Previous Page Next Page 
డాళింగ్ పేజి 61

 

    తడితడిగా ఉన్న ఆమె పెదవుల్ని చుంబించాడు విమల్.
    "ఎప్పుడు పెళ్ళి చేసుకుందాం?" నెమ్మదిగా చెవిలో గొణిగాడు విమల్.
    "ఆ ప్రయత్నంలోనే ఉన్నాం కదా....తొందరెందుకు?" వందన మాటలాకు , విమల్ కు నావ్వొచ్చింది.
    పెద్ద పెట్టున నవ్వేసాడు నవ్వేసి.
    "అంత రిజర్వుడుగా కనిపించే నీలో, ఇంత సెన్సాఫ్ హ్యుమర్ ఉందనుకోలేదు." అన్నాడు.
    ఇద్దరూ ఒక గంటసేపు కబుర్లాడుకున్నారు.
    "పద, బోరుకొడుతోంది....మీ ఇంటి కెళ్దాం!" తనే లేస్తూ అంది కృష్ణ వందన.
    "మా ఇంటికా? ఇప్పుడా!" చాలాసార్లు ఇంటికి రమ్మని ఆహ్వానించాడు కృష్ణవందనని. ఎప్పుడూ రాకుండా ఏవో సాకులు చెప్పేది. ఇప్పుడు.....? అంతా అయోమయంగా ఉంది విమల్ కు.
    "ఇంట్లో మీ డాడీ ఉంటారా?"
    "ఎవరూ లేరు."
    "అయితే ......మరీ మంచిది. ఆ ప్రేమించుకోవడమేదో , ఇంట్లోనే ప్రేమించుకోవచ్చు" కార్లో కూర్చుంటూ అంది కృష్ణవందన.
    ఆ మాటలకు , తనలాగే కృష్ణవందన కూడా పార్టీ కెళ్ళి వచ్చిందేమో , అనుమానంగా ఆమె ముఖం వేపు చూసాడు.
    ఆ ముఖంలో అలాంటి ఛాయలేవీ లేవు!
    ----గూర్ఖా సెల్యూట్ అందుకుని ఇద్దరూ లోనికెళ్ళరు.
    విశాలమైన బిల్డింగ్.
    "ఇందులో నీ బెడ్ రూం ఎక్కడ?"
    "ఏం?" అనుమానంగా అడిగాడు విమల్.
    బెడ్ రూమ్ లోకి వెళ్ళి స్విచాన్ చేసాడు విమల్. లైటు వెలగలేదు.
    కరెంట్ లేదు...." కొవ్వొత్తి వెలిగిస్తూ అన్నాడు.
    కొవ్వొత్తి వెలుగులో తన ప్రతిబింబాన్ని, డ్రెస్సింగ్ టేబిల్ మిర్రర్ లో చూసుకుంటోంది.
    బెడ్ మీద కూర్చుని, ఆమె వేపు చూసాడు. మసక మసక చీకట్లో, పాలరాతితో చేసిన విగ్రహంలా మెరుస్తోంది కృష్ణవందన.
    అలా తనవేపే చూస్తున్న విమల్ చూపుల్ని పసికట్టింది.
    "ఏంటలా చూస్తున్నావ్?" అతని దగ్గరగా వచ్చి , అతని మెడ మీద చెయ్యి వేసి పెదాల్ని , కనురెప్పల్ని , బుగ్గల్ని, మీస కట్టుమీద నుదుటి మీద ముద్దు పెట్టుకుని.
    "ఐ లవ్ యూ......విమల్." అంది తమకంగా.
    విమల్ మాట్లాడలేదు. ఆమె మోహపార్వశ్యంలో కొట్టుకుపోతున్నాడతను.
    ఆమె నునుపైన తెల్లటి కంఠంమ్మీద ముద్దు పెట్టుకుంటూ......"
    "కొవ్వొత్తి అర్పనా....." అన్నాడు గుస, గుసగా.
    రెండు క్షణాలు అతని కళ్ళ వేపు సూటిగా చూసి,
    "ఇప్పుడు కాదు, పెళ్ళయ్యాక."
    -----అదే సమయంలో కరెంట్ వచ్చింది. పైన షాండేలీర్ లోంచి తెల్లని వెల్తురు కాంతులు ......
    .....సరిగ్గా అదే టైం లో గణ గణమని ఫోన్ మోగింది.
    గోడ గడియారం వేపు చూసాడు విమల్. పదకొండయింది.
    "డాడీ ఏమో!" అనుకుంటూ , రిసీవర్ తీసుకున్నడు.
    రెండు నిమిషాల తర్వాత ఫోన్ పెట్టేసాడు.
    "ఎవరు?' అడిగింది కృష్ణ వందన.
    "ఎవరో ........జె. ఆర్. రావట. నాతో అర్జంటుగా మాట్లాడాలిట... ఎవరో కొత్త ప్రొడ్యుసరే,మో ..."విసుగ్గా అన్నాడు విమల్.
    "మళ్ళీ ఫోనోస్తుంది. నాకివ్వు......' కృష్ణవందన వేపు, ఆశ్చర్యంగా విమల్ చూస్తున్న సమయంలో ---
    మళ్ళీ ఫోన్ రింగయింది.
    రిసీవర్ ఎత్తి పట్టుకుంది కృష్ణవందన.
    "మిస్టర్ విమల్, నేనెవరో తెలిస్తే, నువ్వే నా దగ్గరికి పరుగు పరుగున వస్తావ్.' అట్నించి జె. ఆర్. రావు గొంతు విన్పిస్తోంది.
    నవ్వుకుంది కృష్ణ వందన.- ఎక్స్ టెన్షన్ లో తండ్రి మాటలు విని,
    "విమల్ దగ్గర నేనుండగా , మీ దగ్గరకు ఆయనరాడు డాడీ." అక్కడ కృష్ణ వందన ఉంటుందని , ఊహించలేదు జె. ఆర్. రావు. . జె.ఆర్. రావు, తనలా కూతురికి దొరికిపోతాడని అనుకోలేదు.
    "ఓ.కె. బేబీ , కెరీ అన్......సారీ ఫర్ ది డిస్ట్రబింగ్ యూ...." అన్నాడాయన.
    నువ్వు అంతగా ప్రేమించే విమల్ ని నేను చూడకపోయినా, పెళ్ళికి ఒప్పుకుంటున్నాన్నమ్మా, గ్లాడ్ బ్లెస్ యూ." ఫోన్ పెట్టేసాడాయన.
    జె. ఆర్. రావు ప్రోగ్రామ్ మూడుగంటల సేపు వాయిదా వేసుకోడానికి కారణం , విమల్ ని కలిసి, విమల్ ని పరీక్షించి, అతనేలాంటి వాడో స్వయంగా తెల్సుకుందామని తండ్రి దగ్గర్నుంచి రాగానే ఏవైనా ప్రెజెంటేషన్స్ పంపుదామని , మళ్ళీ హోటల్ కి ఫోన్ చేసింది కృష్ణ వందన. అప్పుడు తెల్సిందామెకు......అకస్మాత్తుగా తన తండ్రి ప్రోగ్రామ్ మారిపోయిందని. తండ్రి మనస్తత్వం ఆమెకు బాగా తెలుసు. విమల్ ని కలుసుకోడానికే ఆయన ప్రోగ్రాం మార్చుకున్నాడని ఊహించింది కృష్ణ వందన.
    విమల్ ని, తనెంతగా ప్రేమిస్తుందో, తండ్రి స్వయంగా తెలుసుకోవాలనే అతన్ని పట్టుకుని, అతని వెనక ఇంటికొచ్చింది. ఇవ్వేమీ అర్ధం కానీ విమల్......
    "మీ డాడీ సిటీ కొచ్చారని నాకెందుకు చెప్పలేదు."
    "చెప్పలేదు......అయితే ఎవైందంట."
    "ఆయనకి నా ఫోన్ నెంబరెలా తెల్సింది. మీ డాడీ అని నాకు ముందు తెలిస్తే, మన విషయం ఫోన్లోనే చెప్పేసి ఉండేవాడ్ని."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS