బాస్ కూతురు రోమానితో , తన మేనల్లుడు గడమైన ప్రేమలో పడ్డాడని తెల్సుకుంటాడు. తన కూతురుని పెళ్ళి చేసుకొమ్మని అడిగి, అతని మనసును బాధపెట్టడం ఇష్టం లేక, మేనమామ తిరిగొచ్చేస్తాడు.
కల్యాణికి, తెలీకుండా ఒక సంబంధం నిశ్చయం చేస్తాడు. తనకు వేరే వ్యక్తితో సంబంధం ఖయాం చేస్తున్నారని తెల్సుకున్న కల్యాణి భరించలేకపోతుంది.
తొలిరోజు రాత్రి ఇల్లు వదిలి పారిపోతుంది. పాండిచ్చేరి చేరుతుంది. ఆమెను డిసౌజా ఆదరిస్తాడు. ఆ సమయంలో రోమాని, ఆనంద్ మద్రాసు వెళ్తారు.
కళ్యాణి, ఆనంద్ ల అనుబంధాన్ని తెలుసుకుంటాడు డిసౌజా.
ఆనంద్, రోమాని మద్రాసు నుంచి తిరిగొస్తారు. కళ్యాణిని చూసి ఆశ్చర్యపోతాడు ఆనంద్ - ఆదరిస్తాడు.
వారం రోజులు గడుస్తాయి.
ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి డిసౌజాకి వర్తమానం వస్తుంది. కుటుంబంతో పాటు, స్వదేశానికి వచ్చెయ్యమని! ఏం చెయ్యాలో తోచదు రోమానికి.
కొన్ని సంఘటనల తర్వాత -
కన్నీళ్ళతో డిసౌజాకి, రోమానికి వీడ్కోలు చెప్తాడు ఆనంద్.
కల్యాణి, ఆనంద్ తనకు దక్కాడని ఆశిస్తుంది. కాని విమానంలో వెళ్తున్న రోమాని తండ్రిని ఒక ప్రశ్న వేస్తుంది.
ఆనంద్ జీవితం నుంచి తప్పుకో అమ్మా అని నువ్వు చెబితే నేను విన్నానా? ఆ మాత్రం దానికి, ఎన్నో ఏళ్ళుగా అనుబంధం పెంచుకున్న పాండిచ్చేరిని వదిలిపెట్టడం అన్యాయం కదూ - ఫ్రెంచి ప్రభుత్వం నుంచి అక్కడకు వచ్చెయ్యమని వచ్చిన లెటర్ అబద్దం కదూ .....నువ్వు సృష్టించిందే కదూ ----అని అడుగుతుంది.
కూతురు రోమాని కళ్ళలో కదిలిన కన్నీళ్ళకు, అడిగిన మాటకు బడులివ్వలేక పోతాడు డిసౌజా.
"కళ్యాణి, ఆనంద్ ని ఎంతగా అభిమానిస్తుందో నాకు తెలుసు డాడీ అంటుంది రోమాని.
అంతే సార్......" కధ చెప్పాడు డైరెక్టర్ నారాయణబాబు.
కధ నచ్చింది జయేంద్ర కు . ప్రారంభంలో తను, రుక్మిణి నటించిన సినిమాలు కూడా సున్నితమైన ప్రేమ చుట్టూ తిరిగిన సబ్జెక్టులే.
'ఈ సినిమాను తప్పకుండా సూపర్ హిట్ట్ చెయ్యాలి.'
నిర్ణయించుకున్నాడు జయేంద్ర.
"పేరెం పెడదాం......." అడిగాడు జయేంద్ర.
"అయిదు పేర్లు రడీ చేసి ఉంచాను సార్......." అ లిస్టును చూపించాడు జయేంద్రకు , డైరెక్టర్ నారాయణబాబు.\
అందులో ఒక పేరు బాగా నచ్చింది జయేంద్రకు.
"కనుపాపల్లో కాటుక.'
"టీవీ రాజు సంగీతం, ఆత్రేయ మాటలు, అవిసేట్టి , కొసరాజు పాటలు.
మొదటి హీరోయిన్ పాండిచ్చేరికి, నిజంగా ఫ్రెంచి కుటుంబానికి చెందిన అమ్మాయినే సెలక్ట్ చేసారు. రెండో అమ్మాయి కొత్త హీరోయిన్.
సినిమా షూటింగ్ ప్రారంభమైంది.
ఎక్కువ భాగం "పాండిచ్చేరి ' లోనే 'షూట్' చేసారు. కొన్ని పాటలు అరకులోయలో షూట్ చేశారు. ఎప్పటికప్పుడు రషెస్ చూస్తూన్నాడు జయేంద్ర.
సినిమా అద్భుతంగా వస్తోంది. రెండు నెలల్లో సినిమా షూటింగ్ పూర్తయిపోయి, ఫస్ట్ కాఫీ చేతిలోకొచ్చింది.
ప్రివ్యు చూసిన సినిమా జర్నలిస్ట్ లు "కనుపాపల్లో కాటుక ' సినిమాను ఆకాశాని కేత్తేసారు.
సినిమా ఆంధ్రప్రదేశ్ లో రిలీజైంది.\
'కనుపాపల్లో కాటుక' సినిమా సూపర్ హిట్ అయింది. సినిమాలో నటించిన ఫ్రెంచ్ అమ్మాయి, సినిమాలో లాగానే, సినిమా రిలీజైన కొన్ని రోజులకే 'ఫ్రాన్స్' వెళ్ళిపోయింది.
రెండో హీరోయిన్ గా నిటించిన అమ్మాయికి వరసగా అవకాశాలు వచ్చాయి.
ఆ అమ్మాయి పేరు :
కృష్ణ వందన.
తర్వాత వాళ్ళిద్దరూ కలిసి నటించిన అయిదు సినిమాలు సూపర్ హిట్టయ్యాయి. అయిదు సినిమాలూ, సున్నితమైన ప్రేమనే ఆవిష్కరించినవే కావడం విశేషం.
విమల్ హీరోగా ఎస్టాబ్లిష్ కావడంతో, జయేంద్ర పూర్తిగా హీరో వేషాలు తగ్గించేసాడు. అప్పుడప్పుడు కేరక్టర్ రోల్స్ వేయడం ప్రారంభించాడు.
ఆ సమయంలోనే ------
అతని దృష్టి రాజాకీయాల మీదకు మళ్ళింది. దానికి మిత్రుల ప్రోద్భాలమూ తొడయింది.
పార్లమెంట్ ఎన్నికలలో అధికార పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసాడు జయేంద్ర.
ఆరు లక్షల ఓట్లలో , నాలుగు లక్షల ఓట్లకు పైగా సంపాదించి తిరుగులేని మెజార్టీ సాధించాడు.
తన భార్య పేరున అద్భుతమైన కేన్సర్ హాస్పిటల్ నిర్మాణం జయేంద్ర ధ్యేయం.
* * * *
సముద్రపు గాలి, మంచు ముద్దలా చల్లగా తగలడంతో మగత లోంచి బయటపడ్డాడు విమల్.
