దేవతలారా దీవించండి
వసుంధర
సదాశివం చిత్ర నిర్మాత. అయితే నిర్మాతల్లో అయన కోక ప్రత్యెక స్థానముంది. ఆయనకు నలుపులో ఎంతుందో తెలుపులో ఎంతుందో - డబ్బు గురించి ఎవరికీ తెలియదు. అలా తెలీయకుండా వుండాలనేమో ఆయనెప్పుడూ తెలుపు నలుపు చిత్రాలు తీయడు.
సదాశివం వర్ణ చిత్రాలు తప్ప తీయడన్నది ఒక నిజమైతే -- అయన చిత్రాలు భారీగా వుండాలన్నది మరో నియమం. బడ్జెట్ చిత్రాలు తీయడం ఆయన పరువుకు భంగమని -- స్వాభిప్రాయం.
తన చిత్రాలకు స్వయంగా దర్శకత్వం సహించక పోయినా- చిత్రం ఏవిధంగా తయారుకావాలో ఆయనే నిర్ణయిస్తాడు. అందువల్ల వివిధ దర్శకుల చేతుల్లో తయారైనప్పటికీ ఆయన చిత్రాలకో ప్రత్యేకత వుంది.
సదాశివం కటుంబ చిత్రాలు తీస్తాడన్న పేరుంది. అయితే సెక్సు, క్రైమ్ అయన చిత్రాల్లో ప్రచ్చన్నంగా వుంటాయి. అయన చిత్రాలు సెన్సారు కత్తెరకు గురికావడం అరుదు. కానీ ఇతర చిత్రాల్లో కంటే అసభ్య కరమూ, అభ్యంతరమూ - యైన దృశ్యాలాయన చిత్రాల్లో ఎక్కువుంటాయి. అయన చిత్రాలు సెన్సారు కత్తెరకు గురి కాకపోవడాని క్కారణం -- ప్రభుత్వంలో అయన కున్న పలుకుబడి అనీ - ఆ పలుకుడి క్కారణం - అయన పార్టీ చందాలుగా ఇచ్చే నల్లధనమనీ కూడా చాలా మంది చెప్పుకుంటారు.
ఏదేమైతేనేం -- సదాశివం చిత్రం అనగానే ప్రజ లాత్రుతగా విడుదల కోసం ఎదురుచూస్తారు. ఆ చిత్రం పై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. పత్రికలు కూడా ఆ చిత్రం గురించి విపరీతంగా విడుదలకు ముందూ -- విడుదల తర్వాత కూడా రాస్తారు. చిత్రం చూసినవారెవరైనా -- చిత్రదర్శకుడి కంటే , చిత్రంలో హీరో హీరోయిన్ల కంటే సదాశివాన్నే ఎక్కువగా గుర్తుంచుకుంటారు. ఇది సదాశివం మార్కుచిత్రం అని చూసిన వెంటనే చెప్పేయొచ్చు.
సదాశివం శివభక్తుడు . అందుకే అయన తీసిన ప్రతి చిత్రంలోనూ - సదాశివం స్వయంగా శివార్చన చేస్తున్న దృశ్యం తర్వాతనే టైటిల్సు ప్రారంభమవుతాయి.
ఇంతవరకూ సదాశివం అన్నీ సాంఘిక చిత్రాలే తీశాడు. వాటిలో ఒక్కటి కూడా ఫెయిల్ కాలేదు. అయితే ఇటీవల ప్రేక్షకుల అభిరుచిని నిర్ణయించడం కష్టంగా వుంటోంది. ఏ చిత్రం ఎందుకు హిట్టవుతుందో ఏది ఎందుకు ఫేయిలవుతుందో ఎవరూచెప్పలేకపోతున్నారు.
సదాశివం చిత్రాలకు మినిమమ్ గ్యారంటీ వుంది. అయినా ఆయనకు భయంగానే వుంటోందిటీవల. బడ్జెట్ చిత్రాలు తీద్దామా అంటే ప్రస్టేజీకి భంగం. భారీ చిత్రాలు వరుసగా రెండు ఫెయిలయ్యాయంటే నిర్మాతకు పేరు పోతుంది. ఆర్ధికంగా పతనమూ తప్పదు. ఈ విధమైన ఆలోచనలే అయన దృష్టిని పౌరాణిక చిత్రాల వైపు మళ్ళించాయి.
తను నిత్యమూ ఆరాధించుకునే శివుడి కారణంగానే కానింతటివాడినై నాననీ -- ఆ మహాదేవుడి నీలం నింత వరకూ సరైన చిత్ర రూపంలో ఎవరూ తీయలేదనీ ఆయనకు తోచింది. అటు భగవంతుణ్ణి తృప్తిపరచినట్లూ వుంటుంది -- ఇటు చిత్ర విజయావకాశాలు ఎక్కువుంటాయనే నమ్మకంతో అయన వెంటనే భారీ ఎత్తున - "పరమ శివుడు " అనే పౌరాణిక చిత్రం తీయనున్నట్లు పత్రికల వారికి తెలియబరిచాడు.
సదాశివం చిత్రం ప్రారంభించడమంటే అది మామూలు విషయం కాదు. ముందుగా కధ గురించే పెద్ద హడావుడి చేయాలి.
ఒక నెలరోజుల పాటు సదాశివం స్వయంగా దేశంలోని ప్రముఖ విద్యాలయాల్నీ శివాలయాల్నీ సందర్శించాడు. అందుకాయన ప్రత్యేకమైన స్వంత విమానాన్నుపయోగించుకున్నాడు. శివుడి గురించి ప్రచారంలో వున్న కధలను ఒక్కటి కూడా వదిలి పెట్టకుండా సేకరించాడు. అయన తన విమాన యాత్రలో తెలుసుకున్న దేమిటంటే -- శివుడి గురించి ఎన్నో విశేషాలింకా తెర కేక్కవలసి ఉంది.
"పరమశివుడు " కధను -- ప్రజలకు సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తేటంట నూతనంగా తయారుచేయవచ్చు. అంతేకాదు --చాలామంది కిలా ఈ చిత్రాన్ని స్టూడియో లో తీయనవసరం లేదు. చాలావరకూ అవుట్ డోర్లోనే తీయవచ్చు. ఒక పౌరాణిక చిత్రాన్ని చాలాభాగం అవుట్ డోర్ లో తీయాలనుకోవడం గొప్ప సాహసమే అవుతుంది. కానీ సాహసం లేనిదే సదాశివం చిత్రంలో విశేష మేముంటుంది ?
తను సేకరించిన సమాచారాన్ని అష్టాదశ పురాణాల తోటీ, నాలుగు వేదాలతోటీ రామాయణ భారత భాగవతాలతోటీ, ఉపనిషత్తులతోటీ పోల్చి సారవంశమూ, రసవంతమూ అయిన కధను తయారుచేయడాని కాయన - "శివగోష్టి " పేరిట ఒక సారస్వత సభ నేర్పరచి సమర్ధులైన కవులనూ, రచయితలనూ దానికి ఆహ్వానించాడు' ఆ 'శివ గోష్టి' కే లక్ష రూపాయల ఖర్చయిందనీ, అదొక అమృత సారస్వత గోష్టి అనీ ఎన్నో పత్రికలు రాశాయి. శివ గోష్టి విశేషాలను పోటీలతో సహా ప్రచురించాయి.
"శివగోష్టి " - ప్రజల్లో సంచలనం రేకెత్తించింది. శివగోష్టి అనంతరం - "పరమశివుడు " చిత్ర కధ -- స్ర్కిప్టు తయారుచేయడానికి ఇద్దరు కవులు, ముగ్గురు రచయితలను నియమించాడు సదాశివం.
చిత్ర నిర్మాణాని కింత హడావుడి జరుగుతున్న సమయంలో - పరమశివుడి పాత్ర కేవరి నేన్నుకోవాలా అన్న చర్చలు ప్రారంభమయ్యాయి. సదాశివం ఈ పాత్ర కెవరు నేన్నుకుంటాడో -- ఎందు కెన్నుకుంటాడో ఊహించవలసిందిగా కొన్ని పత్రికలు ఆకర్షణీయమైన పోటీ శీర్షికలు కూడా నిర్వహించాయి.
అయితే ఈ విషయంలో సదాశివం ఎక్కువగా ఆలోచించలేదు.
పౌరాణిక పాత్రలను ధరించి వాటికి కొత్త విలువల నాపాదించి ప్రజల మెప్పును పొందడంలో తనకు తనే సాటి అని పేరుబడ్డ రవికుమార్ -- సదాశివం మిత్ర బృందం లోనివాడే ! అయితే రవి కుమార్ కిప్పుడు వయసు ముదురుతోంది. పరమశివుణ్ణి నూనూగు మీసాలమాతృయౌవనుడిగా చూపవలసిన దృశ్యాలు కొన్ని చిత్రంలో ఉన్నాయి. అపుడా పాత్రకు రవికుమార్ బొత్తిగా సరిపోడు. బాల్యంలో ఒక నటుడిని యౌవనంలో మరో నటుడిని చూపితే ప్రేక్షకు లాదరిస్తారు గానీ -- యౌవనంలో ఒక నటుణ్ణి. నడి వయసులో మరో నటుడిని చిత్రాలలో చూపడం అరుదుగా జరుగుతుంది.
అనవసరపు టపార్దాలకూ, రాజకీయాలకూ దారి తీయకుండా వుండడానికి సదాశివం ముందుగా చిత్ర కధను రవి కుమార్ కి వినిపించాడు. అతడు చిత్రకధను విని - "ఈ చిత్రాన్ని మీరు పది సంవత్సరాల ముందు తలపెట్టి వుంటే నేను కొంత న్యాయం చేకూర్చగలిగేవాణ్ణి "- అన్నాడు.
'అది నా దురదృష్టం -" అన్నాడు సదాశివం.
"ఇందులో మీ దురదృష్ట మేమీలేదు. దురదృష్టం నాదే!" అన్నాడు రవికుమార్ - "మీరీ రోల్ కు మనోహర్ని బుక్ చేయండి -"
"మీమాట నాకు శిరోధార్యం - " అన్నాడు సదాశివం సంతోషంగా.
సినీ ఫీల్డు లో వున్న విశేషమదే! అక్కడ ఎవరికేం కావాలో అందరికీ బాగా తెలుసు. సదాశివం మనసులో ఏముందో తెలుసుకుని రవి కుమార్ ఆ మాటే చెప్పాడు. రవికుమార్ చేత ఆ మాట చెప్పించడానికే సదాశివం అక్కడకు వచ్చాడు.
మనోహర్ చిత్ర జగత్తు లో అడుగుపెట్టి ఇప్పటికీ మూడు సంవత్సరాలైంది. అతడిది మంచి విగ్రహం . చక్కటి ఉచ్చారణ. నటన లో అతడు రవి కుమార్ అడుగు జాడల్లో నే నడుస్తున్నాడు. భవిష్యత్తులో తాను లేని లోటును పూడ్చగల్గినది మనోహర్ మాత్రమే నని రవికుమార్ పాత్రికేయులకు చెప్పి వున్నాడు. ఆ మాటకేంతో ప్రచారం లభించింది. మనోహర్ భవిష్యత్తు కది బంగారు బాటవేసింది.
అందుకేనేమో మనోహార్ తన ఆరాధ్య దైవాల పేర్లు చెబుతూ -- "భూ కైలాసంలో రవికుమార్, కైలాసంలో పరమశివుడు " అన్నాడు.
ఎంతో హడావుడి జరుగుతూ ప్రేక్షక లోకంలో సంచలనాన్ని సృష్టిస్తున్న పరమశివుడు చిత్రంలో తనకు కధానాయకుడి పాత్ర లభించినందుకు మనోహర్ పొంగిపోయాడు. అందులోనూ సదాశివం చిత్రంలో అవకాశం లభించడం అదే మొదటిసారతడికి !
తనకువలెనె మనోహార్ కూడా శివ భక్తుడు రావడం -- సదాశివానికి సంతృప్తిని, సంతోషాన్ని కలిగించింది.
ఇద్దరూ స్క్రిప్టు గురించి బాగా చర్చించారు.
'అన్నీ ముందే సిద్దం చేసుకుని ఏక బిగిని రెండు నెలల్లో చిత్రాన్ని పూర్తీ చేద్దామనుకుంటున్నాను --" అన్నాడు సదాశివం మనోహర్ తో.
