"అదే బాగుంటుంది . ఈలోగా నన్ను నేను పరిశుద్దుడిని చేసుకుంటాను. షూటింగు కు వారం రోజులు ముందు నుంచీ మద్యం మానేస్తాను. వ్యాయామం మానేస్తాను. ప్రతిరోజూ జపం చేస్తాను. మాంసాహారం ముట్టను. పవిత్రమైన జీవితం గడుపుతూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ నిష్టగా వుంటాను. అదే నన్ను పరమశివుడి పాత్రకు సంసిద్దుడిని చేస్తుంది. షూటింగు ప్రారంభమై ముగిసేవరకూ నేనీ పద్దతిని కొనసాగిస్తాను. అంటే సుమారు పదివారాలు నేను ఇతర చిత్రాల షూటింగులలో పోల్గోనను. ఆవిధంగా ఈ పాత్రకు న్యాయం చేయగలనుకుంటున్నాను -" అన్నాడు మనోహర్.
"నీ సిన్సియారిటీ మెచ్చుకోతగ్గది. నీకా పరమశివుడి దీవెనెలు లభిస్తాయి. మన చిత్ర విజయమూ, నీకు పేరు ప్రఖ్యాతలూ తధ్యం -" అంటూ సదాశివం మనోహర్ని మెచ్చుకున్నాడు.
పరమశివుడి పాత్ర గురించి మనోహర్ అవలంబి స్తున్న నిష్ఠ గురించి పత్రికలన్నీ ఫొటోలతో సహా ప్రచురించాయి. ఆ పాత్ర పట్ల అతడికి గల భక్తీ శ్రద్దల నాకశాని కేత్త్రేస్తూ వర్ణించాయి. అయితే మనోహర్ ప్రచారం కోసం కాక నిజంగానే నిష్టను పాటించాడు.
భారీ ప్రయత్నాలలో మేలు తారాగణంతో పరమశివుడు చిత్రం తయారవుతోంది. తెలుగు చలనచిత్ర రంగానికదొక అపూర్వకానుక అని పత్రికలు అభివర్ణిస్తున్నాయి. ఆ చిత్రం షూటింగు వివరాలు చదువుతూ ప్రజలు వెర్రెత్తిపోతున్నారు. అలనాడు భారతదేశానికి స్వాతంత్ర్య మెప్పుడోస్తుందా అని మహాత్మాగాంధీ వంటి నాయకులేదురు చూసినంత ఆత్రుతగా జనం పరమశివుడు చిత్రం విడుదల కోసం ఎదురు చూస్తూన్నారు. ఆఫీసుల్లో, విద్యాలయాల్లో క్లబ్బుల్లో, మహిళామండలి లో -- ఇలా ఎక్కడ చూసినా ఆ సినిమా గురించిన చర్చలే !
మొత్తం మీద పరమశివుడు చిత్రం పూర్తీ అయింది. పూర్తీ రంగులతో తయారైన ఆ సినిమా స్కోప్ చిత్రం ఒక శుభ ముహూర్తాన భారీ ప్రచారంతో విడుదలై ప్రజల మధ్యకు వచ్చింది.
నిజంగానే అది తెలుగు వారు గర్వించదగ్గ చిత్రం. ఏ భాష వారికైనా - ఇది మా భాష వారు తీసిన చిత్రమని సగర్వంగా చెప్పుకోతగ్గ చిత్రం. ఖండ ఖండంతరాలలో భారతజాతికీ, హిందూ మతానికి పేరు ప్రతిష్టలు తెచ్చి పెట్టె చిత్రం.
ఎందరో కళాకారులు కలిసి ఎంతో కళాత్మకంగా తయారుచేసిన ఆచిత్రాన్ని చూస్తున్నప్పుడు -- అందరూ తామున్న కాలాన్ని మరిచిపోయి -- పురాణయుగంలోకి వెళ్ళి పోయారు. ఆ చిత్రంలో మనోహర్ మనోహర్ గా కాక పరమ శివుడు గానే అందరకూ కొనియాడుతుండగా ఆ చిత్రం తెలుగు దేశంలో విజయభేరి మ్రోగిస్తోంది. ఎన్ని భాషలా వారో ఆ చిత్రాన్ని డబ్బింగు కు అడుగుతున్నారు. అంతవరకూ వసూళ్ళ విషయంలో వున్న అన్ని రికార్డు లనూ ఆ చిత్రం అధిగమించింది. వాటం చూస్తె అది ఏళ్ళ తరబడి ఆడేలాగుంది.
పరమశివుడు చిత్రం వల్ల సదాశివానికి చేకూరిన లాభం పెద్దగా ఏమీ లేదు. చిత్ర నిర్మాతగా ఆయనకున్న పేరు మరికాస్త పెరిగింది. అప్పటికే అదుపు లేకుండా వున్న ఆస్తి పాస్తులు మరికాస్త పెరిగాయి.
ఈ చిత్రం వల్ల పూర్తీ లాభం పొందినవారు మనోహర్, అతడీ చిత్రంతో సూపర్ స్టారైపోయాడు. ప్రేక్షకుల్లో అతడి ఇమేజ్ బాగా పెరిగిపోయింది. నిర్మాతల్లో అతడి విలువ ఏ హీరోకూ లేనంతగా పెరిగింది.
ఇప్పుడు మనోహర్ ఒక్కసారిగా పాతిక చిత్రాల్లో నటిస్తున్నాడు. కాల్ షీట్లు ఇవ్వలేక కొన్ని చిత్రాలు వదులుకున్నాడు కూడా. కొందరు నిర్మాతలైతే అతడేప్పుడు ఊ అంటే అప్పుడే నని సంవత్సరాల తరబడి ఎదురు చూడ్డానికి సిద్దంగా వున్నారు.
పరమశివుడు చిత్రం శతదినోత్సవం జరుపుకుంది. అప్పుడు మనోహర్ , సదాశివం ఆ వేడుకల్లో పాల్గొనడానికి రాష్ట్ర సంచారం చేశారు. ఆయా ప్రాంతాల్లో మాట్లాడేటప్పుడు సదాశివం -" ఈరోజు నేనీ స్థితికి రావడానికి కారణం నా అరాధ్య దైవం పరమశివుడు . చంద్రుడికో నూలు పోగులా ఆ లీలామానుష విగ్రహుడికి చిత్రాన్ని కానుకగా సమర్పించుకున్నాను. నా ప్రయత్నం ఫలించిందంటే ఆ భగవానుడు నా ప్రయత్నాన్ని అభినందించినట్లుగా భావిస్తున్నాను. అయన సంకల్పం లేనిదే ఈ ప్రపంచంలో ఏమీ జరిగదుకదా !" అన్నాడు.
మనోహర్ తనూ మాట్లాడుతూ -- "భగవదనుగ్రహం వల్ల నాకు నటించగల శక్తి వుంది. ఆ శక్తితో ఇంతకాలం మిమ్మల్నందర్నీ మెప్పించగలిగాను. అయితే ఇంతకాలానికి నేను చూసిన నటన ఒక ఎత్తు. పరమశివుడు పాత్ర ఒక ఎత్తు. నేను సామాన్య మానవుణ్ణి. అయన అసాధారణుడు . ఆ విశ్వాన్నే అయన శాసిస్తున్నాడు. ఇంటి యిల్లాలినే శాసించలేని అల్ప జీవిని నేను. ఆ పాత్రను పోషించడం నా వల్ల నవుతుందా? అందుకే నేను కఠోర నియమాలు ననుసరించి నన్ను నేను పవిత్రంగా ఉంచుకుంటూ ఆ దేవాది దేవుణ్ణి ఆహ్వానించాను. అయన నన్నావహించాడు. అందుకే పరామశివుడి పాత్రలో అందరికీ నేను పరమ శివుదిగానే గోచరించాను. ఇక ముందు కూడా ప్రతి పాత్రనూ -- ఆ పాత్రకు సంబంధించిన నియమాలు పాటిస్తూ ఇలాగే నటనాజీవితాన్ని కొనసాగించగలనని మీ అందరికీ మాట యిస్తున్నాను --" అన్నాడు.
ప్రేక్షకులు హర్షధ్వానాలు చేశారు.
తర్వాత "పరమశివుడు " రజతోత్సవం చేసుకుంది. స్వర్ణోత్సవం , వర్ణోత్సవం -- ఇంకా యెన్ని వుత్సవాలు చేసుకుంటుందో చెప్పలేము. విడుదలైన చాలా కేంద్రాల్లో ఆ చిత్రం ఇంకా నడుస్తూనే వుంది.
అయితే మనమిప్పుడు చెప్పుకోబోయే కధకిది ఉపోద్ఘాతం మాత్రమే! ఈ కధ కింత ఉపోద్ఘాత మెందుకూ అనుకునేవారికి ముందు కధ బదులిస్తుంది.
2
జగాన్నాధం నిజంగా గొప్పవాడు. నిజంగా గొప్పవాడని ఎండుకనాల్సోచ్చిందంటే -- నిజమైన గొప్ప వాళ్ళు ప్రచారాన్నశించరు. ఫలితాల నాశించి పనులు చేయరు. ఎప్పుడూ మంచి పనులే చేస్తారు. అటుపైన జీవితంలో దెబ్బతింటారు కూడా!
జగన్నాధం విషయంలో యివన్నీ జరిగాయి. ఆయనకు లెక్కలేనంత ఆస్తి వుండేది. ఆయనకు దురలవాట్లు లేవు. కూర్చుని తింటే కొండలన్న కరగొచ్చు. కానీ అయన ఆస్తి తరగదు. అలాంటి ఆస్తి కరిగి పోయిందంటే అందుక్కారణముంది. జగన్నాధం కూర్చుని తినడానికి బదులు, కూర్చుని పంచి పెట్టాడు.
అవసరంలో ఉన్నవాళ్ళను ఆడుకుంటూన్నానని అయననుకున్నాడు. ఆయన చేత ఆదుకోబడాలంటే అవసరం కల్పించుకుంటే చాలునని ఇతతరులనుకున్నారు. ఆ విధంగా అయన ఆస్తిని కూర్చుని తినేవాళ్ళ సంఖ్య ఒకటి నుంచి పదుల్లోకి వందల్లోకి యింకా చెప్పాలంటే వేలల్లోకీ కూడా పాకింది.
భారత ప్రజలందరూ సమంగా పంచుకునే మాటైతే బిర్లా టాటాల ఆస్తి కూడా ఏ మూలకీ చాలదు. ఇక జగన్నాధం గారి దెంత?
అయన పేరు చెప్పి ఎందరో పేద విద్యార్ధులు చదువుకుని పైకొచ్చారు. ఎందరో వ్యాపారస్థులకు పెట్టుబడి లభించింది. అయన సాయం పొందని వ్యక్తీ తెలుగుదేశంలో ఏ రంగంలోనూ లేడు.
జగన్నాధానిది జాలిగుండె ఆయనకు మనుషుల మీద నమ్మకం. ఈ రెండూ కలిసి అయన ఆస్తి కరింగించే సరికి ఆయనకు జాలిగుండె మాత్రమే మిగిలింది. మనుషుల మీద నమ్మకం పోయింది.
జగన్నాధాని కిద్దరే పిల్లలు. పెద్దవాడు సూర్యారావు,అమ్మాయి కుసుమ.
సూర్యారావు తండ్రి నెప్పుడు ఎదిరించలేదు. కానీ తండ్రి తీరతడికి నచ్చలేదు. అతడి చిన్నతన మెంతో వైభవంగా గడిచింది. అతడి చదువు బియ్యే లయ్యేసరికి తండ్రి పూర్తిగా దివాలా తీశాడు.
తమ ఆస్తంతా ఎలా పోయిందో అతడికి తెలుసు. అదింక రాదనీ తెలుసు. వాటి కతడు భయపడలేదు. తండ్రి తమ యింట్లో ఒక వాతావరణాన్ని సృష్టించాడు. అడవుల పాలైన హరిశ్చంద్రుడి జీవితానికి వనవాసానికి వెళ్ళిన రాముడి జీవితానికి తేడా వుంది.
రాముడు అడవుల్లో లక్ష్మణుడి సేవ లండుకుంటూ సీతతో సుభిస్తూ హాయిగా రోజులు గడిపాడు. రావణుడు సీతను బలవంతంగా ఎత్తుకుని పోయాడు. తప్పితే అందుకు శ్రీరాముడి ఆమోదం లేదు. హరిశ్చంద్రుడు అడవుల్లో అనుక్షణం నక్షత్రకుడి నోట దుర్భాషలు విన్నాడు. ఆలినీ, కొడుకునీ తనే అమ్ముకున్నాడు.
