-----సెట్ కు దూరంగా , కూర్చుంది కృష్ణ వందన వడిలో నాలుగు నెలల బాబు రాధా నిద్రపోతున్నాడు. ఆ మధ్య భర్తతో పాట షూటింగ్ కు వస్తోంది వందన.
రెండు నెలల క్రితం-----
"ఇంటిదగ్గర బోరుకొడుతుంది........ఇక నుంచి , వీలున్నప్పుడల్లా మీతో పాటు షూటింగ్స్ కొస్తాను......" కృష్ణవందన ప్రపోజ్ చేసినపుడు విమల్ ఏమీ అభ్యంతర పెట్టలేదు.
"గుడ్ ఐడియా ......వంటరిగా వుంటే , లేనిపోనీ ఆలోచన్లతో వుంటావు ఇంటికి రాగానే సవాలక్ష సందేహాలు ......ఇటీజ్ బెటర్." నవ్వుతూ అన్నాడు.
మధ్యలో, ఓరోజు షూటింగ్ నుంచి కారులో ఇంటికొస్తున్నప్పుడు "హీరోయిన్ తో యాక్ట్ చేస్తున్నప్పుడు , అంతగా గుండెలకు హత్తుకు పోవాల్సిన అవసరం లేదేమో .....ఎమోషనల్ గా యాక్ట్ చెయ్యడం సరే....మీరో హీరో , ఆవిడో హీరోయిన్ ......ఇద్దరూ యాక్ట్ చేస్తున్నామన్న విషయం గుర్తుంచుకుంటే చాలు......" విమల్ వేపు చూడకుండా , బయటకు చూస్తూ అంది కృష్ణవందన.
"డైరెక్టర్ ఎలా చేస్తే అలా చెయ్యలి గదా......" నవ్వుతూ అన్నాడు విమల్.
"డైరెక్టర్ ఎలా చెప్తే అలా చెయ్యడం మంచిదే.......అంతకంటే ఎక్కువ చేస్తేనే ప్రమాదం...."
"కృష్ణ వందన మనోగతం అర్ధమై, మరేం వాదించలేదు విమల్.
అప్పట్నించి ఫామిలీ సెంటిమెంట్ల సీన్లు, షూటింగ్ జరిగే సమయ\మప్పుడే వస్తోంది కృష్ణ వందన.
ఈసారి అనుకోకుండా , ఎవరో యాక్టర్ టైం కి రాకపోవడంతో సాంగ్ పిక్చరైజేషన్ పెట్టాడు డైరెక్టర్.
హీరో హీరోయిన్ నడుమ్మీద చెయ్యేసి , ముందుకి లాక్కుని కంఠం కింద భాగంలో ముద్దు పెట్టి , మళ్ళీ వెనక్కి స్టెప్స్ వేస్తూ వెళ్ళే సీన్ తీస్తున్నాడు డైరెక్టర్.
స్పీకరులోంచి అందుకు సంబంధించిన పాట పెద్దగా విన్పిస్తోంది.
"స్టార్" డైరెక్టర్ కేకతో, మూవ్ మెంట్స్ స్టార్లయ్యాయి.
"కట్" అన్న గొంతు డైరెక్టర్ ది కాదు, కృష్ణ వందనది.
ప్రొడక్షన్ సిబ్బంది ఆశ్చర్యంగా చూసారు వందన వేపు.
"విమల్ .....ఈ సాంగ్ కి మీరు యాక్ట్ చెయ్యాల్సిన అవసరం లేదు వచ్చెయ్యండి...." కుర్చీలోంచి అరిచింది వందన.
"ఏమ్మా! ఇది సినిమాలో పాట." డైరెక్టర్ ఆసహనంగా అన్నాడు.
"ఆ విషయం నాకు తెలుసు, ఈ పాటకు ఇంకో యాక్టర్ని పెట్టుకోండి. విమల్.....కమవుట్ ఐసే" విమల్ సెట్ లోంచి కృష్ణ వందన దగ్గర కొచ్చాడు.
"వందనా! ఏంటది , రాన్రానూ ......"ఏదో అనబోయాడు.
"ఇది క్లబ్ సాంగ్. హీరోయే ఉండాల్సిన అవసరం లేదు." హీరోయే , ఆ డాన్సర్ తో పాట పాడాల్సిన అవసరం లేదు. అవసరమైతే డూప్ ని పెట్టుకోమనండి, నేను వెళ్తున్నాను . డైరెక్టర్ తో చెప్పేసి మీరు రండి." విస వీసా ఫ్లోర్ లోంచి బయటకు వెళ్ళిపోతూ అంది కృష్ణ వందన.
బయట కారు దగ్గర పావుగంట, అరగంట వెయిట్ చేసింది కృష్ణ వందన.
విమల్ వెళ్ళలేదు.
ఆ పాట పిక్చరైజేషన్ పూర్తయ్యేసరికి మరో ఆరుగంటలు పట్టింది. రాత్రి ఎనిమిది గంటలకు, ఫ్లోర్లోంఛి బయటకొచ్చి, పార్కింగ్ వేపు నడిచాడు విమల్.
కృష్ణ వందన వెళ్ళిపోయి , ఉంటుందనుకున్నాడు విమల్.
కారు పక్కన , చెట్టు కింద చపటా మీద, చెట్టుకి చేరబడి కూర్చుంది కృష్ణ వందన . చేతిలో పసిబిడ్డ.
గబగబా పరుగెత్తాడు విమల్.
"వందనా! నువ్వు వెళ్ళిపోయావనుకున్నాను. " అంతవరకూ కళ్ళు మూసుకుని కూర్చున్న వందన కళ్లిప్పి చూసింది.
"చలిలో....ఇన్నిగంటలు బయట కూర్చోవాల్సిన ఖర్మేం పట్ట్టింది. నువ్వు వెళ్ళిపోయావేమో అనుకున్నాను." కారు స్టీరింగు ముందు కూర్చుంటూ ------పక్కనే కూర్చుంది వందన. ఏమీ మాట్లాడలేదు.
కృష్ణ వందనను చూస్తే జాలేసింది విమల్ కు.
"సడన్ గా నేను బైటకొచ్చేసాననుకో .....పదిలక్షలు నష్టం ప్రొడ్యుసర్ కి, అంచేత రాలేదు. తెల్సి, తెల్సి నువ్వు మూర్ఖంగా ప్రవర్తించడం నాకేం నచ్చలేదు."
ఆ మాటకు తలతిప్పి , సూటిగా విమల్ కళ్ళల్లోకి చూసింది కృష్ణ వందన.
"మీ వంటిని మరొకరు ముట్టుకోవడం , మరొకరి వంటిని మీరు ముట్టుకోవడం నాకిష్టం లేదు" నెమ్మదిగా అంది కృష్ణ వందన.
"నువ్వూ సినిమా యాక్టర్ వే గదా......తెల్సి తెల్సి ఆ అబ్జక్షన్ అన్నీ ఇప్పుడే ఎందుకు పెడుతున్నవో నా కర్ధం కావడం లేదు."
"ఇప్పుడు కాదు , గదా......పెళ్ళయ్యాక, నేను సినిమాల్లో నటించడం మానేసింది. అందుకే .....నా శరీరాన్ని తాకే చెయ్యి......నా విమల్ దే కావాలని."
ఎన్నెన్నో కాంప్లెక్స్ ల రకరకాల సంగమం స్త్రీ. అందులో కృష్ణ వందన లాంటి స్త్రీలు గూడా వుంటారు. వాళ్ళకు, ప్రేమ, ద్వేషం రెండింటికి డెఫినెషన్ ఒక్కటే. అలాంటి స్త్రీలు తాము తమ పురుషుడిని ప్రేమగా చూసుకుంటున్నామని అనుకుంటారు. కానీ అతి ప్రేమ వల్ల మిగిలేది నరకమే!
అ రోజు రాత్రి-----
అప్సరసలా అలంకరించుకుని, పక్కకొచ్చి , కూర్చొన్న కృష్ణ వందనను చూసి ఆశ్చర్యపోయాడు విమల్.
సుగంధాలు వెదజల్లుతున్న పొడవాటి కురులు, కాటుక దిద్దుకున్న కళ్ళు, ..గంధపు చెక్కలాంటి ముక్కుమీద ముత్యపు పుడక, గులాబీ రంగు లిప్ స్టిక్ ----గులాబీ రంగు చీర, జాకెట్--
