"ఎందుకలా కోపం.....అంత కోపం కూడదు పాపా....."
"ఇది కోపం కాదు బాబూ......ప్రేమ.......అంతే."
సముద్రపు అలలమీద వెన్నెల పాము పడగల్లా కదులుతోంది.
అయిదు నిమిషాల సేపు ఇద్దరి మధ్యా మౌనం.
"వెళ్దామా......" తనే లేస్తూ అంది కృష్ణ వందన.
"కాసేపు కూచుందాం."
"వద్దు.....నువ్విలా పిచ్చి పిచ్చిగా వాగుతావు. నేనేమో రేచ్చిపోతాను."
ఇద్దరూ లేచి రోడ్డు మీద కొచ్చారు. కారేక్కారు. పాండిచ్చేరి కొచ్చారు. హోటల్లో తన రూమ్ లో కేల్తూ గుడ్ నైట్ మాత్రం చెప్పేసి వెళ్ళిపోయింది మరేం మాట్లడకుండా.
ఆ రోజు రాత్రి చాలాసేపు కృష్ణవందన మనస్తత్వం గురించే ఆలోచించాడు విమల్.
అలా రియల్ ఎఫెక్షన్ తో ప్రేమించే మనిషే తనక్కావాలి. కృష్ణ వందన తన స్వంతం కావాలి! డాడీతో ఈ విషయం చెప్పాలి. నిశ్చయించుకున్నాడు విమల్.
-----వారం రోజుల తర్వాత షూటింగ్ స్పాట్ కి అర్జంట్ మెసేజ్ వస్తే కృష్ణ వందన వెళ్ళిపోయింది. అప్పటికి కృష్ణవందన మీద సీన్లు అయిపోయాయి.
డాడీ వచ్చారని విమల్ తో చెప్దామనుకుంది. కానీ డాడీతో ముందుగా మాట్లాడి, తర్వాత విమల్ ని పరిచయం చెయ్యాలనుకుంది. కృష్ణవందన తండ్రి, జే. ఆర్. రావు, ఏదో బిజినెస్ పనిమీద బొంబాయి వచ్చాడు. కూతుర్ని చూడటానికి మాత్రమే మద్రాసు వచ్చాడు. ఓ గంట తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాడు.
డాడీని చూసి ఎనిమిది నెలల పైగా అయింది. అప్పటికీ, ఇప్పటికీ ఎంతో మార్పు.
"హౌ ఆర్యు మై డియర్ చైల్డ్......" అభిమానంగా పలకరించాడు జే. ఆర్ . రావు కూతుర్ని.
"ఆయామ్ అల్ రైట్ డాడీ .....చెల్లెలూ, తమ్ముడు అందరూ బాగున్నారు కదా!"
"వాళ్ళిద్దర్నీ ఎప్పుడూ అడుగుతావు కానీ....పిన్నీ నెప్పుడూ అడగవు.....పిన్నికి మాత్రం నువ్వంటే ఎంతో ప్రేమ.....నిన్ను నాతొ వచ్చినప్పుడు తీసుకొచ్చేయ్యమని చెప్పింది...ఆక్కడేదో మంచి సంబంధం ఉందట.....బైదిబై ....ఈ మధ్య నువ్వు యాక్టు చేసిన ఏదో సినిమా ,,,,,న్యూయార్క్ కి వచ్చింది. తెలుగు అసోసియేషన్ , ఫంక్షన్లో కొన్ని తెలుగు సినిమాలు వేసార్లె....పిన్నీ, నీ సిస్టరూ, బ్రదర్ అందరూ వెళ్ళారు. నే నా సమయంలో జపాన్లో ఉన్నాను.....వాళ్ళెంత మురిసిపోయారనుకున్నావ్, నీకు ఫోన్ కూడా చేసారు. నువ్వా సమయంలో మద్రాసులో లేవట!" చెప్పుకుపోతున్నాడు తండ్రి.
నిశ్శబ్దంగా తండ్రి మాటల్ని వింటోంది కృష్ణ వందన.
"నువ్వు సినిమాల్లో యాక్ట్ చేసి, ఏం చేస్తావ్.....డబ్బు కోసమేనా.....మన దగ్గర కావలసినంత డబ్బుంది వచ్చేయ్ . ఇప్పుడు నేను ఎంత ఎంఫైర్ ని బిల్డప్ చేసానో తెలుసా? నా తర్వాత నా వారసురాలివి నువ్వే, నీ అందంతో, నీ ప్రతిభతో, నీ తెలివి తేటల్తో, మన బిజినెస్సులన్నీ రెట్టింపవుతాయని నాకు తెలుసు. వచ్చేయ్యమ్మా------నా బిజినెస్ పార్టనర్స్ లో ఇద్దరూ ముగ్గురూ మంచి కుర్రాళ్ళున్నారు. కోటీశ్వరులు -----పెళ్ళి చేసుకో .......నేను బతికుండగా , మనవళ్ళను చూసుకునే అదృష్టం నాకు లేదా అమ్మా!"
అనుకోకుండా సందర్భం వచ్చింది కాబట్టి , విమల్ గురించి మాట్లాడడానికి ఇదే మంచి సమయం ఇప్పుడే మాట్లాడాలి. అని నిశ్చయించుకుంది కృష్ణ వందన.
"నేనో అబ్బాయిని ప్రేమిస్తున్నా డాడీ! ఆయన్ని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను, ఆ విషయం మాట్లాడాలని ఫోన్ చేద్దామనుకున్నాను మీరే వచ్చారు."
\ అంతవరకూ ఏకధాటిగా మాట్లాడిన జె. ఆర్, రావు , అకస్మాత్తుగా కూతురు ఆ విషయం చెప్పేసరికి ఆలోచనలో పడ్డాడు. కూతురు మనస్తత్వం జె. ఆర్. రావుకి బాగా తెలుసు.చెప్పాల్సిన విషయం , స్పష్టంగా, డొంక తిరుగుడు లేకుండా చెప్తుంది. తల్లి దగ్గర్నుంచి వచ్చిన గుణమది.
కృష్ణ వందన మాటలు వింటుంటే, వందన తల్లి, తన మొదటి భార్య రేణుక గుర్తొస్తుంది.
"అతనేం చేస్తాడు ......"
"సినిమా హీరో......"
"నాకు ప్రేమ పెళ్ళిళ్ళ మీద నమ్మకం లేదని నీకు తెలుసు......అందులోనూ సినిమా వాళ్ళ ప్రేమలూ.....ఆ లవ్ ఆర్ట్ ఫిషియల్ మొరల్స్ రేస్ లవ్.....నువ్వు చాలా సెన్సిటివ్ , రేపు నీ పెళ్ళి తర్వాత, ఏవైనా పొరపోచ్చాలోస్తే.......ఇలా అంటున్నానని ఏమనుకోకు......"
"లేదు డాడీ.....నాకు ఆయన మీద నమ్మకం ఉంది. విమల్ గ్రేట్ ఫామిలికి చెందిన వ్యక్తీ.....జయేంద్ర గురించి రుక్మిణి గురించి చెప్పింది కృష్ణ వందన.
"నిజమేనమ్మా......తల్లి తండ్రులు గొప్పవాళ్ళింనంత మాత్రాన పిల్లలు గొప్ప వాళ్ళు కావాలనే రూలేం లేదు గదమ్మా. నీ జీవితంలోకి విమల్ కాదు, ఇంకో వ్యక్తేవరు ప్రవేశించినా , నాకేం పర్వాలేదు. ఎందుకంటే నాబెంగ నీ గురించే."
"నాకు నా మీద అపారమైన నమ్మకం వుంది డాడీ.......నేనెప్పుడూ ఓడిపోను. నాకా నమ్మకం ఉంది డాడీ."
"ప్రతీ ప్రేమా......నమ్మకాలతోనే స్టార్ట్ అవుతుందమ్మా .......అప నమ్మకాలతో బ్రేక్ అవుతుంది."
డోంట్ డిస్కరేజ్ మీ డాడీ."
ఆ మాట అంటున్న కూతురి వేపు సాలోచనగా చూసాడు అయన.
"విమల్ ని నువ్వు పెళ్ళి చేసుకున్నాక, అప్పుడు ఇద్దరూ కల్సి సినిమాల్లో యాక్ట్ చేస్తారా....నువ్వు విమల్ ని పెళ్ళి చేసుకో...నేనేప్పుకుంటాను.....కానీ పెళ్ళయ్యాక విమల్, నువ్వూ న్యూయార్క్ వచ్చెయ్యాలి. ఈ సినిమాలన్నీ వదిలెయ్యాలి." అ మాట తండ్రి ఎందుకంటున్నడో కృష్ణవందనకు అర్ధం కాలేదు.
