"అయితే నన్ను ప్రేమించగలరా?" అన్నాడతను చటుక్కున.
"ముందు కారెక్కండి" అంది స్వర్ణ ఏమీ చెప్పకుండా.
"నా ప్రశ్నకు సమాధానం దొరికితే గాని కారెక్కను." అన్నాడు రాజారాం.
"జంట కోసం వెతుకుతున్నాను నేను. కానీ మిమ్మల్ని ప్రేమించగలనో లేదో ఈ క్షణంలోనే చెప్పమంటే కష్టం" అంది స్వర్ణ. 'నాతొ కారెక్కండి. మనం కలిసి మెలిసి స్నేహితుల్లా మసలుదాం. మన పరిచయం దానంతటదే ప్రేమకు దారి తీస్తే ఏ బాధా లేదు."
"దారి తీయకపోతే..."
"ఏం చేస్తాం?" అంది స్వర్ణ.
'అప్పుడు నేనిదే నదిలో వురుకుతాను." నన్నెవ్వరూ రక్షించరు కూడా.
"కావాలని నీటిలో వురికిన వాణ్ని రక్షించడం కష్టమే మరి!" అని నవ్వింది స్వర్ణ. 'అయినా ముందు మన పరిచయం పెరగనివ్వండి. తర్వాత సంగతి ఆలోచిద్దాం."
'అలా అంటే ఎలా? అతనికి భవిష్యత్తు అంటే చాలా భయం మరి..." అన్న మాటలు వినబడి రాజారాం . స్వర్ణ ఇద్దరూ ఉలిక్కిపడి అటు చూశారు. కారు వెనుక నుంచి ఓక మనిషి వాళ్ళను సమీపిస్తున్నాడు. అతని చేతిలో రివాల్వర్ వుంది.
"ఎవర్నువ్వు?" అన్నారిద్దరూ అప్రయత్నంగా.
"మాప్టీలో వున్న పోలీసాఫీసర్ని . మిమ్మల్నిద్దర్నీ అరెస్టు చేయడానికి వచ్చాను.
"ఎందుకు?"
"ఎందుకేమిటి? చేసిన నేరాలకు!"
"నీళ్ళలో పడిపోయిన అమ్మాయిని రక్షించడం నేరమని నాకు తెలియదే!" అన్నాడు రాజారాం.
"పోనీ బ్యాంకులు దోచడం, హత్యలు చేయడం నేరమని తెలుసా?"
స్వర్ణ ఆశ్చర్యంగా అతన్ని చూసి -- "ఏమిటి మీరంటున్నది?" అంది.
"మిడతలదండు చేసిన అన్యాయాలూ, అక్రమాలూ అంత సులభంగా మాసిపోయేవి కాదు. అందుకు శిక్ష అనుభవించాక తప్పదు."
"వీడెవడో పిచ్చి వాడులాగున్నాడు. మాప్టీలో వున్న ఇన్ స్పెక్టరంటే నేను నమ్మను. వీడి మాటలు నాకేమీ అర్ధం కావటం లేదు" అన్నాడు రాజారాం.
"అటువంటప్పుడు నేను చెప్పినట్లు చేయడమే మంచిది. పిచ్చివాడి చేతిలో తుపాకీ వుంది." అన్నాడు ఆ వ్యక్తీ.
"ఏం చేయమంటావ్?"
"మర్యాదగా ఊళ్ళోకి నడు. పారిపోవడానికి ఏవిధమైన ప్రయత్నాలూ చేయకు. నా రివాల్వర్ నైనా తప్పించుకోగలవు కానీ చుట్టూ వున్న పోలీసులను తప్పించుకోలేవు. ...." అన్నాడా వ్యక్తీ. అతని మాటలు చాలా నమ్మకంగా వచ్చాయి.
విధి లేక ఇద్దరూ ముందుగా నడిచారు. వాళ్ళవెనకాలే అతను నడుస్తున్నాడు. దూరంగా వున్న కొంతమంది ఈ వన్నీ వేశాన్నాశ్చర్యంగా చూశారు తప్పితే ఏమీ చేయలేదు. ధైర్యవంతుడయిన ఒక విద్యార్ధి మాత్రం ఈ ముగ్గురికీ వీలయినంత దరిదాపుల్లో వుండి వీరి సంభాషణను నలుగురికీ వెళ్ళి చెప్పాడు.
వాళ్ళు ముగ్గురూ అలా నడుస్తుంటే వాళ్ళకు దూరంగా కొంతమంది మగవాళ్ళు వాళ్ళను అనుసరిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలన్న కుతూహలం తప్పితే యింకే కారణమూ అనుసరించే ఆ మగవారికి లేదు. సరదాగా పిక్నిక్ కని వచ్చిన అక్కడి వ్యక్తులలో ఒక్క సాహసికుడు కూడా లేకపోవడం రాజారాం, స్వర్ణ ల దురదృష్టం.
కొంతదూరం అలా ముగ్గురు నడిచేక వాళ్ళ ముందు ఒక జీపు వచ్చి ఆగింది. అది పోలీసు జీపు అని చూడగానే తెలుస్తోంది. అందులోంచి డ్రెస్ లో వున్న పోలీసులు దిగి మఫ్టీలో వున్న ఇన్ స్పెక్టర్ కి సెల్యూట్ చేశారు.
"వీళ్ళిద్దరకూ బేడీలు వేయండి." అన్నాడు ఇన్ స్పెక్టరు.
తమను నడిపిస్తున్నది నిజంగా ఇన్ స్పెక్టరేనని , తాము నడుస్తున్నది జైలు ప్రాంగణం లోని కని రాజారాం కీ స్వర్ణ కూ అర్ధమయింది. అయితే ఇదంతా ఎలా జరిగిందో అతని కర్ధం కాలేదు. అతన్ని అనుసరించి వస్తున్నా మధ్యమ సాహసికులు మాత్రం పోలీసు జీపు చూసేక తిరుగు ముఖం పట్టేశారు. ఎందుకయినా మంచిదని.
* * * *
"మిడతలదండు నాయకుడి అసలు పేరు రాజారాం. అతను సామాన్యుడైన వ్యక్తీ. కానీ అతను ప్రేమించిన స్వర్ణ అనే అమమయికి కోటీశ్వరుల జీవితం పై మోజు వుంది. ఆ అమ్మాయి అంటే రాజారాం కి పిచ్చి ప్రేమ. ఆమె కోరికను తీర్చడాని కతను నిశ్చయించుకున్నాడు. అతనికి వ్యాపారం చేసే తెలివి తేటలులేవు. హత్యలూ, దొంగతనాలు ఒంటరిగా చేస్తే ఏ చిన్న పొరపాటు వల్ల నయినా తను దొరికి పోవచ్చు. ఈ భయంతో అతను మిడతలదండు అన్న పేరు సృష్టించాడు.
కోట్లకొద్దీ రూపాయలు కూడ బెట్టడమే అతని ఆశయమైనప్పటికీ దానికి ఓ సంస్థ, ఆశయాలు-- అంటూ రంగులు పూశాడు. అన్యాయాలూ, అక్రమాలూ జరుగుతున్నా కొన్ని సంస్థలలోని కుళ్ళునతను బయటపెట్టి ఊరుకునేవాడు. ప్రజలను రెచ్చ గొట్టే ప్రచారాలు చేసేవాడు.
దేశంలోని యువతరంలోని అమాయకులా విధంగా రెచ్చ గొట్టబడ్డారు. వాళ్ళందర్నీ గుర్తించడానికీ , వాళ్ళకి అదేశాలివ్వడానికీ - తను బయటపడ కుండా వుండే రహస్య పద్ధతు లేర్పరచుకొని చాలా తెలివిగా వ్యవహరించాడు. అనుక్షణం అప్రమత్తుడై వున్న కారణంగా అతని అనుచరుల్లో చేరిన పోలీసు వారికి తమ వ్యవహారాలూ నడపడం చాలా ఇబ్బందిగా ఉండేది.
ఇతన్ని ఎదుర్కోవటానికి పోలీసు శాఖ సిబిఐ ఏజంట్ లతను నియమించింది. లత తను అందరికీ సిబిఐ ఏజెంట్ అని చెబుతూనే, మిడతలదండు వారికి తను పోలీసు శాఖ వారితో సంబంధం లేని వ్యక్తీ నన్న నమ్మకాన్ని కలిగించడానికి చాలా తెలివిగా ప్రయత్నించి కృతజ్ఞత్యురాలయింది.
లత రంగంలో ప్రవేశించడంతో మిడతలదండు నాయకుడు కనీసం కొంతమంది ముఖ్యమైన అనుచరుల ముందు బయట పడక తప్పలేదు. తన పేరు వెంకట్రావని అతను వారికీ అబద్దం చెప్పాడు. అయితే అందరి దృష్టి లత మీదనే వుంది.
ఆ విధంగా మిడతలదండు లో ముఖ్యుడుగా వుంటున్న పోలీసు మనిషి ప్రసాద్ కు కాస్త ఊపిరి పీల్చుకొనే సమయం వచ్చింది. అతను లత పై నిఘా పేరుతొ వెంకట్రావుకు సంబంధించిన రహస్యాలు చాలా తెలుసుకున్నాడు. రాజారాం లేక వెంకట్రావు ఏదో దేశానికి సంబంధించిన గూడచారి అనీ, ఆ దేశం వివరాలు తెల్సుకోవాలని ప్రభుత్వం అనుకోడం వల్ల అతన్ని కొంతకాలం పాటు ఉపెక్షించక తప్పలేదు.
ప్రసాద్ పరిశోధన ప్రకారం రాజారాం కు సంబంధించిన అసలు రాహస్యం బయటపడింది. అతను యే దేశం కోసమూ ఈ పనులు చేయడం లేదు. తన అనుచరుల్లో తన ముఖం తెలిసిన పది మందినీ అతను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. స్వర్ణ కు ఆస్తి కలిసి వచ్చినట్లుగా ప్రచారం చేసి, అమెను ప్రేమించిన వ్యక్తిగా తను రంగం లోకి ప్రవేశించి శేష జీవితం గడిపేద్దామనుకున్నాడు.
తన అనుచరులను హత్య చేయాలన్న అతని పధకానికి అవసరమైన సాక్ష్యాలు సంపాదించి, ఆ వివరాలు వారికీ తెలియజెప్పి, ఆ తర్వాత వాళ్ళను పోలీసుల పాల్జేశాడు ప్రసాద్. స్వర్ణ ను నది లోంచి రక్షించే నాటకం పూర్తయ్యాక, పోలీసులు రాజారాం నీ, స్వర్ణ నీ అరెస్ట్ చేశారు.
ఈ కేసులో ప్రసాద్, లతలు చూపిన ధైర్య సాహసాలను వర్ణించడం కష్టం. కానీ మన ప్రజలను చూస్తె నాకు జాలి వేస్తోంది. స్వార్ధం కోసం ఏదో నీతులూ, ఆశయాలు వల్లించే పరమ కిరాతకులనూ, దుర్మర్గులనూ వీళ్ళు అవలీలగా నమ్మి, సహకరిస్తున్నారు. వారి కోసం తమ ప్రాణాలనూ, జీవితాలనూ త్యాగం చేస్తున్నారు.
తను కోట్లకొద్దీ కూడబెట్టాలని రాజారాం అనుకోని యువతరాన్ని రెచ్చ గోడితే అందుకు అనుకూలముగా వాళ్ళు రెచ్చిపోయి ఎన్నో ఘోరాలు చేశారు. ఏ దేశమూ పూరి గొల్పకుండానే "చందమామ " ను సంపాదించి దాన్ని శత్రు దేశాలకు బేరం పెట్టాలని చూసిన దేశ ద్రోహి రాజారాం!"
అటువంటి దేశ ద్రోహుల అసలు రంగును గుర్తించి -- హింసకూ, దౌర్జన్యానికి పురి గొల్పే ఏ నాయకుడినీ గుడ్డిగా విశ్వసించడం మానేసి, మహాత్ముడు మనకు బోధించిన ధర్మ సూత్రాలను ప్రతి పౌరుడూ పాటిస్తే, మన దేశానికీ ప్రగతి మార్గానికి ఎంతో దూరముండదు. అటువంటి దినం త్వరలోనే రానున్నదని ఆశిస్తున్నాను...."
పోలీస్ కమిషనర్ ఉపన్యాసం పూర్తీ కాగానే అక్కడ చేసిన ప్రముఖులందరూ హర్ష ధ్వానాలు చేశారు.
--------: అయిపొయింది :--------
