Previous Page Next Page 
డాళింగ్ పేజి 58

 

    "ఏం లేదు . మన ప్రపంచం, మనం బ్రతుకుతున్న ప్రపంచం గురించి ."
    "మన గురించి ఆలోచించడం మానేసావా!"
    "మన గురించి ఆలోచించడానికి టైం లేకుండా చేస్తున్న మన సినిమా ప్రపంచం నుంచి దూరంగా , దూరంగా వెళ్ళిపోవా\లనుంది."\
    "వెళ్ళిపోయి......"
    "నువ్వూ.... నేనూ.....హాయిగా .......బతకలేమా ఈ సినిమా ప్రపంచం నుంచి బయటపడి, మనదైన లోకంలో హాయిగా బతుకుదాం......."అన్నాడు విమల్.
    "లేదు .....విమల్ ......సినిమా ఒక ప్రొఫెషన్....పెళ్ళికి దానికీ సంబంధం లేదు......చనిపోయే వరకూ సినిమాల్లో నటించాలని నాకుంది" అన్నది కృష్ణవందన.
    "మీ డాడీ న్యూయార్క్ నుంచి ఎప్పుడోస్తారు? మన పెళ్ళి విషయం మాట్లాడతాను." నెమ్మదిగా అన్నాడు విమల్.
    'అయితే అయినట్టే.....మా డాడీ ఎంత బిజీయో నీకు తెలీదు. ఎప్పుడో రెండు నెలల కొకసారీ వస్తారు, బిజినెస్ ట్రిప్ లో భాగంగా నాతో గంటసేపు గడిపి వెళ్ళిపోతారు. మా డాడీతో మాట్లాడ్డం కాదు....ముందు మీ డాడీతో మాట్లాడు......"
    "మా డాడీ , నాకు పెద్ద ప్రాబ్లం కాదు.....హి నెవర్ అబ్జెక్ట్ మి మీ డాడీ ఎంత బిజియో.....మా డాడీ అంతే బిజీ అయిపోయారు......నీకు తెల్సు కదా......అయన ఇప్పుడు ఏమ్ .పి .దానికి తోడు మా మమ్మీ పేరు మీద కాన్సర్ హాస్పిటల్ నిర్మాణం అయన జీవిత ధ్యేయం. ఆ పనిలో బిజీగా వున్నారాయన....."
    "అర్జంటుగా మన పెళ్ళి అవసరమా......" కృష్ణవందన ప్రశ్న వేసింది.
    "నీ కర్జెంటు కాదేమో ......నా కర్జంట్ .....ఎందుకంటే ...ఈ లోపల మీ డాడీ ఏ అమెరికన్ నో తెచ్చి చూపెడితే......"
    "నెవర్ .......న ఇష్టానికి వ్యతిరేకంగా మా డాడీ ఏం చెయ్యరు.....ఎందుకంటే నా మనస్తత్వం గురించి మా డాడీకి తెల్సు కాబట్టి......" చెప్పింది కృష్ణ వందన.
    "మీ డాడీ మన పెళ్ళికి అభ్యంతరం పెడితే......"
    "నో ......నాటేటాల్ సింపిల్ గా నీతో వచ్చేస్తాను.....ఆమాత్రం గేట్స్ ఉన్నాయి నాకు....ప్ర్రేమ మీద పెళ్ళి మీద నాక్కొన్ని ఖచ్చితమైన అభిప్రాయలున్నాయి.
    నేను ప్రతి విషయంలోనూ ఎక్స్త్రీమ్ నే. చిన్నప్పటి నుంచి అంతే మా మమ్మీ ఏక్సిడెంట్ లో చనిపోయాక, మా డాడీ మళ్ళీ పెళ్ళి చేసుకున్నారు. పిన్ని కూడా మంచిదే. కానీ పిన్నిని మమ్మీలా చూడలేకపోయాను. హైస్కూల్ లో చదువుతున్నప్పుడు హలీడేస్ లో కూడా ఇంటికి వెళ్ళే దాన్ని కాదు.
    ఒకసారి మా పిన్నే స్వయంగా , నన్ను తీసికెళ్ళడానికి వచ్చింది నేను రానని చెప్పాను.
    ఎందుకు రావని అడిగింది.
    నువ్వంటే నా కసహ్యమని చెప్పాను....
    చాలా బాధపడింది , ఏడ్చింది.
    డాడీ మీద కూడా నాకదే కోపం, ఒక రకంగా అలా ప్రవర్తించే వాళ్ళందరి మీద నాక్కోపం. మమ్మీ బతికున్న వరకూ మమ్మీని ప్రేమించే డాడీ, మమ్మీ చనిపోగానే, ఇంకొక వ్యక్తిని అదే విధంగా ఎలా ప్రేమిస్తాడో .....నాకేం అర్ధం కాదు.....
    కొంతమంది భార్య బతికుండగానే, ఇంకొక వ్యక్తిని ప్రేమిస్తారు. భార్యను ఏదో లోపంతో వెక్కిరించి , ఇంకో ఆడదాని కోసం పరుగులు తీస్తారు......అదెలా సాధ్యం?
    అలాంటి వాళ్ళని షూట్ చెయ్యాలి.
    ప్రేమంటే , ఏ భేషజాలు, ఏ అడ్డంకులూ, ఏ అరలూ, తెరలూ లేకుండా, కల్సి ఉండడం ......అంతే తప్ప, అవసరాన్ని తీర్చుకున్నాక మనసు మార్చుకోవడం కాదు గదా!
    ప్రేమంటే చాలామంది ఆకర్షణ అనుకుంటారు. కాదని నా ఉద్దేశ్యం. ఆకర్షణతోనే ప్రేమ ప్రారంభమౌతుంది ------ పెళ్ళితో ముదిపడుతుంది. ప్రేమంటే శారీరక ఆకర్షణ కాదు- మానసికమైన ఆకర్షణ. అది నిరంతరం ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఉండాలి.
    ఫర్ ఎగ్జాంపుల్ . మనం పెళ్ళి చేసుకుంటాం. కొన్నాళ్ళయ్యాక మీకు గానీ, నాకు గానీ ఏదో ఏక్సిడెంట్ జరుగుతుంది ......లేకపోతే ఏదో జబ్బు పడతాం. అంతామత్రానా ....ఒకర్నొకరు కాదనుకుంటామా.....నన్నిడిచి నువ్వెళ్ళగలవా? నిన్నిడిచి నేనెళ్ళగలనా? చెప్పు. స్వార్ధమే ప్రేమా....చెప్పు. అలాంటప్పుడు మన వయోలెంట్ ఫాషన్...టెండర్ ఎఫెక్షన్ లకు అర్ధమేమిటి చెప్పు...." చాలా ఉద్వేగంగా చెప్తూ ఆగింది కృష్ణవందన.\
    "ప్రేమ పట్ల నీ అంత సిన్సియారిటీ ఉండేవాళ్ళే ప్రపంచం నిండా వుంటే , ఈ ప్రపంచం ఇలా ఉండేది కాదేమో ---ఇన్ని ఘోరాలు జరిగేవి కాదేమో .....ఇలాంటి ఒపీనియన్ ఉన్న నీలాంటి అమ్మాయిని , నాలాంటి వాడెవడైనా మోసం చేసాడనుకో......వాడిక చస్తాడెమో." జోగ్గా అన్నాడు విమల్.
    ఆ మాటకు సూటిగా చూసింది క్రుష వందన. అలలమీద పడిన వెన్నెల కాంతి, ఆ సమయంలో చటుక్కున ఆమె కనుగుడ్ల మీద పడి ప్రతిఫలించింది.
    ఆ కళ్ళు అపుడు, అడ తాచు వేడి కనుల్లా వాడిగా ఉన్నాయి.
    "నీలాంటి వాడా ---నువ్వా......." సూటిగా అడిగింది.
    "ఏదో సరదా కన్నా ---సీరియస్ గా తీసుకోకు వందనా?"
    "నేనూ సరదాగానే చెప్తున్నా ----విను .....నువ్వే నన్ను మోసం చేశావనుకో ...మోసం వరకూ ఎందుకు -----నన్ను పెళ్ళి చేసుకున్నాక ఇంకొక అమ్మాయితో స్నేహం చేసావనుకో..... అది నాకు తెల్సిందనుకో .......అంతే .....నీ పని సఫా.....నిన్ను బతకకుండా చావకుండా చేస్తాను. టార్చర్ చేస్తాను...బ్లడ్ నకింగ్ అంటారు చూడు .....అల క్షణ .....క్షణం.ఎక్కడున్నా, ఎంత తప్పించుకో జూసినా...అంతం చూస్తాను .....అర్ధమైందా....' కోపంగా అన్నదా మాటలు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS