Previous Page Next Page 
వసుంధర కధలు -9 పేజి 57

 

    "నీ సామర్ధ్యం తెలిసింది గదా . నువ్వు మిడతల దండుకు డబ్బు సంపాదించి పెట్టాలి."
    'అలాగే కానీ ఆడదాని సంపాదన మీద అధారపడ దామనుకుంటున్న మీరు- నేను డబ్బు సంపాదిస్తుంటే ఏం చేద్దామను కుంటున్నారు?"
    "సమాధానంగా వెంకట్రావు నవ్వాడు.

                                     9
    వీరభద్రం ఆ ఊళ్ళో పెద్ద భూస్వామి. ఆయనా నలుగురు కొడుకులూ కలిసి సుమారు వంద ఎకరాల వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడు హటాత్తుగా అయన మనవడోకడు మాయమయ్యాడు. మాయమైన మర్నాడాయనకో వుత్తరం వచ్చింది.
    "వందేకరాలున్నాయి మీకు, అన్నీ అడగం మేము నీ ఇంట్లో అయిదుగురు మగవాళ్ళున్నారు నీతో కలిపి. మనిషి రెండెకరాల చొప్పున మీ పాలేళ్ళ లో అయిదుగురి నెంచుకుని మొత్తం పదెకరాలు దానంగా ఇచ్చేయి. నీ మనవడూ నీ దగ్గరకూ సురక్షితంగా చేరతాడు , సందేహించావో ఒక్కొక్కడే ఒక్కొక్కడే చొప్పున నీ వంశం సర్వనాశనమవుతుంది --- మిడతలదండు."
    వీరభద్రం ఆ వుత్తరం చాక్డువుకుని హడలిపోయాడు. ఇంటిల్లపాది కలిసి సమావేశమై మరోదారి లేదని నిర్ణయించుకొని ఉత్తరంలో వ్రాసినట్లే చేశారు. అయన మనవడాయనకు సురక్షితంగా చేరాడు.
    అదే వూళ్ళో నాంచారయ్య వున్నాడు. అతను వడ్డీ వ్యాపారి. ఆ వూళ్ళో చిల్లర వ్యాపారం చేద్దామనుకుంటున్న నలుగురు పేదవాళ్ళకు నాంచారయ్య చేత తలో పదివేలూ యిప్పించింది మిడతలదండు.
    ఆ వూరి ప్రెసిడెంటు కి నాలుగు భవంతులున్నాయి. ఒకదాన్ని గ్రామ పాఠశాలకు విరాళంగా ఇప్పించింది మిడతలదండు.
    ప్రతి వూళ్ళోనూ మిడతలదండు సహాయక చర్యలు అధికమయ్యాయి. సామాన్య ప్రజలకు మిదతలదండు అంటే సద్భావం కలుగుతోంది. ధనికవర్గం మింగాలేక, కక్కలేకా నానా అవస్థ పడుతోంది.
    ఆ సమయంలో ఒక నగరంలో కొత్త కట్టడం ప్రారంభమైంది. సుమారు పాతిక లక్షల వ్యయంతో నిర్మించబడుతున్న ఆ భవంతి మిడతలదండు అధ్వర్యంలో నిర్మించబడుతున్న మొత్తం పన్నెండుగురికి మాత్రమే తెలుసు. భవనం నిర్మించడానికి సంవత్సరం పట్టింది. అత్యద్భుతమైన ఆ భవనపు యజమాని గా ఒక యువతి ప్రవేశించింది. ఆమె పేరు స్వర్ణ.
    ఇన్ కంటాక్స్ డిపార్టుమెంటు రంగంలోకి ప్రవేశించింది. ప్రభుత్వం రహస్య పుటారాలు ప్రారంభించింది. దానిని బట్టి తెలిసిన వివరాలేవీటంటే స్వర్ణ అతి సామాన్యురాలు. ఆమె తలిదండ్రులు సాధారణ జీవితం గడుపుతుండి ఈస్థాయికి వచ్చారు.
    ఒక జమీందారు స్వర్ణ ను చూసి ముచ్చట పడి ఈమెను పెంచుకున్నాడు. అయన చనిపోగానే అయన తాలుకూ ఆస్తి సుమారు కోటి రూపాయల విలువ చేసేది యీమెకు చెందింది. ఫలితంగా ఈ భవనం నిర్మించబడింది. సంఘంలో అత్యున్నత స్థాయి వ్యక్తిగా జీవిన్చాలన్నది స్వర్ణ కోరిక. అందుకే ఆమె ఈ అద్భుత భవన నిర్మాణానికి తలపడింది.
    లత మిడతలదండు లో చేరినాక, ఒక సంవత్సరంలో సుమారు అయిదారు కోట్ల రూపాయల వరకూ సంపాదించి పెట్టింది. ఆమె శక్తి సామర్ధ్యాలు వెంకట్రావు కు సంభ్రమాశ్చర్యాలు కలిగిస్తున్నాయి. అయితే ఆమెకు యెవరన్నా భయం లేదు. దేనికీ అదరదు , బెదరదు.
    వెంకట్రావు కు కుడి భుజంగా వుంటూ కూడా ఆమె తను పోలీసుల మనిషినని అంటూనే వుంటుంది. అందువల్ల అతనామేను వెయ్యి కళ్ళతో కనిపెట్టవలసిందిగా తన అనుచరులను ఆదేశించాడు. అపుడప్పుడు లత పోలీసులతో మాట్లాడుతున్నట్లు ఆ అనుచరులకు అనుమానం వచ్చింది. అయితే అది తమను ఏడిపించడానికి ఆమె ఆడుతున్న నాటకమని అర్ధం కావడానికి వారికి కొద్ది రోజులు పట్టింది.
    తనకు కావలసిన వారెవరికి ఫోన్ చేసినా  ఆమె -- 'హలో పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ చంద్రశేఖరం గారేనా మాట్లాడుతుంట. నేను, లతను మాట్లాడుతున్నానండీ" అంటూ ప్రారంభించేది. ఫోన్ అందుకున్న మిడతలదండు సభ్యుడు వచ్చి చెప్పే వరకూ ఆమె ననుసరిస్తున్న వ్యక్తికీ బెంగాగానే ఉండేది.
    'అలాగని అజాగ్రత్తగా ఉండడానికి వీలులేదు. ఇలా నటించినటించి ఒకరోజున ఈమె నిజంగానే పోలీసులకు సమాచారం అందించవచ్చు." అన్నాడు వెంకట్రావు.
    "అలా అని నేననుకోవడం లేదు. ఈమెది చిలిపి మనస్తత్వం" అన్నాడు మురళి.
    "కావచ్చు, కానీ మన జాగ్రత్తలో మనముండాలి కదా!"
    "ఆమె మనకు చేస్తున్న సహాయం సామాన్యమైంది కాదు. ప్రతిఫలంగా అనుమానించడమొక్కటే ఆమెకు మనమిస్తున్న కానుక" అన్నాడు మురళి బాధగా.
    "ఇలాంటి సెంటిమెంట్లు పెట్టుకుంటే మనం మిగలం" అన్నాడు వెంకట్రావు.
    మురళి మాట్లాడలేదు. అతను చాలా పర్యాయాలు అతననుసారించి వెళ్ళేడు. ఆమె చిలిపితనమూ, నిర్భయత్వమూ అతన్ని ఆకర్షించాయి. అతనామెను ప్రేమిస్తున్నాడు.
    ఒకటి రెండు పర్యాయాలు తన ప్రేమంత నామే వద్ద చెప్పుకోగా "నువ్వు ప్రేమిస్తున్నావని చెప్పినంత మాత్రాన నన్ను పూర్తిగా అర్ధం చేసుకోగలననుకోకు. నేను యోగ మాయను. ఎవరికీ అర్ధం కాను" అని తేలిగ్గా తీసి పారేసింది. అంతకుమించి వివరంగా మురళి కూడా ఏమీ చెప్పలేకపోయాడు. ఎటొచ్చీ అతని ప్రేమా బాధ్యతకు అడ్డు రాలేదు. అతను జాగ్రత్తగా లతను కనిపెడుతూనే ఉన్నాడు.
    ఒకరోజున వెంకట్రావు తన అనుచరులందర్నీ సమావేశ పరిచి "నాకు ఇది అనూహ్యంగా వుంది. లతనుమీరు వేయి కళ్ళతో కనిపెడుతున్నప్పటికీ పోలీసులకు మన గురించిన సమాచారం తెలుస్తూనే ఉంది." అన్నాడు కోపంగా. అనుచరులందరి ముఖాల్లోనూ ఆశ్చర్యం స్పష్టంగా కనపడింది.
    "మిడతలదండు బహుశా యెంతో కాలం నిలబడదేమో. ఎంతో జాగ్రత్తగా ఇంతకాలమూ మసలుకుంటూ వచ్చాము. ఇప్పుడు మన రహస్యాలు బయట పడడం నాకు నచ్చలేదు."
    "ఏ రహస్యం బయట పడింది?"
    "స్వర్ణ పేరుతొ వెలసిన కొత్త భవనం మిడతలదండు స్థావరమన్న రహస్యం."
    "అయ్య బాబోయ్" అన్నాడు జగన్నాధం.
    "అది చాలా ముఖ్య రహస్యం.
    "ఇప్పుడెం చేయాలి?' అన్నాడు ప్రసాద్.
    "మీరందరూ ఒక్కొక్కరే ఆ భవనం చేరుకోవాలి. అక్కడ నేను మీ అందరకూ మన ముఖ్య కార్యక్రమం బయట పెట్టబోతున్నాను."'
    "ఇప్పుడేనా?"
    "కాదు, ఎల్లుండి రాత్రి యెనిమిది గంటలకు."'
    "లత కూడా ఆ సమావేశానికి వస్తుందా?"
    "ఆమె విషయంలో ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు."
    "రానివ్వండి. ఆమె మనతో పాటు వుండడమే మంచిది."
    "మిస్టర్ మురళీ! లత పై నీకున్న నమ్మకం నాకు లేదు. కానీ సమావేశాని కామెను జత పరచడం తప్పని సరి అనుకుంటున్నాను. ఎందుకంటె మనమందరమూ సమావేశమై నప్పుడు ఆమెను వేరే బయట వదల
దల్చుకోలేదు."
    "ఇంత వరకూ ఆమె చందమామను మనకు అప్పగించలేదు కూడా" అన్నాడు జగన్నాధం.
    వెంకట్రావు సాలోచనగా , "చందమామకు ముహూర్తం ఎల్లుండి రాత్రి. అది మనకు దక్కకపోతే లతకు ప్రాణాలు దక్కవు " అన్నాడు.

                                   10
    ఆమె కెవ్వుమని అరిచింది. అతను త్వరగా పరిగెత్తాడు. మరోసారి నీటిలో మునిగి తేలిందామె. అతను సందేహించకుండా వెంటనే నీటిలో దూకాడు.
    సరిగ్గా అయిదు నిముషాలకు అతనామెను రెండు చేతులతోటి ఎత్తుకొని నది ఒడ్డుకు తీసుకువచ్చాడు. అక్కడ పడుకో బెట్టి ప్రధమ చికిత్స ప్రారంభించాడు.
    ఓ అయిదు నిముషాల్లోనే ఆమె కళ్ళు తెరిచి "నేనెక్కడున్నాను?' అంది. అప్పటికి నది ఒడ్డున మరి కాస్త మంది జనం పోగయ్యారు.
    "నాపేరు రాజారాం. అప్పుడప్పుడు ఇక్కడకు వచ్చి పోతుంటాను. మీరెవరు?' అన్నాడతను.
    "నా పేరు స్వర్ణ. అంతులేని సంపద ఉంది నాకు. ఒక్కత్తినీ డ్రయివ్ చేసుకుంటూ ఈనది ఒడ్డుకు వచ్చాను. స్నానం చేయాలనిపించింది. నదిలో దూకాను. హటాత్తుగా ప్రవాహంలో పడిపోయాను." అందామె.
    అది ఊరికి కాస్త దూరంగా వున్న ప్రాంతం. సాధారణంగా అక్కడ అట్టే జనముండరు. కానీ సెలవు రోజులలో పిక్నిక్ కు జనం వస్తుంటారు. ఆరోజు సెలవు రోజు కాబట్టి కాస్త జనం వున్నారు. ఒక్కొక్కరే పోగయి-- జరిగింది తెలుసుకొని వెడుతున్నారు.
    ఆడవాళ్ళు బట్టలు మార్చుకోవడానికి అనువుగా అక్కడ ఒక షెడ్డు లాంటిది ఉంది. స్వర్ణ కారు దగ్గరకు వెళ్ళి బట్టలు తెచ్చుకుని షెడ్లో కెళ్ళి మార్చుకుని వచ్చింది.
    అతను ఆమె వంక పరీక్షగా చూస్తూ -- "చాలా అందంగా వున్నారు మీరు." అన్నాడు.
    "ఇంత అందమూ మీ దయ వల్లనే బ్రతికింది. మీ ఋణం తీర్చుకోలేను..." అందామె. ఆమె కళ్ళలో కృతజ్ఞత కొట్టవచ్చినట్లు కనబడుతోంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS