరం వచ్చి నిన్నింట్లో దిగబెడ్తాయి వాళ్ళతో చెప్పటానికి నీ ఇబ్బంది మాకు చెప్పవా?"
    దుర్గ రెండుచేతుల్లో ముఖందాచుకుని భోరుమన్నది. ఆమె ఏదో చెప్పబోయి మౌనం వహిస్తోందని తెలుస్తోంది.
    "సరళా ఏదైనా భోజనం తయారుజెయ్యి- భోంచేసిన తర్వాత వివరాలు తెలుసుకుందాము"
    సరల నెమ్మదిగలేచి వెళ్ళింది.
    వేడివేడి కాఫీతెచ్చి దుర్గచేత త్రాగించింది.
    "వెళ్దాం రామ్మా?" అన్నాడు రమణ దుర్గతల అడ్డంగా ఆడించింది, "అక్కడ నాకు చోటులేదు- నేను వెళ్ళలేను.
    "తప్పమ్మా- అది మంచిదికాదు. ఎట్లాగో సరిపెట్టుకోవాలి. అతనేమైనా అన్నాడా? అంటే అనివుంటాడు. అతని సంగతి మనకెవరికీ క్రొత్తకాదుగా"
    "నాకు ఆ యింటికి ఏ బంధకాలు లేవు"
    "తెగత్రెంపులు చేసుకొచ్చావా?"
    "నేను చేసుకోలేదు. వారేచేశారు!"
    "ఎవరు?"
    "మావారు"
    "ఏం జరిగింది - చెప్పమ్మా బుజ్జగిస్తూ అడిగాడు.
    దుర్గ బెదిరి పోతూ చుట్టూకలయ జూచింది. చటుక్కున ముందుకు వంగి అంది "ఆయనగారు పరీక్ష ప్యాసైనట్లు రాత్రి తెలిసింది. ఇక ఉద్యోగానికి ధరఖాస్తు పంపుతారని ఎంత ఆనందించాను....ఈవేళ తెల్లవారు ఝామున లేచి గదిలో అటు ఇటు తిరుగు తున్నారు. మెలకువ వచ్చి ఆయన ముఖం కేసి చూశాను. ఎంతో వికృతంగా మారింది. పెళ్ళయిన క్రొత్తలో ఆవిధంగా వుండేవారు. లేచి కూచుని అలా చూస్తూండి పోయాను ఉన్నట్లుండి గబుక్కున నా దగ్గరికొచ్చి భారంగా నాభుజాల మీద చేతులేశారు. నేను ఈ మధ్య ఉన్నట్లు ఆనందంగా ఉంటే నీకు బాగుంటుంది కదూ -అన్నారు.
    "-....అయ్యో ఆ పాపిష్టిమాటలు ఇంతమంది మంచివాళ్ళ దగ్గర ఎట్లా చెప్పను..." అని దుర్గ ఎలుగెత్తి ఏడ్వసాగింది.
    అంతే ఆ తరువాత ఆమెను ఎవరూ మాట్లాడించలే పోయారు. ఆమె దుఃఖం వేదన కొలవటానికి ఎవరికీ సాధ్యం కాలేదు. అనిర్వచనీయమైన ఆ బాధ ఎవరో పంచుకుంటే గాని తగ్గదు. కాని ఎట్లా! ఆమె చెప్పదే!...
    రాత్రి నింజన్,రమణ హాలులో నిద్రపోయారు. సరళ దుర్గను బుజ్జగించి కొద్ధిగా ఎంగిలి చేయించింది. తన గదిలో తనవేదనే పండుకో బెట్టింది. నిద్రపోయే వేళప్పుడు మళ్ళీ వాతావరణాన్ని మెల్లగా దుర్గ వ్యవహారంపైకి మళ్ళించి ఆమె వేదనకు కారణాన్ని రాబట్టింది.
    తెల్లవారు జామున నాలుగు గంటలకు సరళకు మెలకువ వచ్చింది దుర్గ నిద్రపోతూ ఉంది. అయెం మనస్సు సుధాకర్ పై అసహ్యంతో. మొగజాతిపై ఏహ్యభావంతో బాధపడింది. దుర్గవైపు చూచింది నిద్రపోతున్నది. నిద్రలో కూడా ఆమె ముఖంలో దుర్భరమైన వేదన గూడుకట్టుకుంది. లేచి హాల్లోకి వచ్చి రమణను లేపింది సరళ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS