Previous Page Next Page 
వసుంధర కధలు -12 పేజి 62

 

                                                     చావు జోస్యం
    
                                                                   వసుంధర
    అప్పుడే ఆఫీసు వదిలారు. మురళి కి చాలా నీరసంగా వుంది.
    అతను రోడ్డు మీద పడి దగ్గరలో వున్న హోటల్ వైపు నడువసాగాడు.
    ఆఫీసు వదలగానే హోటలు కు వెళ్ళడం మురళికి మామూలు కాదు, సాధారణంగా అతను బస్సు స్టాపు కే వెడతాడు.
    కానీ ఈరోజు అతనింటికి వెళ్ళే దాకా ఆగలేడు. ప్రోద్దుట్నుంచి భోజనం చేయలేదు. చాలా ఆకలిగా ఉంది. ఉదయం అతని ఆఫీసు వేళకు యింట్లో భోజనం తయారు కాక పోలేదు. అయితే అతను తల్లితో ఘర్షణ పడ్డాడు. అతని పెళ్ళి గురించిన చర్చ వచ్చినప్పుడల్లా ఇంట్లో ఘర్షణ జరగడం మాములే!
    చెల్లెలి పెళ్ళి అయ్యేవరకూ తన పెళ్ళి విషయం తలపెట్ట వద్దంటాడు మురళి. కానీ చాలామంది అడ్వాన్సుగా కట్నాల్నివ్వడానికి సిద్దంగా ఉన్నారు. ఏదో ఒకటి తేల్చేస్తే డబ్బు తీసుకుని- కూతురి పెళ్ళి జరిపించేయవచ్చు కదా అంటుంది మురళి తల్లి జానకమ్మ.
    కానీ మురళి తన పెళ్లిని వాయిదా వేయమనడానికి కారణం చెల్లెలి పెళ్ళి కాదన్న సంగతి మురళికీ తెలుసు, జానకమ్మకు తెలుసు, మురళి చెల్లెలు అమ్మలుకీ తెలుసు.
    మురళి ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి పేరు లలిత. లలిత మురళికి స్వయానా మరదలు. వీళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకొనడానికీ బంధుత్వం దోహదం చేసింది.
    మురళీ లలితను ప్రేమిస్తున్నాడు. లలిత మురళిని గాడంగా ప్రేమిస్తోంది. లలిత తల్లి రాజేశ్వరమ్మ ఈ పెళ్ళి జరగాలని కోరుకుంటోంది. లలిత కోడలు కావడం తన అదృష్టమని జానకమ్మ భావిస్తోంది. అమ్మలు, లలిత ప్రాణ మిత్రులు. ఇంతమంది ఇష్టాలని వ్యతిరేకిస్తున్న ఒకేఒక వ్యక్తీ పట్టాభిరామయ్య. అయన లలిత తండ్రి. రాజేశ్వరమ్మ భర్త. వీళ్ళిద్దరి ఇష్టాలనూ కాదనడానికి ఆయనకు వీటో పవరుంది. అ పవరు నాయన తరచుగా ఉపయోగించుకుంటూ ఉంటాడు కూడా.
    పట్టాభిరామయ్య మురళిని ద్వేషించడు. చుట్టపు చూపుగా అయన అప్పుడప్పుడతని ఇంటికి కూడా వస్తుంటాడు. కానీ మురళి చుట్టూ వున్న వాతావరణం తన కనుకూలమైనది కాదని అయనకు తెలుసు. మురళి దరిద్రంలో జీవిస్తున్నాడన్నది అయన నమ్మకం.
    నిజానికి మురళి దరిద్రుడు కాదు. అతనికి మెడల్లేక పోయినా ఉంటున్న పెంకుటిల్లు స్వంతమే! నెలకు చేతికి ఆరొందల రూపాయలోచ్చే ఉద్యోగముంది. కొద్దిగా చిల్లర అప్పులు, అతని తండ్రి చేసినవి ఉన్నప్పటికీ , అవి తీర్చడం అతనికి కష్టమైన పనేమీ కాదు. ఇప్పటికే సగానికి పైగా తీర్చేశాడు. చెల్లెలి పెళ్ళి ఒక్కటే అతని కున్న బాధ్యత! అది కూడా మరీ అంత కష్టతరమైన దేమీ కాదు. అమ్మలు అందంగానే ఉంటుంది మరి! ఇవన్నీ కాక మురళి ఇంట్లో స్వచ్చమైన ప్రేమ దొరుకుతుంది. అతనింట్లో అందరూ ప్రేమమూర్తులే!
    మురళికి కాబోయే ఇల్లాలు తప్పక సుఖపడుతుందని ఎందరో ఆడపిల్లల కన్న తండ్రులకు అచంచల విశ్వాసముంది. ఆ కారణంగానే అతని కోసం ఎన్నో సంబంధాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. మరి మురళి దరిద్రుడేలా గౌతాడు?
    ఇక్కడే సాపేక్ష సిద్దాంతం పనికి వస్తుంది. సామాన్యులకు మురళి దరుద్రుడు కాకపోవచ్చు. కానీ పట్టాభిరామయ్య దృష్టికతను దరిద్రుడే! ఎందుకంటె పట్టాభిరామయ్య ఆస్తి కనీసం పది లక్షల విలువ చేస్తుంది.    
    పైగా ఆయనకు ఒక్కర్తే కూతురు. తన కూతురి కాయన తన స్థాయి అత్తవారిల్లు కోసం చూస్తున్నాడు. మురళి లాంటివాళ్ళ నాయన పూర్తిగా కొట్టేయలేదు. రెండు మూడేళ్ళ క్రితం ఒక పర్యాయం అయన జానకమ్మను కదిపి చూశాడు -- మురళిని ఇల్లరిక పుటల్లుడిగా చేసుకుందామనుకుంటున్నానని.
    ఇల్లరికానికి మురళి అంగీకరించలేదు. మురళి యింటికి లలితను పంపడం పట్టాభిరామయ్య కిష్టం లేదు. మురళి ఆత్మాభిమానం -- అతనికి లలిత మీద గల ప్రేమను కూడా జయించింది. అది కూడా పట్టాభిరామయ్య దృష్టిలో మురళి దారిద్రుడు కావడానికి ఒక కారణం. ఆత్మాభిమానం దరిద్రులకే వుంటుందని అయన అభిప్రాయం.
    మురళికి లలిత మీదనే కాని, ఆమె ఆస్తి మీద మోజు లేదు. లలిత మనసులో మురళి తప్పులేదు. ఇల్లరికాని ఒప్పుకుంటే మురళి మంచి అల్లుడేనని పట్టాభిరామయ్య అభిప్రాయం. ఈ మూడింటి కారణంగా అటు లలిత పెళ్ళి ఇటు మురళి పెళ్లి కూడా అలా వాయిదా పడుతూనే వస్తున్నాయి.
    మురళి ఆలోచిస్తూ, దగ్గర్లో వున్న హోటల్ వైపు నడుస్తున్నాడు. ఆ సమయంలో అతన్నేవరో "హలో" అని పిలిచారు.
    మురళి తన్ను కాదేమో ననుకుంటూనే , పిలుపు వచ్చిన వైపు చూశాడు.
    అతనికి పాతికేళ్ళు పైనే వుండవచ్చు. లాంగ్ హైరు, నల్ల పాంటు మీద లేత నీలం చొక్కా ఇన్ షర్ట్ చేశాడు. కాళ్ళకి బూట్లూన్నాయి. అతను లాంతరు స్థంభం దగ్గర నిలబడి వున్నాడు. తననే పిలుస్తున్నాడు.
    ఆ మనిషి వేష భాషల్ని బట్టి, అతని పిలుపును గౌరవించి, దగ్గరకు వెళ్ళాడు మురళి.
    "నన్నేనా పిలిచింది?" అనడిగాడు మురళి.
    'అవును, మిమ్మల్నే మీ పేరు మురళి కదూ?" అడిగాడతను.
    "మీరెవరో నాకు తెలియదు. నా పేరు మీకెలా తెలుసు?" అన్నాడు మురళి.
    "నేనొక జ్యోతిష్కుడిని" అన్నాడతను నవ్వుతూ "  "మనుషుల పేర్లే కాదు, జరుగబోయేవినాకు చాలా తెలుస్తాయి. ముఖ్యంగా ఎవరెప్పుడు చచ్చిపోయేది చాలా ఖచ్చితంగా చెప్పగలను."
    'అంటే, నాకర్ధం కాలేదు."
    'అటు చూడండి" అన్నాడతను. చూశాను, ఏమీ కనిపించలేదు . అదే చెప్పాను.
    'ఏమీ లేకపోవడ మేమిటి? అది బట్టల దుకాణం కదూ" అన్నాడతను.
    'అయితే?"
    "ఆ దుకాణంలో కూర్చున్న ప్రోప్రేయిటర్ కనపడుతున్నారా?"
    "కనపడుతున్నారు. అయన మా పెద్దనాన్నగారు" అన్నాడు మురళి.
    "అవునా? అయన ఎప్పుడు చనిపొతారో నాకు తెలుసు" అన్నాడతను.
    మురళికి చిరాకు వేసింది. "తెలిస్తే తెలిసింది లెండి. కానీ, నాకు తెలుసుకోవాలని లేదు. మీరెవరో నాకు తెలియదు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నారో కూడా నాకు తెలియదు" అని అక్కణ్ణించి వెళ్ళబోయాడు.
    "వెళ్ళిపోకండి మిస్టర్ మురళి! ఈ సమాచారం మీకు చాలా అవసరం. అయన రేపు సాయంత్రం నాలుగున్నర ప్రాంతంలో మరణిస్తారు. నా జోస్యం తప్పదు. అయన చనిపోయేరని తెలిసేక, ఈ విషయం మీకొక జ్యోతిష్యుడు ముందుగానే చెప్పాడని మాత్రం గుర్తుంచుకోవాలి" అన్నాడతను.
    "మీ పేరు?" అన్నాడు మురళి.
    "ప్రస్తుతానికి జ్యోతిష్కుడని గుర్తుంచుకోండి చాలు. మళ్ళీ నేనే మిమ్మల్ని కలుస్తాను" అతను కదిలాడు.
    ఆకలితో వున్న మురళి ఆ విషయాన్ని ప్రస్తుతానికి వదిలిపెట్టి, హోటల్ వైపుకి గబగబా అడుగులు వేశాడు.
    రెండిడ్లీలు , ఒక దోశ , కప్పు కాఫీ తాగేక మురళి కాస్త మామూలు మనిషి కాగలిగాడు. అతనిలో మళ్ళీ ప్రశాంతంగా ఆలోచించగల ఓపిక వచ్చింది.
    ఇప్పుడతని బుర్రలో ఇందాకటి విచిత్ర జ్యోతిష్కుడు మెడుల్తున్నాడు.
    ఎవరతను? తను అతనికి ఏ విధంగా తెలుసును? అతను తనని పిలిచి పెదనాన్న గారి చావు గురించి చెప్పడంలో ఉద్దేశ్యమేమిటి?
    పెద్దనాన్న సుదర్శనం గారంటే మురళికి చాలా గౌరవముంది. ఆయనకు అతనంటే ఎంతో అభిమానముంది.
    అయన మురళి తండ్రికి స్వయానా అన్నగారు. పెళ్ళవగానే వ్యాపారంలోకి దిగేరు. అదృష్టవశాత్తు అందులో బాగా కలిసొచ్చింది. ఉళ్ళోని ధనికుల్లో ఇప్పుడు ఆయనొకరు. ఎటొచ్చీ మురళి కుటుంబానికీ, వాళ్ళకీ రాకపోకలు తక్కువ.
    మురళి దొడ్డమ్మ అనుమానపు మనిషి. భర్త మంచితనాన్నలుసుగా తీసుకుని బంధువు లాయన్నేదో చేస్తారని ఆవిడ భయం. అందువల్ల ఆవిడ ఆత్మాభిమానమున్నవాడెవడూ  తమ గడప తోక్కలేని విధంగా మాట్లాడుతుంది. మురళికి ఆత్మాభిమానానికేం తక్కువ లేదు!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS