స్వామి లేచి వీధి తలుపు వేశాడు. వచ్చి కరుణ చేయి పట్టుకుని మేడమీదకు దారి తీశాడు. కరుణ అతన్ననుసరించింది ఇద్దరూ పడకగదిలోకి వెళ్ళారు.
పరినిమిషాలు గడిచేక --"ఐ లవ్ యూ...." అంది కరుణ.
"చూడు కరుణా యిప్పుడు నీకేం కావాలో అడుగు. ఇలా పడుకుని కబుర్లు చెప్పుకుంటే ఎన్నయినా ఎంతసేపయినా చెప్పగలను నేను" అన్నాడు స్వామి.
"నాకేమీ అక్కర్లేదు. నువ్వే కావాలి --" అంది కరుణ.
'పరిశోధనలాంటే ఆసక్తి వుండన్నావు --" అన్నాడు స్వామి.
'అవుననుకో కానీ ఆ కబుర్లు ఇలాంటి చనువున్న వారి దగ్గర చెప్పుకోనవసరం లేదు" అంది కరుణ.
ఆమె నెమ్మదిగా తన బాధ చెప్పుకుంది. భర్త నన్ను నిర్లక్ష్యం చేస్తున్న కారణంగా మగతోడు కోసం ఆమె తపించి పోతోంది. సావిత్రితో పరిచయాన్ని శేఖరాన్ని దృష్టిలో వుంచుకుని పెంచుకుంది. కానీ శేఖరం ఈమె ఉనికి నే గమనించలేదు. స్వామి ఆమెకు దేవుడిచ్చిన వరం లాగ వచ్చేడు.
"శేఖరం చాలా గొప్ప సైంటిస్టు" అన్నాడు స్వామి హటాత్తుగా. 'అతని దృష్టంతా సైన్సు మీదనూ పరిశోధనల మీదనూ వుంటుంది. భార్య ప్రోత్సాహం మీద ఉద్యోగం మానేశాక అతనికి మతి చలించినట్లుంది .'
'శేఖరం గొప్ప సైంటిస్టని ఎందుకనుకుంటున్నావ్?" అంది కరుణ.
'లేబరేటరీ లో అతని పోస్టులోనే నేను చేరాను. అతని ప్రయోగాలు వివరాలన్నీ చూశాను. అతను ప్రయోగాలు చేసే పద్దతి ఫలితాలతను అర్ధం చేసుకునే పద్దతి వాటిని బట్టి అతను చేసే కొత్త పధకాలు అన్నీ అతని ప్రత్యేకతలు, నా ప్రయోగాలు అతని అడుగు జాడల్లోనే నడపదల్చుకున్నాను...." అని క్షణం ఆగి "అతని అబ్జర్వేషన్ నోట్ బుక్ లో ఆఖరు సారిగా అతను వ్రాసిందాన్ని బట్టి వాతావరణాన్ని శాసించే ప్రయోగాల నాతను అనుకోకుండా చేసినట్టు అర్ధమవుతోంది. ఇదేవ్వరికీ తెలియదు, నేనూ అతని ఫీల్డువాడినే కాబట్టి నాకర్ధమైంది" అన్నాడు స్వామి.
కరుణ ఆశ్చర్యంగా స్వామి వంక చూసి "అది సాధ్యమా?" అంది.
"సాధ్యమో కాదో నాకు తెలియదు. రేపే మొదలు పెట్టి చూస్తాను" అన్నాడు స్వామి.
9
"మిస్టర్ స్వామీ!" అన్నాడతను.
'డాక్టర్ స్వామి" సవరించాడు స్వామి.
"అయాం సారీ డాక్టర్ స్వామి మీతో చిన్న పనుంది" అన్నాడతను.
"మీరెవరో తెలుసుకోవచ్చా?"
"నేనెవరో మీకనవసరం. నన్ను మీ శ్రేయోభిలాషిగా గుర్తుంచుకోండి చాలు."
"నా శ్రేయస్సు నేనుచూసుకోగలను. వేరే శ్రేయోభిలాషులు అవసరం నాకు లేదు" అన్నాడు స్వామి.
అతను తన అరచేతిని స్వామి ముందు చూపించాడు. స్వామి ఆశ్చర్యంగా అతని వంక చూశాడు. ఆ అరచేతిలో అందాల సుందరి ఫోటో వుంది" "మీరు నాతొ వస్తే తిన్నగా ఈ అమ్మాయున్న యింటికి వెడదాం. ఆమెను మీకు పరిచయం చేసి నాదారిన నేను వెడతాను" అన్నాడతను.
"మీ ఉద్దేశ్యమేమిటో నాకర్ధం కాలేదు కానీ మీతో రావడానికి నాకభ్యంతరం లేదు. అయితే ముందుగా మీకో విషయం చెప్పడం నా బాధ్యత గా భావిస్తున్నాను. సెక్సు నా బలహీనత. ఆడపిల్లతో నాకేకాంతం కల్పిస్తే ఆపైన నేనేం చేస్తానో నాకే తెలియదు. అటు పైన మీ యిష్టం" అన్నాడు స్వామి.
అతను మాట్లాడకుండా ఫోటో జేబులోకి పోనిచ్చి స్వామి చేయి పట్టుకుని రెండడుగులు ముందుకు వేసి రిక్షాను పిలిచి బెరమాడాడు. స్వామి కూడా రిక్షా ఎక్కాడు. రిక్షా ఒకింటి ముందు అగేక స్వామితో 'అదిగో ఆ ఇల్లే అందులోకి వెళ్ళండి మీ సరదా తీర్తుంది. నా పనీ అవుతుంది" అన్నాడు.
"జేబులో డబ్బట్టే లేదు. సరదా తీర్చుకుందుకు డబ్బివ్వలెను" అన్నాడు స్వామి అనుమానంగా.
అతను నవ్వి "మిస్టర్ స్వామీ...." అని ఏదో చెప్పబోయాడు.
'డాక్టర్ స్వామి" స్వామి సవరించాడు.
'సారీ డాక్టర్ స్వామీ నేను మీకు డబ్బు లభించే పనే కానీ డబ్బు ఖర్చయ్యే పని చెప్పను." అని "ఇక వెళ్ళండి నాకింకో చోట పనుంది" అన్నాడు.
స్వామి రిక్షా దిగి ఆ యింట్లోకి వెళ్ళాడు. తలుపులు పూర్తిగా వేసి లేవు. అతను తోశాడు.
సోఫా కమ్ బెడ్ మీద పడుకున్న ఓ యువతి చటుక్కున లేచి కూర్చుంది. ఆమె బికినీలో ఉంది. స్వామి ఆమెను చూస్తూనే ఆవేశ పడ్డాడు.
"ఎవరు మీరు?" అందామె.
"డాక్టర్ స్వామి" అన్నాడతను.
"ఓహ్! మీరు సైంటిస్టు కదూ?" అంటూ ఆమె పరుగున అతన్ని సమీపించి అతని చేయి పట్టుకుని 'సైంటిస్టు అంటే నాకు చాలా యిష్టం" అంది.
"నువ్వు వేశ్యవా?" అన్నాడు స్వామి.
"కాదు, నాకు డబ్బుంది. వెరైటీ కావాలి. ఇష్టమైన మగవాళ్ళని రాప్పించుకుంటూ వుంటాను. నేనే డబ్బు ఇస్తాను. సైంటిస్టులైతే నాకు చాలా ఇష్టం" అందామె.
'అయితే నేనిప్పుడు మగ వేశ్యనవుతానన్నమాట" అన్నాడు స్వామి.
"నేనంటే మీ కిష్టం లేనప్పుడు మీరు మగ వేశ్యఔతారు. నా అభిప్రాయంలో మగ వాళ్ళేన్నటికి వేశ్యలే కాలేరు. ఎందుకంటె అందమైన ఆడది పిలిచిందంటే సంతోషంగా వాళ్ళు సిద్దపడతారు. ఆడదాని సంగతలా కాదు. డబ్బు కోసం ఇష్టమున్నా లేకపోయినా ఒళ్లమ్ముకుంటుంది" అందామె.
ఒక పావుగంట అనంతరం సోఫా కమ్ బెడ్ మీద తన పక్కనే ఉన్న ఆ అమ్మాయితో "నీ పేరు కూడా తెలుసుకోలేదు -- చెబుతావా?" అన్నాడు.
"రమణీ" అని నవ్విందామే. "మీలాంటి ఆవేశపరుణ్ణి నేనింతవరకూ చూడలేదు. మీరు నాకు నచ్చారు. మీకు వెయ్యి రూపాయలు బహుమతిగా ఇస్తే తీసుకుంటారా?" అంది.
"ఎందుకు తీసుకొను? అందరాడవాళ్ళూ నీలా డబ్బు తీసుకోరని గ్యారంటీ ఏమిటి? ఇచ్చిన చోట రాబట్టుకోవడం అవసరమైన చోట ఖర్చు పెట్టడం -- ఇదీ నా పద్దతి. రాబడైనా , ఖర్చయినా నాకు ఆడవాళ్ళ మూలంగా నే" అన్నాడు స్వామి.
"కానీ మీరు నాకు మీ గురించి చెప్పాలి. మీరు లాబరేటరీ లో ఏమేం చేస్తారో , ఏయే పరిశోధనలు చేస్తున్నారో....'
రమణిని మధ్యలో ఆపి "ఇటీవల ఆడవాళ్ళందరికీ శాస్త్ర పరిశోధనల మీద ఆసక్తి మళ్ళుతోంది! కారణమేమిటి?' అన్నాడు స్వామి.
రమణి తడబడింది. "ఏముంది? సైన్సు సాధించిన ప్రగతిలో ఆడవాళ్ళ దృష్టి సైంటిస్టు మీద మళ్ళింది. కాస్త తెలివైన అడదేప్పుడూ నూతనత్వాన్ని కోరుతుంది. మిగతా వాళ్ళంతా ఎప్పుడూ పాత వాసనా కొట్టే కవిత్వాలు అంగాంగ వర్ణన లూ తప్ప -- ఇంకేమీ చెప్పలేరు. ఈ సృష్టి రహస్యాన్ని భేదిస్తూ -- సృష్టి తీరునే మార్చగల సైంటిస్టుల పరిశోధనలు వినడానికి నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి."
స్వామి ముఖంలో గర్వం కనిపించింది. 'అలాంటి పరిశోధనే నేనొకటి చేస్తున్నాను. పూర్వం శేఖరం అనే సైంటిస్టు -- కొన్ని ప్రయోగాలు చేసి ఆపేశాడు. ఆ తర్వాత అతను ద్యోగమే మానేసి ఒకసారి ప్రధానమంత్రి మీదనేచేయి చేసుకోబోయి పోలీసుల పాలయ్యాడు. చాలా కఠిన శిక్షల నతనూ, అతని భార్య అనుభవిస్తున్నాని విన్నాను. ఆ ప్రయోగాల నిప్పుడు నేను మళ్ళీ కొనసాగించెను. వాతావరణంలో హటాత్తుగా మార్పులు తీసుకురావచ్చు. కోరినప్పుడు కోరినంత వర్షం కురిపించవచ్చు. నా ప్రయోగాలు విజయవంతం కాబోతున్నాయి."'
రమణి నవ్వి "శేఖరం ప్రయోగాలు మధ్యలో ఆపేశానంటున్నారు ఎందుకో తెలుసా?"
"నీకు తెలుసా?" అన్నాడు స్వామి.
"ప్రకృతి శక్తి స్వరూపిణి , దానిని తన చెప్పు చేతుల్లోకి తీసుకోవాలను కునే మనిషి సర్వనాశనమైపోతాడు" అంది రమణి.
"బాగుంది , మరి సైంటిస్టున్నదేందుకు?"
"ఎందుకా? సృష్టి రహష్యాన్నర్ధం చేసుకుని జీవితాన్ని బాగు చేసుకోవడానికి తప్పితే సృష్టి క్రమాన్ని మార్చడానికి ప్రయత్నించరాదు. ఇలాంటి ప్రయోగాలు చేయడం కన్నా ఊరుకుంటే ఉత్తమం."
'అందమైన ఆడపిల్లల్ని అర్ధ నగ్నంగా చూసినప్పుడల్లా అర్ధవంతమైన ప్రయోగమున్నదని తెలుసినప్పుడూ ఊరుకోవడం సాధ్యం కాదు" అన్నాడు స్వామి.
'కానీ ఊరుకోవాలి, తప్పదు!"
ఈ మాటలు రమణివి కాదు. రిక్షాలో తనను దిగబెట్టి నతనివి.
స్వామి నవ్వి "మీరా?' అన్నాడు.
"అవును మిస్టర్...."
"డాక్టర్....." అందించాడు స్వామి.
"ఎస్, డాక్టర్ స్వామి ! మీరు మీ ప్రయోగాలు మానుకోవాలి. మానుకుంటే మీకు ఐదు లక్షల రూపాయలు లభిస్తుంది. ఉద్యోగం మానేయవచ్చు. కోరినప్పుడల్లా మీకే ఎడురిచ్చే అందాల పడతులు దొరుకుతారు...."
