Previous Page Next Page 
వసుంధర కథలు-14 పేజి 58

 

    ఆలోచిస్తూ కూర్చోడానికి వ్యవధి లేదు. అయన రోడ్డు మీదకు వచ్చి కవరు చింపాడు. శుభలేఖ తనకు సంబంధించినది కాదు. అందులో వేరే వుత్తరం వుంది. తనెలా బయలుదేరాలో వ్రాసి వుంది. కారెక్కొద్దు -- నడిచే బయలుదేరు అని వ్రాసి వుంది అందులో.
    రామనాధం ఉత్తరంలో చెప్పిన ప్రకారం నడిచాడు. సందులు గొందులు తిరిగాడు. అయన ఓ ఇరుకు సందులోకి దూరగానే వెనుక నుంచి ఓ మనిషి వున్నట్లుండి ముంకుకు వచ్చి నిలబడి -- "డబ్బిలా ఇవ్వు...." అన్నాడు.
    అతడు సన్నగా , పొడుగ్గా వున్నాడు. ఖరీదయిన బట్టలు ధరించి వున్నాడు. ముఖం సరిగ్గా కనిపించడం లేదు. రుమాలు అడ్డంగా కట్టుకున్నాడు. కళ్ళు మాత్రం మెరుస్తున్నాయి. ఆ కళ్ళలో చురుకుదనం వుంది.
    "ఎవరు నువ్వు!" అన్నాడు రామనాధం.
    "డబ్బు...." అన్నాడతడు.
    రామనాధం జేబులోంచి నోట్ల కట్టలు తీసి అతడి కిచ్చాడు.
    బ్లాక్ మెయిలర్ డబ్బు లెక్క పెట్టుకున్నాడు. "గుడ్ !' అన్నాడు.
    "ఎవరు నువ్వు ?" అన్నాడు రామనాధం.    
    "డబ్బు సరిపోయింది . రేపు సాయంత్రానికి మీ అమ్మాయి ఇల్లు చేరుకుంటుంది --....' అన్నాడు బ్లాక్ మెయిలర్.
    "నువ్వెవరని అడుగుతున్నాను?" రామానాధం రెట్టించాడు.
    "వ్యాపారస్తుడిని. నేనీ ప్రశ్నకు బడులిస్తానో యివ్వనో తెలియకే అడుగుతున్నావా?"
    "నా కూతుర్నేందుకు కిడ్నాప్ చేశావు?"
    "డబ్బు కోసం...."
    "దానికేమీ హాని జరగడం నా కిష్టం లేదు...."
    "నా వల్ల ఆమెకు ఎటువంటి హాని జరుగదు. ఇది నా హామీ --"
    "నువ్వు నీ హామీ నిలబెట్టుకున్నదీ లేనిదీ రేపు అమ్మాయి చెబుతుంది...." అని ఉలిక్కిపడి --' అవును ....నేనిప్పుడే డబ్బు ఇచ్చేసే నువ్వు అమ్మాయిని రేపటి దాకా ఎందుకుంచుకుంటావు?" ఇప్పుడే వదిలి పెట్టు ...." అన్నాడు రామనాధం.
    "అది నా వల్ల కాదు. అందుకు కారణం మీ అమ్మాయి చెబుతుంది రేపు...." అన్నాడతను.
    "ఏమిటా కారణం ?"
    "అధిక ప్రసంగం వద్దు...." అంటూ క్షణాల మీద అతడక్కడి నుంచి మాయమయ్యాడు.
    రామనాధం కొద్దిసేపు అక్కడే వుండి పోయాడు. కూతురి కోసం రేపటి దాకా ఆగాలంటే అయన మనసెందుకో కీడును శంకిస్తోంది. ఎలాగో అలా ఆ కిడ్నాపర్ గురించి అరా తీయాలను కున్నాడు.
    అయన నడుచుకుంటూ బ్యాంకుకు వెళ్ళాడు. ఫలానా బ్యాంకులో కార్డులు సంచి పెట్టడానికి వెళ్ళిందేవరోనని వాకబు చేశాడు. అతడి పేరు సుదర్శనరావని తెలిసింది. సుదర్శనరావు కాలేజీ స్టూడెంటు.
    రామనాధం కాలేజీకి వెళ్ళి సుదర్శనరావు ను కలుసుకున్నాడు. అతడిలో కిడ్నాపర్ లక్షణాలు కనబడలేదు. మనిషి పొట్టిగా వున్నాడు. కళ్ళలో మేరుపైనా లేదు.
    రామనాధం తన్ను తానూ పరిచయం చేసుకుని -- "నీకు నేను తెలుసా ?' అనడిగాడు.
    "తెలియదండి " అన్నాడతను వినయంగా.
    "బ్యాంకులో ఫ్యూనుకు పెళ్ళి శుభలేఖలిచ్చింది నువ్వేనా?"
    అతడు క్షణం తడబడి -- "మా కాలేజీ బస్సు వచ్చేస్తోంది. అది మిస్సయి పోవాలనే అనుకున్నాను. కానీ బస్ స్టాపులో ఒకతను ఆ శుభలేఖలు తనిస్తానన్నాడు. అందులో కొంప ములిగేదేముంది ? బ్యాంకులో ఫ్యూన్ కివ్వడమే గదా. అందుకని అతడికే ఇచ్చేశాను" అన్నాడు.
    'అసలు నువ్వు తిన్నగా బ్యాంకుకు వెళ్ళకుండా బస్ స్టాపు లో ఎందుకున్నావు?" అన్నాడు రామనాధం.
    "అక్కడ నా ఫ్రెండ్ కనిపించిందండి ....అదే అదే కనబడ్డాడండి."
    రామనాధం సుదర్శనరావును వదిలిపెట్టాడు.
    సుదర్శనరావు కిచ్చారు పెళ్ళి వారు కార్డులు -- బ్యాంకులో ఫ్యూన్ కిమ్మని. బ్యాంకు ఎదురుగా వున్న బస్ స్టాపులో అతడికి తన గర్ల్ ఫ్రెండ్ కనిపించి వుంటుంది. మనసటు లాగింది. బస్సు రాబోగా తామిద్దరూ విదిపోవలసి వచ్చినందుకు అతడికి బాధ కలిగి మనసులోని బాధను పైకి వెలిబుచ్చాడు . అక్కడే వున్నా కిడ్నాపర్ ఆ అవకాశాన్నుపయోహించుకున్నాడు.
    రామనాధం మళ్ళీ బ్యాంకుకు వెళ్ళాడు.
    "నీకు కార్డులిచ్చిన మనిషిని నువ్వు మళ్ళీ గుర్తు పట్టగలవా?" అనడిగాడాయన ప్యూన్ ని.
    "అతడేలాగుంతాడో వర్ణించగలవా ?"
    ఫ్యూన్ వర్ణన తన కేదురుపడిన కిడ్నాపర్ కి సరిపోతోంది.
    'అతడిని కిదివరకేప్పుడైనా చూశావా?"
    "లేదండి --"
    "మళ్ళీ చూస్తె గుర్తు పట్టగలవు కదూ ?" మళ్ళీ అడిగాడాయన.
    "మీరిలా తీసుకురండి. నేనలా గుర్తు పట్టేస్తాను ."
    "చాలా బాగుంది " అనుకున్నాడు రామనాధం. వెనుకటి కేవడో కొండ ఎత్తి వీపు మీద పెడితే తను మోసేస్తానన్నాట్ట.
    రామనాధం షాపుకు వెళ్ళలేదు. ఆయనకు మతి మతిలో లేదు. తిన్నగా ఇంటికే వెళ్ళాడు. ఆ కిడ్నాపర్ కూతుర్ని రేపటి దాకా ఎండుకుంచుకుంటున్నాడు ? వయసొచ్చిన పిల్ల. దాన్నేం చేస్తాడు వాడు!

                                    3
    భార్య భర్తలిద్దరూ ప్రమీల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. గడియారం సాయంత్రం నాలుగు గంటలు కొట్టేసరికి ప్రమీల ఉత్సాహంగా ఇంట్లో అడుగు పెట్టింది. ఆమె ఇంచుమించు గెంతుకుంటూ వస్తోంది.
    ఆమెనలా చూడగానే రామనాధం బాధ సగం తగ్గింది. అరుణ కూతుర్ని పలకరిస్తూ -- "ఎలా వున్నావమ్మా ..."
    "వండ్రపుల్" అంది ప్రమీల.
    రామనాధం ఆశ్చర్యపడ్డాడు. కిడ్నాపర్ దగ్గర్నుంచీ వస్తూ వండ్రపుల్ అంటుందేమిటి? కొంపదీసి కూతురు కిడ్నాపర్ తో కలిసి నాటకమాడ లేదు కదా!
    "వండ్రపుల్ ఏమిటమ్మా ?" అన్నాడాయన.
    "మమ్మీ చెప్పలేదా డాడీ ...." అంది ప్రమీల.
    "ఏమని ?"
    "నా అరకు ట్రిప్ గురించి....
    "ఎవరెవరు వెళ్ళారు ?"
    "నేను, లలితకుమారి....."
    "ఓహ్ ....నువ్వు అరకు వెళ్ళావా? మరి నీ స్నేహితురాలు లలితకుమారి నీకోసం ఎదురు చూసి తానిక్కడే వుండి పోయానందే ?' అన్నాడు రామనాధం.
    "మీరు ...మీరు....లలితకుమారిని కలుసుకున్నారా ?" అంది ప్రమీల తడబడుతూ.
    "అవును. నువ్వు పిక్నిక్ కి వెళ్ళావని ఆమ్మ చెప్పగానే నేను లలితకుమారి ఇంటికి వెళ్ళి అన్నీ వాకబు చేశాను."
    "ఓహ్ --డాడీ -- నా గురించి వాకబు చేయడానికి మీ కింత తీరుబడి ఎక్కడిది?" అంది ప్రమీల ఆశ్చర్యంగా.
    రామనాధం ఆ ప్రశ్నకు దెబ్బ తిన్నాడు. ఆయనకు ఎంత సేపూ వ్యాపారమే తప్పితే ఇంట్లో ఎవరి గురించీ పట్టదు.
    "తీరుబడి ఎక్కడిదో తర్వాత చెబుతాను కానీ -- ఈ రెండ్రోజులూ నువ్వెక్కడున్నావో -- ఏం చేశావో నాకు చెప్పాలి ...." అన్నాడు రామనాధం.
    "చెప్పేస్తాను . మీరు నన్నేమీ అనకూడదు " అంది ప్రమీల.
    "కంగారు పడవలసిందేమీ లేదు కదా..." అన్నాడు రామనాధం కంగారుగా.
    ప్రమీల చెప్పసాగింది.
    ప్రమీల, లలితకుమారి కలిసి పిక్నిక్ వెడదామనుకున్నారు. అందుకు తల్లి ఒప్పుకోదేమోనని భయపడింది ప్రమీల. అందుకని లలితకుమారితో తనకోసం బస్ స్టాండు లో ఎదురు చూసి రాని పక్షంలో రానట్లే అని చెప్పింది. అయితే తల్లి ఈ పిక్నిక్ కార్యక్రమానికి ఒప్పుకుంది. అంతవరకూ బాగానే వుంది.
    ఆ రాత్రి ప్రమీల తన ఇంకో మిత్ర బృందాన్ని కలుసుకుంది. అదంతా కాస్త హైసర్కిల్! మర్నాటికి వాళ్ళింకో ప్రోగ్రాం వేశారు.
    ఒరిస్సాలో వరదలోచ్చాయి. ఆ సందర్భంగా కొందరు పాత బట్టలు, ఆహార పదార్ధాలు సేకరించారు. అవసరంలో ఉన్నవారికి వాటిని స్వయంగా పంచి పెట్టాలను కుంటున్నారు. మొత్తం పదిహేనుగురు వలంటీర్లు. అందులో పదిమంది మగవాళ్ళు. అయిదుగురు ఆడవాళ్ళు. ప్రమీలను కూడా వలంటీర్లలో లెక్క వేశారు.
    "నేను రాను. మా యింట్లో ఒప్పుకోరు" అంది ప్రమీల.
    "నీకులా చాలామంది అన్నారు. ఇది తప్పించుకుందుకో ఉపాయం కూడా వుంది --" అన్నాడు వాలంటీర్ల నాయకుడు శేఖర్.
    "ఏమిటది ?"
    "మనలో డబ్బు కెవరికీ లోటు లేదు. అందువల్ల వాలంటీర్లుగా రానివాళ్ళకు అయిదు వేలు జరిమానా, వరద బాధితుల సహాయ నిధికి అయిదు వేలు చందా ఇచ్చినా సరే - లేదా మాతో వాలంటీరుగా వచ్చినా సరే ....' అన్నాడు శేఖర్.
    ప్రమీలకు తెలుసు. ఇలాంటి విషయాల్లో తండ్రి పీనాసి అని. అందుకోసం ఆమె వాలంటీరుగా వెళ్ళాలనే నిశ్చయించుకుంది.
    "ఆ విషయం మీ అమ్మకు చెప్పొచ్చుగా ...." అన్నాడు రామనాధం కాస్త కోపంగానే.
    "అరకు లోయకు పిక్నిక్ అంటే ఒప్పుకుంటుంది గానీ వరద బాధితుల సహాయానికి వెడతానంటే అమ్మ ఒప్పుకుంటుందా ?" అంది ప్రమీల.
    ఉన్నట్లుండి రామనాధానికో అనుమానం వచ్చింది -- "అసలు నువ్వు నిజమే చెబుతున్నావా?"
    "మీరిలా అడుగుతారని నాకు ముందే తెలుసు " అంటూ ఆమె తన హ్యాండ్ బ్యాగు లోంచి కొన్ని ఫోటోలు తీసి  ఇచ్చి --" అక్కడి పరిస్థితి చూస్తె హృదయం ద్రవించి పోతుంది డాడీ -- ఒక్క రోజైనా వాళ్ళ నాదుకుంటే ఎంతో తృప్తి కలుగుతుంది ఎవరికైనా" అంది.
    రామనాధం ఆ ఫోటోలు చూశాడు. ఎందరివో ఆకలి కళ్ళు. వాటి మధ్య అన్నపూర్ణలా ప్రమీల.
    "మీరుమీ ప్రోగ్రాం గురించి ఎక్కడ చర్చించుకున్నారు?"
    "పార్కులో ."
    "అక్కడేవరైనా మీ మాటలు విన్నారా ?"
    ప్రమీల కు ఆ ప్రశ్నలోని అంతరార్ధం తెలియలేదు. అయినా ఆమె గుర్తుచేసుకుని చెప్పింది. ఒకతను వచ్చి - "నేనూ మీ కార్యక్రమంలో చేరవచ్చా" అని అడిగాడు. తమ ప్రోగ్రాం పూర్తిగా తెలుసుకుని వెళ్ళాడు. అతడి వర్ణన కిడ్నాపర్ రూపురేఖలు సరిపోయింది. అంటే వాడు కిడ్నాపింగ్ చేయకుండానే తెలివిగా డబ్బు లాగాడు. తన దగ్గర్నుంచీ తను నిన్ననే కూతుర్ని అప్పగించమంటే -- 'అది నా వల్ల కాదు. కారణం మీ కూతురే రేపు చెబుతుంది ...." అన్నాడు. ఆ మాటల అర్ధం ఇదా?
    తను పూల్ అయ్యాడు.
    'అమ్మాయి అన్నపూర్ణలా వుంది" అంది అరుణ ఫోటోలు చూస్తూ.
    'అవును ...." అన్నాడు రామనాధం అన్యమనస్కంగా.
    "డాడీ నన్ను మెచ్చుకుంటారని నాకు తెలుసు" అంది ప్రమీల.
    "ఎందుకని ?" అంది అరుణ.
    "ఆయనకు అయిదు వేలు అదా చేశానుగా -- వాలంటీరు గా వెళ్ళి!"
    రామనధానికి నవ్వాలో, ఏడవాలో తెలియలేదు .

                                          ***


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS