Previous Page Next Page 
వసుంధర కధలు-10 పేజి 56

 

                                     8
    "రామం సంగతి అటుంచు. వాడినేమీ  చేయలేము. ఆ రెండో వాడి సంగతి ఆలోచించు. వాణ్ణి నువ్వు గుర్తు పట్టగలవా?" అన్నాడు సుబ్బారావు.
    "గుర్తు పట్టగలను. ముఖం బాగా గుర్తుంది కానీ వాడు మనకు కనపడోద్దూ?" అంది లీల. రాత్రీ జరిగిన ఘోరాన్ని పిన్నికి చెప్పుకున్నాక ఆమెకు మనసుకాస్త శాంతించింది. తల్లి వద్దకంటే పిన్ని దగ్గరే ఆమెకు చనువు ఎక్కువ. పిన్ని ఉపశమనం వాక్యాలు చెప్పాక ఆమె మనసు మరి కాస్త తేలిక పడింది.
    "జరిగింది పూర్తిగా మరిచిపో. ఇది నువ్వు కావాలని చేసిన తప్పు కాదు. అందుకు నిన్నే పాపమూ అంటదు. నువ్వు పరమ పవిత్రురాలివి. ఎటొచ్చీ నిన్నిలా భంగాపరిచి భవిష్యత్తు లో అడుకోవాలను కుంటున్న ఆ వెధవ సంగతి తేల్చి పారేయాలి. ఇది నా ఊహ శక్తికి పరిక్ష...." అన్నాడు సుబ్బారావు లీలతో.
    ఆ సందర్భంలో ఆమె నాతను రకరాకాల ప్రశ్నలు వేశాడు. తనకు తెలిసిన వాళ్ళ ఫోటోలు, తను సేకరించిన నేరస్థుల ఫోటోలు చూపించాడు . అందులో ఎక్కడా లీల బట్టలు తీసుకున్న మనిషి ఫోటో కనపడలేదు.
    సుబ్బారావు బాగా అలోచించి "అన్నట్లు నీకు డ్రాయింగ్ వచ్చును కదూ" అన్నాడు.
    "వచ్చును కానీ మనుషుల ముఖాలను యధాతధంగా చిత్రించలేను" అంది లీల.
    "చిత్రలేఖనం రావాలి కానీ అదేం బ్రహ్మ విద్య కాదు, నా బొమ్మ వేసి చూపించు" అన్నాడు సుబ్బారావు.
    లీల సుబ్బారావుని ఎదురుగా పెట్టుకుని ఒక బొమ్మ వేసింది.
    సుబ్బారావు కు ఆ బొమ్మను చూసి ఏడవాలో నవ్వాలో తెలియలేదు. ఎక్కడా తన పోలికలు రాలేదు. అతని భార్య మాత్రం ఆ బొమ్మ చూసి ఇలాంటి మనిషిని ఎక్కడో చూసినట్లుందండీ " అంది.
    "ఎక్కడో చూడ్డమేమిటి -- అది బాబాయి బొమ్మ. అంత బాగా రాకపోయినా దగ్గర పోలికలుండి వుంటాయి. అందుకే నీకు అలా అనిపించి ఉంటుంది" అంది లీల కాస్త గర్వంగా.
    ఆమె పిన్ని మాత్రం లోపలకు వెళ్ళి అయిదు నిమిషాల్లో ఓ ఆల్బం తీసుకుని వచ్చింది.
    ఆ ఆల్బం లో ఒకఫోటో లోని వ్యక్తీ అచ్చం లీల గీసిన ఫోటోలోని మనిషిలా ఉన్నాడు.
    "వీడా ? చాలా దూరపు వరుసలో నాకు తమ్ముడౌతాడు. " అన్నాడు సుబ్బారావు.
    "మొత్తం మీద మీ అమ్మాయి గట్టిదే. మిమ్మల్ని చూసి మీ బంధు వర్గంలోని వాళ్ళ ఫోటో వేయగలిగింది." అంది సుబ్బారావు భార్య.
    "భగవంతుడు సృష్టిలో కొత్త కొత్త పోలికలు తీసుకు రావాలనుకున్నప్పుడు లీల వంటి చిత్రకారిణి సాయం తీసుకుంటాడనుకుంటాను" అన్నాడు సుబ్బారావు. అతను జోక్ వెశాడనుకుని భార్య నవ్వింది కానీ అతని ముఖం చాలా సీరియస్ గా వుంది. ఆ దుర్మార్ద్గుడెవరో తెలుసుకోవాలని అతనికి ఉంది. కానీ ఇప్పుడున్న అసహాయ పరిస్థితి అతని రక్తాన్ని మరిగిస్తోంది.

                                    9
    "రాఘవరావు గారు నేను డిటెక్షన్ ప్రారంభిద్దామనుకుంటున్నాను" అన్నాడు సుబ్బారావు.
    "ఎందుకని, మా పోలీసు దిపార్టు మెంటు మీద నమ్మకం లేకనా?" అన్నాడు రాఘవరావు.
    "ఎంతమాట? పోలీసుల్ని తప్పుగా అనుకోవడానికి వాళ్ళెం దేవుళ్ళు కాదు కదండీ. మీరూ మాకులాంటి మనుషులే! మీ శక్తి కొద్ది ప్రయత్నించి నేరస్థుల ఆచూకీ తెలుసుకుంటారు. నేరస్థులు మరీ తెలివి ,మీరిపోతుంటే మీరు మాత్రం ఏం చేయగలరు? నాకు కొంచెం ఊహాశక్తి ఉన్నది కదా! దాంతో డిటెక్షన్ చేసి ఉడతా భక్తిగా మీకు సాయపడాలని నేను అనుకుంటున్నాను." అన్నాడు సుబ్బారావు.
    "చాలా థాంక్సండి - మాకు సాయపడగాలిగినా లేకున్నా మీరు మా గురించి ఓ మాటన్నాడు. అదే చాలు. ఇంతకీ మీ డిటెక్షన్ ఎట్నించి ప్రారంభిద్దామని?"
    "ఇటీవల మీ అనుభవం లోకి వచ్చిన కేసుల్ని బట్టి నాకో చిన్న అనుమానం వచ్చింది. అది ఇదివరలో మీకు చెప్పి ఉన్నాను. ఓ కొత్త బ్లాక్ మెయిలర్ ఊళ్ళో ప్రవేశించాడు. వాడు నేరస్థులపై ఓ కన్నువేసి ఉంచి వాళ్ళ బలహీనతలను ప్రోత్సహించి వాళ్ళ చేత నేరాలు చేయిస్తున్నాడు. తర్వాత కొన్ని సాక్ష్యాధారాలు సంపాదించి బ్లాక్ మెయిలింగ్ కి ఉపయోగించు కుంటున్నాడు." అన్నాడు సుబ్బారావు.
    "ఈ ఆలోచన అంత సమంజసంగా ఉన్నట్లు తోచదు. జరిగిన అన్ని నేరాల్లోనూ బ్లాక్ మెయిలింగ్ కు అవకాశం ఉన్నదనిపించదు" అన్నాడు రాఘవరావు.
    'అవుననుకోండి . మీతో నేనూ ఏకీభవిస్తున్నాను. కానీ అసలు విషయం తేలేవరకూ అలా అనుకుందాము. బ్లాక్ మెయిలింగ్ కోసం కాకపోయినా మరెందుకో ఆ వ్యక్తీ సాక్ష్యాధారాలు కాజేస్తున్నాడు. అంటే ఇందులో మనకు రెండు విషయాలు అర్దమవుతున్నాయి. నేరం జరగడానికి అతను ప్రోత్సహిస్తున్నాడు , నేరం జరిగాక నేరానికి సంబంధించిన సాక్ష్యాధారాలు దొంగిలిస్తున్నాడు. దీని ఆధారంగా హంతకుడ్ని నేను ట్రాస్ చేయాలను కుంటున్నాను. అందుకు మీ సహకారం కావాలి."
    "నా సహకారం మీకు తప్పకుండా వుంటుంది. కానీ ఒక్క ప్రశ్న. నేరం జరగడానికి అతనెవరో ప్రోత్సహిస్తున్నాడని , నేరం జరిగేక సాక్ష్యాధారాలు దొంగిలిస్తున్నాడని మీరెలా అనుకుంటున్నారు?"
    ఇన్ స్పెక్టర్ సూటి ప్రశ్నకు సుబ్బారావు తడబడ్డాడు. అవును- తను అలా అనుకోడానికి కారణం లీల అనుభవం! అయితే ఆ విషయం పదిమందికీ చెప్పగలడా! అది తనకూ లీలకూ తన భార్యకు మధ్య మగ్గి పోవలసిన భయంకర రహస్యం.
    "ఇదంతా నా ఊహ" అన్నాడు సుబ్బారావు.
    "మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. ఏ ఊహకైనా ఏదో అధారముంటుంది. అది మీరు నాకు చెప్పడానికి కిష్టపడ్డం లేదు" అన్నాడు రాఘవరావు.
    సుబ్బారావు అప్పటికి పుంజుకున్నాడు. "ఏదైనా వింత కేసు తగిలితే దాని గురించి అదేపనిగా ఆలోచిస్తుంటాను నేను. అలాంటప్పుడు ఇకో పర్యాయం అనుకోకుండా వింత పరిష్కారాలు స్పురించవచ్చు. ఇంట్యుషన్ గురించి మీరు ఎరుగరనుకొను."
    "మీ ట్రాప్ చెప్పండి" అన్నాడు రాఘవరావు.
    "అమ్మయ్య దారికి వచ్చావు" అనుకున్నాడు సుబ్బారావు. 'చాలా సింపుల్, అయితే నాక్కాదు , మీకు! బహురంగంగా ఎక్కడైనా నేరానికి ప్రయత్నం జరగాలి. తర్వాత నేరస్థుడు ఆ నేరాన్ని వాయిదా వేసుకుంటూ పోవాలి. వాయిదాలు వేసే ఆ నేరస్థుడి వద్దకు మనం వెతుకుంటున్న నేరస్థుడు వస్తాడని నా అనుమానం. అదే జరిగితే ఎన్నో కేసులు పరిష్కారమవుతాయి."    
    "పధకం బాగుంది కానీ నాకు హోప్ లేదు"అన్నాడు రాఘవరావు.
    సుబ్బారావు నవ్వి "ఆరంభింపరు  నీచ మానవులు" అంటూ పద్యం చదివాడు.
    "మీరు పద్యం బాగా చదువుతారు. ఎటొచ్చీ తెలుగు నాకు బాగా రాదు. అర్ధం తెలియదు...." అన్నాడు రాఘవరావు.
    "తెలియకపోవడమే మంచిది. కానీ నా పధకం ఫలించదేమోనని అనుమానం పెట్టుకుని మీరు గనుక ప్రయత్నించక పొతే ఈ పద్యానికి మీకు అర్ధం చెప్పవలసి వుంటుంది " అన్నాడు సుబ్బారావు.
    "ఇందులో పోయిందేముంది? చిన్న ట్రబుల్ , అంతేగా! చేసేస్తాను. మీ చేత ఆ పద్యానికి అర్ధం మాత్రం చెప్పించు కొను" అని నవ్వాడు రాఘవరావు.

                                    10
    "అతనికి మీతో మాట్లాడ్డం ఇష్టం లేదుట" అన్నాడు రిసెప్షనిస్ట్ ఫోన్ క్రింద పెట్టేసి.
    'అయినా సరే నేను మాట్లాడాలి. ఆ రూం దగ్గరకు వెడతాను" అన్నాడతను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS