అతను లేచి ఆమెను సమీపించి - ఆమె పార వేసిన ప్లాస్టిక్ సంచీని తీసుకున్నాడు. నలిగి చిరిగిన ఆమె తను వీలైనంతలో మడత పెట్టి ఆ ప్లాస్టిక్ సంచీ లో పెట్టాడు. లీల ఆశ్చర్యంగా అతని వంక చూసింది.
"ఈ బట్టలు స్టీలు సామాను వాళ్ళు కూడా తీసుకోరు. నీకు కొత్త బట్టలిప్పించినందుకు ప్రతిఫలంగా వీటిని నేను తీసుకుంటున్నాను...."అన్నాడతను.
"ఏం చెసుకుంటావ్ ....వాటిని?" అంది లీల.
"కాబోయే లక్షాధికారిణి భార్యకు జరిగిన మానభంగానికి ఇంతకంటే మంచి సాక్ష్యం వుంటుందా?" అని నవ్వాడతను.
లీల బెదిరిపోయింది. ఇదంతా ఏదో పెద్ద పధకం లా వుంది. తనకు లక్షాధికారి సంబంధం వచ్చిందని అసూయతో రామం ఈ పని చేశాడని తను అనుకుంది కానీ ముందు ముందు తన జీవితాన్ని నరక ప్రాయం చేయడానికి జరుగుతున్నా కుట్రగా గుర్తించ లేకపోయింది.
'అర్ధమైంది , ముందుముందు నన్ను బ్లాక్ మెయిల్ చేసి డబ్బు గుంజాలను కుంటున్నారు. కానీ నేను అలా కానివ్వను. అసలా లక్షాధికారి సంబంధం కాదంటాను. పైసా లేని వాణ్ణి చూసి పెళ్ళి చేసుకుంటాను. అప్పుడు మీరు నన్ను చంపినా పైసా కూడా రాదు...." అంది లీల.
"నిప్పు కాలుతుంది గదా అని దాన్ని వంట చేసుకోడానికి ఉపయోగించడం మానేయడం వల్ల మాడేది కడుపేనని తెలుసుకో...."
"ఎవర్నున్వూ?" అంది లీల- "రామానికి బంటువా?" అతని ముఖం గంబీరంగా అయిపొయింది -- "రామానికి నేను బంటు నా అయితే గియితే , ఆ రామామే నాకు బంటు కావాలి!" అన్నాడు.
"ఏదో ఒకటి - మీ యిద్దరూ యెందుకు లాలూచీ పడ్డారు? రామంతో నీకు సంబంధం ఏమిటి?" అంది.
"నేను దేశ సంచారం చేస్తూ నేరస్థుల ఇబ్బందులు చూసుకుంటుంటాను. నేరం చేయాలని వుండి కూడా పరిస్థితుల ప్రాబల్యం వల్ల , మానసిక దౌర్భాల్యం వల్ల నేరాలు చేయలేక పోతున్న వారికి అవసరమైన ధైర్యాన్ని , ఆర్ధిక కత్వాన్నీ సమకూర్చి వారిని నేరం వైపు పూరి కోల్పుతాను."
రామానికి నీ మీద పగ తీర్చుకోవాలని చాలా కాలంగా వుంది. అది నేను పసిగట్టి అతన్ని ప్రోత్సహించి యీ రోజు మీ ఇద్దరికీ తోలి సమాగమం ఏర్పాటు చేసి మీ ఇద్దరికీ తెలియకుండా దూరాన్నించి గమనిస్తూన్నాను. నీకు మళ్ళీ అమర్యాద లేకుండా వుండడం కోసం దుస్తులతో సిద్దంగా వున్నాను. ఇప్పుడు నిన్ను చూస్తుంటే ఆడది మాములుగా కంటే బట్టల్లోనే ఎక్కువ అందంగా ఉంటుందని అర్ధమవుతోంది.
ఇప్పుడు నిన్ను చూస్తుంటే ఎంగిలికూడు అనిపించడం లేదు. నీలాంటిది భార్య అయితే బాగుండుననిపిస్తోంది. అయినా నిన్నేమీ చేయను. కాస్త దూరం లో నా కారుంది. నాతొ వస్తే ఊళ్ళో దిగాబెదతాను. పిచ్చి పిచ్చి అనుమానాలేమీ పెట్టుకోక అనుకున్న సంబంధం హాయిగా చేసుకుని సుఖపడు. నావల్ల నీకేమీ ఇబ్బంది వుండదు"అన్నాడతను.
'అయితే యిదంతా ఎందుకు చేశావు?" అంది లీల.
"జస్ట్ ఫర్ ఫన్. ప్రపంచంలో నేరాలు వర్ధిల్లాలి అన్నది నా కోరిక. నా ఆశల మేరకు అవి వర్ధిల్లాట్లేదన్నది నా బాధ" అన్నాడతను.
అతను ఎన్ని చెప్పినప్పటికీ బ్లాక్ మెయిలింగ్ అతను అసలు ఉద్దేశ్యమని లీల ఊహించింది. "నన్ను బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తే నేనైనా చస్తా నిన్నైనా చంపుతాను" అంది.
'అంత పని మాత్రం చేయను. నేను నీకు వస్తదానం చేసి అలనాటి శ్రీకృష్ణపరమాత్మను మించి పోయాను. నేను నీకు దైవ సమానుణ్ణి. నీకు అన్యాయం చేసిన రామం, అతన్ని నువ్వు చంపాలనుకుంటే అది న్యాయం. ఎప్పుడైనా నీకు అటువంటి ఆలోచన పుడితే నాకు చెప్పకుండా మాత్రం చేయకు. ప్రమాదం లేకుండా హత్య చేయడానికి మంచి పదకాలున్నాయి నా దగ్గర అన్నాడతను.
లీల అతని మాటలకు నివ్వేరపోయినా తమాయించుకుని, "అలాగే నీ అడ్రసు చెప్పు" అంది.
"నాకు అడ్రసేమిటి?" అని అతను నవ్వి "ఏమి యిబ్బంది వుండదు, హత్య చేయాలన్న ఆలోచన నీలో ప్రవేశిస్తే నేను నీకు ఎలాగూ కనబడతాను" అన్నాడు.
7
"ఎవరు?" అంటూ ఉలిక్కిపడి లేచాడు సుబ్బారావు.
"నేను బాబాయ్!" అంది లీల తడబడుతూ.
"నువ్వా - ఏంటమ్మా యింత ఆలస్యంగా వస్తున్నావ్" అంటూ అతను వీధి అరుగు మీద స్వేచ్ వేశాడు. దీపం వెలిగింది. సుబ్బారావు కళ్ళు నులుముకుని ఒక పర్యాయం లీల వంక చూశాడు. ఆమెను చూడగానే అతనికి అన్న కూతురు కు బదులు భార్య గుర్తుకు వచ్చింది. లీల ముఖంలో చాలా మార్పు వుంది.
"నువ్వు సాయంత్రం నాలుగున్నరకు ఇల్లు వదిలి పెట్టావు. స్నేహితురాలితో మొదటి అట సినిమాకు వెళ్ళి వచ్చేస్తానన్నావు. ఇప్పుడు రాత్రి పన్నెండయింది. మొదటి అట వదిలిపెట్టి రెండున్నర గంటలకు పైగా అయింది. నీ ముఖం చూస్తుంటే సినిమా చూసి వస్తున్నట్లు లేదు. వెళ్ళే టప్పుడు నువ్వు కట్టుకున్న బట్టలు వేరు. ఇప్పుడు కట్టుకున్నవి వేరు. ఏదో జరిగింది" అన్నాడు సుబ్బారావు.
బాబాయి సంగతి లీలకు బాగా తెలుసు. ఆతడు ఏ విషయాన్ని వదిలి పెట్టడు. ప్రతి విషయాన్నీ క్షుణ్ణంగా పరిశీలించి అలోచించి అసలు సంగతి ఊహలో తెలుసుకునెందుకు ప్రయత్నిస్తాడు. అతని కళ్ళబడడం తన దురదృష్టం.
"చెప్పు ఏం జరిగిందో" అన్నాడు సుబ్బారావు.
"ఏముంది బాబాయ్ . స్నేహితు రాలింటికి వెళ్ళాను. దానికి నా చీర నచ్చింది. దాని చీర నేనూ, నా చీర అది కట్టుకున్నాం. సినిమా అయేక కాసేపు వాళ్ళింట్లో గడిపాము. మాటల్లో టైం తెలియలేదు. అంతే - దీనికి నువ్వు లక్ష ప్రశ్నలు వేస్తున్నావు" అంది లీల.
"ఎవరా స్నేహితురాలు?" అన్నాడు సుబ్బారావు.
సినిమాకు వెళ్ళడం కోసం ఇంట్లో స్నేహితురాలని పేరు చెప్పింది కానీ ఆమె సినిమా ఒంటరిగానే చూసింది. అందువల్ల ఆమెకు ఏం పేరు చెప్పాలో తెలియక చటుక్కున "నళిని!" అంది.
"అయితే నువ్వు చెప్పే దాంట్లో ఇంకా చాలా అబద్దాలు న్నాయి. నళిని లావులో నీకు రెట్టింపు ఉంటుంది. ఆమె జాకెట్ నీకు సరిపోదు. వెళ్ళేటప్పుడు ఆకుపచ్చ చీర మీద మ్యాచింగ్ జాకెట్ తో వెళ్ళాడు. వచ్చేటప్పుడు గులాబి రంగు చీర మీద మ్యాచింగ్ జాకెట్ తో వస్తున్నావు. నిజం చెప్పాలంటే నీ చీర ఇప్పుడే బజార్నించి కొన్న దానిలా ఉంది ." అన్నాడు సుబ్బారావు.
"అయితే నన్నేం చేయమంటావ్!" అంది లీల చిరాగ్గా.
సుబ్బారావు ముఖం గంబీరంగా మారిపోయింది. "వీధిలో అనవలసిన మాటలు కావివి లీలా" అంటూ అతను స్వరం తగ్గించి "నీ ముఖం నిండా గాట్లు, రక్కులున్నాయి. నీ మెడ మీద కూడా ఉన్నాయి. నువ్వు నా దగ్గర అబద్దం చెప్పకు. జరిగింది జరిగినట్లు చెప్పేసెయ్. నేనునీకు బాబాయ్ నే కానీ పరాయి వాణ్ని కాదు" అన్నాడు.
వెంటనే లీల ముఖంమీద చేతులు కప్పుకుంది. ఆమెకు ఏడుపు వస్తున్నట్లు అతను గ్రహించాడు. భారంగా నిట్టూర్చి జేబులోంచి తాళం తీసి తలుపులు తెరిచి లోపలకు వెళ్ళాడు. లీల అతన్ని అనుసరించింది.
సుబ్బారావు కు వీధి అరుగు మీద పడుకోవడం అలవాటు. అటువంటప్పుడు అతను ఇంటికి తాళం పెట్టి తాళం చొక్కా జేబులో వేసుకుని నిద్రపోతాడు. ఆ కారణంగా లీలకు అతన్ని లేపక తప్పింది కాదు.
సుబ్బారావు లోపలకు వెళ్ళి భార్యను పిలిచి, లీల గురించి తనకున్న అనుమానాలు చెప్పి, "నిద్రపోయినప్పుడు లీల వళ్ళు పరీక్షించు. లాలించో, బెదిరించో లీల చేత నిజం పలికించు" అన్నాడు. అమెసరే నన్నాక అతను మళ్ళీ వీధి అరుగు మీదకు వెళ్ళి తలుపు తాళం వేసి పడుకున్నాడు.
